ఇకనుంచి, విడిగా ఉంటున్న భార్యను "రేప్ " చెస్తే , విపరీతమైన పబ్లిసిటి ఇస్తారట!
ఏమిటొ గాని రోజు రోజు కు కేంద్ర హోమ్ శాఖకు , భారతీయ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతునట్లు కనపడుతుంది. ఇండియాలో కోర్టులు కేసులు తొందరగా పరిష్కరించక పోవడం , అత్యాచార కేసులలో నిందితులు పెద్దమనుషులు లాగా సొసైటీలో చలామణి కావడం హోం శాఖకు ఏ మాత్రం నచ్చడం లేదు. భారతీయ న్యాయసూత్రాలలో ప్రదానమైనది "నేరం రుజువు కానంతవరకు నిందితుడు అమాయకుడే " . అలాగే నేరం రుజువు చేయాల్సిన బాద్యత ప్రాసిక్యూషన్ వారిదే. ఇదిగో ఈ కారణాలు చేతనే నిందితులు నేరస్తులుగా రుజువు అయ్యే వరకు కాలర్లు ఎగరేసుకుని తిరుగుతున్నారు . అందరి సంగతి ఏమో కాని రేపిస్ట్ లు కూడా అలా కాలర్ లు ఎగరేసుకు తిరగడాన్నికేంద్ర హోం శాఖ సహించలేక పోతుంది. అందుకే నేరం రుజువు అయిందని కోర్టులు ఇచ్చే తీర్పులతో పని లేకుండానే , చార్జిషీట్ లో ఉన్న ప్రతి నిందితుడు నేరస్తుడే అనే తీర్మానానికి వచ్చి, ఇక నుండి వారి పేర్లు , వారి రేప్ చరిత్రలను వెబ్సైట్లలో , పబ్లిక్ ప్లేస్ లలో బహిరంగ ప్రదర్శనకు ఉంచబోతుంది అట. !
మరి ఇది భారతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం కదా అని ఎవరైనా సుప్రీం కోర్టుకు వెలితే , వారేమి చెపుతారో! ఏది ఏమైనా ఇకనుండి మనకు సినిమా వాల్ పోస్టర్ లు మాదిరి "ఇండియన్ రేపిస్ట్ " ల వాల్ పోస్టర్లు కూడా దర్స నమివ్వబోతున్నాయి అన్న మాట. ఈ రేపిస్ట్ ల జాబితాలో స్వంత భార్యలు ను రేప్ చేసిన వారు కూడా ఉండబోతున్నారు అంట. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం , ఏ కారణం చేతనైనా భర్త తో విభేదించి విడిగా ఉంటున్న భార్య మీద , నా పేండ్లామే కదా బలవంతపు సెక్స్ కి పాల్పడితే , సదరు భర్త పోటో వాల్ పోస్టర్ మీద, వెబ్సైట్లలో , మీడియాలలో కనపడటమే కాక , ఆ పొస్టర్ లు మీద "భార్యను రేప్ చేసిన భర్త" అనే టైటిల్ కూడా ఉంటుంది అనుకుంట .
మొత్తానికి, భారత దేశాన్ని చెరుస్తున్నవారిని ఏమి చేయలేకపోయినా , భార్యలను చెరుస్తున్న వారిని మాత్రం బజారుకు లాగనుంది కేంద్ర హోమ్ శాఖ! కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా విపరీతమైన పబ్లిసిటి పొందే అదృష్టం ఇకనుండి రేపిస్ట్ లకు కలిగిస్తుంది ఇండియన్ హోం డిపార్త్మెంట్. రాజ్యాంగం లో ఉండెది ఒకటి ! రాజ్యం లో జరిగేది వేరొకటి! ఇలా చెప్పే నీతులకి , చేసే అధికార పనులకి పొంతన లేకపోతే , ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో! ఈ దేశం లో పోలిస్ వారు వేసే చార్జ్ షిట్ లు అన్ని నిజమైనవే అని గ్యారంటి ఇవ్వగల నాయకుడు , అధికారి భారతం లో ఉన్నారా? పైన చిత్రం లో ఇచ్చిన కేసుల గణాంకాలు మన పోలిసులు వేసే చార్జ్ షిట్ లలోని నిజాలకు అద్దం పడుతున్నాయి. మరి అలాంటి అబద్దపు చార్జ్ షిట్లు ననుసరించి నేర నిర్దారణ చేస్తే , కోర్టులు ఎందుకు? వాటి తీర్పులు ఎందుకు? ఒకవేళ నిందితులు మీద నేరం రుజువు కాక పోతే ? వీటన్నిటిని క్లారిపై చేయాల్సిన బాద్యత ఇండియన్ హోం డిపార్ట్మెంట్ మీద ఉంది. లేకుంటే తిరిగి న్యాయ సమీక్షకు గురి కాక తప్పదు.
ఇలాంటి పబ్లిసిటి ట్రిక్ లకు బదులు , "రేప్ " కేసులను 60 రోజులలో విచారించి తీర్పులు ఇవ్వాలి అనే విదంగా చట్ట సవరణలు తెస్తే నిజమైన నేరస్తులకు శిక్ష , సమాజానికి రక్ష అవుతుందిగా!
(11/12/2015 Post Republished).
(11/12/2015 Post Republished).
రానివ్వండి. ఇలాంటివే రావాలి ! లేకపోతే, వెనకా ముందు చూడకుండా కొవ్వొత్తులు పట్టుకుని పొలోమని ప్రదర్శనలిచ్చేయడం, ఆన్-లైన్ పిటీషన్లలో ఏముందో కూడా చదవకుండా, కనీస అవగాహనైనా లేకుండా పొలోమని సంతకాలు చేసేయడం ! వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలియొద్దూ ? అసలె మన మగవాళ్ళు మొద్దులాయే ! మొన్నటిదాకా 498A మాత్రమే ఉండేది. భర్తలు నానా కష్టాలు పడుతున్నారు చూడండయ్యా అని చెబితే, ఎన్ని తిట్లు తిట్టేవారో ! ఇప్పుడు అందరికీ సిచ్యుయేషన్ ఏమిటో, ఆ చట్టాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. ఇప్పటి వరకూ పెళ్ళైన మగవారి ఆత్మ హత్యల రేటు విపరీతంగా ఉండేది. వాటి గురించి చెబితే ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు ! పైగా చెప్పే వాల్లని "స్త్రీ ద్వేషులని" ఎద్దెవా చేసేవారు. ఈ చట్టాలు ఒక్క సారి పూర్తిగా రాగానే దేశములో ఎంత మంది ఆదర్శ మగవారు మిగులుతారో చూడాలనుంది నాకైతే !
ReplyDeleteకొసమెరుపు ఏమిటంటే, చాలా దేశాలలో ఇలాంటి రిజిస్ట్రీ ఒకటి మెయింటేన్ చేస్తారు. కానీ, అక్కడ కోర్టులో దోషులు తేలిన వారిని, కోర్టు ఆదేశాల మేరకు రిజిస్టర్ చేస్తారు. మన దేశములో మాత్రం అలాంటిదేమీ ఉండదు !! ఎందుకంటే మనది పురుషాధిఖ్య ప్రపంచమూ, కమ్యూనిష్టుల్ని అధికారానికి ఆమడదూరం ఉంచిన దేశమూ ఆయే ! కాబట్టి, ఇక్కడుండే మగవారికి న్యాయం అనేది అందకపోయినా తప్పేలేదు.