పెండ్లి కి ముందు తొందరపడే అమ్మాయిలకు చెంప పెట్టు లాంటి డిల్లీ కోర్టు వారి తీర్పు!.

                                                         
                                                                         
Narasimha Rao Maddigunta (Manavu). 

                     "వివాహానికి పూర్వం సెక్స్ లో పాల్గొనడం ని ప్రపంచం లోని ఏ మత  విదానాలు అనుమతించలేదు కాబట్టి అది ఖచ్చితంగా అనైతికం అవుతుంది. అంతే కాదు పెండ్లికి పూర్వం సెక్స్ సంబందాలు కలిగి ఉండడం నేరం కాదు అని గతంలో సుప్రీంకోర్టువారు "కుష్బూ " కేసులో స్పష్టం చేసినందున ,అటువంటి పనిని అత్యాచారం క్రింద కూడా పరిగణించ లేము " అని డిల్లీ సెషన్స్ కోర్టు జడ్జ్ శ్రీ వీరెందర్ భట్ స్పష్టం చేశారు. పెండ్లికి ముందు తనను పెండ్లి చేసుకుంటాను అని ప్రమాణం చేసిన తర్వాతే తాను ప్రేమించిన  వ్యక్తితో సెక్స్ లో పాల్గొన్నాను అని , కానీ దానీ తర్వాత ఆ వ్యక్తీ తనను పెండ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని , కాబట్టి తన మీద అత్యాచారం చేసినట్లేనని అని వాదించిన బాదితురాలి వాదనతో కోర్టు వారు అంగీకరించలేదు.ఆ వ్యక్తీ చేసింది అత్యాచారం కాదని , కేవలం ఇష్ట పూర్వక లైంగిక సంబంద ప్రక్రియ మాత్రమే అని  సెషన్ జడ్జ్ జడ్జ్మెంట్.ఇటివలే జుద్జ్మెంట్ వెలువరించిన ఈ కేసు వివారాలు లోకి వెళితే,

   ఆమె ఒక ఉద్యోగిని. వేరే డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉద్యోగిని ప్రేమించింది. ఆమె ను పెండ్లి చేసుకుంటాను అని ఆ ప్రేమికుడు ఇచ్చిన మాట నమ్మి ఆమె తన సర్వసాన్ని అతనికి అర్పించిందట. ఆ తర్వాత ఆతను పెండ్లి చేసుకోను పొమ్మంటే 2011 లో అతని మీద రేప్ కేసు పెట్టడం జరిగింది. ఆమె తో చేసిన బాసలు , సెక్స్ సంబందం కలిగి ఉండడం రెండింటిని ఆ ప్రేమికుడు ఖండించాడు. ఇరువైపులా వాదన విన్న సెషన్స్ జడ్జ్ గారు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా  పై తీర్పును వెలువరించారు.

  " ఒక చదువుకున్న మరియు ఉద్యోగం చేస్తూ ఉన్న అమ్మాయి, పెండ్లికి పూర్వం తన కొలీగ్స్ తో కాని, స్నేహితులతో కానీ , వారు పెండ్లి చేసుకుంటాను అని హామి ఇచ్చినా సరే , వారితో సెక్స్ సంబందం కలిగి ఉండడం అనేది ఆమె స్వంత రిస్క్ తో తీసుకున్న నిర్ణయం అవుతుంది . పరస్పర అంగీకారం తో సెక్స్ లో పాల్గొన్న వారు, పెండ్లి చేసుకుంటాను అనే ప్రమాణం నేరవేర్చనంత మాత్రానా అది అత్యాచారం క్రిందకు రాదు . పెండ్లికి పూర్వం సెక్స్ సంబందాల కోసం చేసే పెండ్లి ప్రమాణాలు నేరవేర్చబడతాయి అనే గ్యారంటి ఏమి లేదు అనే అవగాహనతో, దాని వలన ఎదురయ్యే అన్ని పరిణామాలు దృష్టిలో ఉంచుకునే స్త్రీలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ,మగవాడు తన హామిని నెరవేర్చ వచ్చు, నెరవేర్చక పోవచ్చు, కానీ పెండ్లికి పూర్వం సెక్స్ లో పాల్గొనడమనే ఒక నీతి బాహ్యమైన , ప్రపంచం లో ఏ మతమూ అంగీకరించని ఒక పనిని తాము చేస్తున్నాను అని స్త్రీ అర్దం చేసుకోవాల్సి ఉంటుంది" అని కూడా జడ్జ్ గారు తన తీర్పులో తెలిపారు. నిజంగా ఈ  తీర్పు పెండ్లి కి ముందు తొందరపడే అమ్మాయిలకు చెంప పెట్టు లాంటిదే!.

  మరి అయితే  పురుషులు పెండ్లికి పూర్వం సెక్స్ లో పాల్గొనడం నీతి బాహ్యం కాదా అంటే ఖచ్చితంగా నీతి బాహ్యమే అవుతుంది. , కానీ మన దేశం లో నేరాలుగా చట్టాలు గుర్తిస్తే తప్పా నీతి బాహ్యతలకు పాల్పడే వారిని శిక్షించడం కుదరదు." పెండ్లి చేసుకోకుండా సహజీవనం చేయడం సహజీవనుల హక్కుల్లో బాగమే" అని సుప్రీం కోర్టు వారు ప్రముఖ సినిమా నటి ఖుష్బూ కేసులో చెప్పడం జరిగింది. కాబట్టి ఇష్టం ఉన్ననాళ్ళు చట్టా పట్టాల్ వేసుకు తిరిగి , పెండ్లి చేసుకోను అనగానే అత్యాచారం కేసు పెడదాం అనుకుంటే ఇండియాలో అది  కుదరని పని. అందుకే పెద్దలు అనేది. "కీడేంచి మేలేంచాకే ఏ పనైనా చెయ్యండి" అని.

                                           (10/1/2014 Post Republished).

Comments

  1. How terminology is used for narrative. Sex-selective parental choice becomes foeticide aka murder. Abortion after casual sex is #prochoice

    Government introducing #pro-choice legislation to bring greater rights for women

    https://twitter.com/raga4more/status/809358944346861568

    https://twitter.com/AccheDin_/status/808180673005555713

    https://twitter.com/hashtag/prochoice?src=hash

    Pro-life is a philosophy of sacrifice and giving. Pro-choice is a philosophy of selfishness and taking. Where do you stand?

    https://cultureshiftforlife.com/2016/12/17/differences-in-philosophy/

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన