అర్దరాత్రి ఆరంభం అయ్యే ఇంగ్లీష్ ఇయర్ ! ఉషోదయంతో మొదలయ్యే తెలుగు ఉగాది ! మనకు ఏది కరెక్టు ?

                                                                      


                    నూతన సంవత్సరంలో తొలి రోజు .తొలిరోజు లో మొదటి క్షణాలకు కు మనం స్వాగతం చెప్పే విదానం ఎలా ఉండాలి ?ప్రజలందరూ ఆనందంగా గడచి పోయిన సంవత్సరానికి వీడ్కోలు చెపుతూ ,వస్తున్న సంవత్సరానికి ఆహ్వానం పలకాలి . అసలు పాత సంవత్సరo  చీకటిలోదొంగలా  వెళ్ళిపోవడం ,కొత్త సంవత్సరంఅదే  చీకట్లో మరో దొంగలా రావడం,దానికి మనమేమో పుల్ గా మందు కొట్టి ,ఒళ్ళు పైనా తెలియని స్తితిలో ,పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తూ ,స్వాగతం పలకడం చూస్తుంటె ,ఇదేదో నిశాచరులు  చేసుకునే  పండుగ లాగుంటుంది కాని ,పౌరులు చేసుకునే పండుగ లాగుంటుందా?

                           రాత్రంతా తాగి ఉగడం ,వాగడం ,అర్దరాత్రి 12 గంటలు సమయంలో నిద్రమత్తులో సామాన్యులు ,నిషా మత్తులో 'మందు మాన్యులు " ,నానా కష్టపడుతూ హ్యాపి న్యూ యియర్ అంటూ స్నేహితులకు ,బందువులకు శుభాకాంక్షలు తెలిపి,వెంటనే మంచం మీద బొక్క బోర్లా పడుకుని తెల్లారి 10 అయినా లేవ లేక పోవటం, రాత్రి తాగిన దానితో వచ్చిన హంగోవర్ ని వదిలించుకోవడానికి మళ్ళి మందు కొట్టాల్సి రావడం, ఇలా మొత్తానికి కొత్త సంవత్సరం రోజంతా ఏదో ఒక మత్తులోనే గడపాల్సి రావడం ,ఇదా నూతన సంవత్సర ఆహ్వాన విదానం ?

మనకు ఒక సెంటిమెంట్ ఉంది . కొత్త సంవత్సరాదిలో తోలి రోజు ఎలా ఉంటె ఆ సంవత్సరమ్ అంతా అలాగే ఉంటుంది అని  . అదే బావనతో ఆనందంగా ఉండటం కోసం ఇంత మందు ను లోపలికి పంపి ,లోపల ఉన్న వికారం అంతా బయటకు తెచ్చి వికృత ధ్వనులతో స్వాగతం చెప్పి ,రోజల్లా మత్తుగా ఉంటున్నారు . అందుకె కాబోలు మన ప్రజలు సంవత్సరం అంతా ఏదో ఒక రకం మత్తులో ఉండటం రాజకీయ నాయకులు వారిని మబ్య పెట్టి ,పబ్బంగడుపుకో గలుగుతున్నారు . మరి ఇదే విదానం మన తెలుగు సంవత్సరాది ఉగాది జరుపుకునే తీరులో ఉంటుందా/ ఉషోదయ వేళలో ,నూతన సంవత్సర బానుడికి స్వాగతం పలికి ,రోజంతా కుటుంభ సభ్యులతో సాంప్రదాయ విదానంలో పండుగ జరుపుకుని ,ఆనందంగా ఉండె ఉగాది వేడుకలకు ,ఇంగ్లీష్  న్యూ ఇయర్ పండుగ వేడుకలకు పొంతన లేదు. మరి మనకు ఏ పద్దతి  కరెక్టు?

అందుకే కాబోలు కొంత మంది మిత్రులు న్యూ ఇయర్ డే  ని "తాగుబోతుల దినోత్సవం "అనేది !
                                     (1/1/2015 Post Republished)

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )