మర మనిషి (Robot ) తో కాపురం చేయడమే "మై ఛాయిస్ " అంటున్న ఆధునిక మహిళ లిల్లీ !

                                                                           


                        అనుకున్నంత అయింది . "మనువు" కు అర్ధమే మారిపోయే దుస్థితి దాపురించింది.  వివాహం అంటే సహజ పద్దతిలో కుటుంబ అభివృద్ధి కోసం స్త్రీ పురుషులు  మధ్య జరిగే సామాజిక పరమైన ఒప్పందం ని తెలియచేసే తంతు . ప్రపంచ వ్యాప్తంగా వివాహం అనేది స్త్రీ పురుషుల మద్యే జరిగే ప్రక్రియయే . వివాహం యొక్క ప్రధానోద్దేశ్యం లో ముఖ్యమైనది  సహజ పద్దతిలో సంతానం  పొందడం ద్వారా తమ వంశ పారంపర్యతను కొనసాగించడం . మన హిందూ వివాహ చట్టం ప్రకారం  అయితే  వివాహం కి క్రింది షరతులు వర్తిస్తాయి  :


(1)   వరుడు 21 సంవత్సరాలు, వధువు 18 సంవత్సరాలు నిండి ఉందాలి. ఈ షరతును ఉల్లంఘించితే శిక్షార్హమైన నేరంగా పరిగణింపబడుతుంది.

(2)వధూవరులకు గతంలోనే వివాహమైన పక్షంలో వారి భార్త లేదా భర్త జీవించి ఉండరాదు లేదా అట్టి వివాహం అమలులో ఉండరాదు. ఈ షరతును భిన్నంగా జరిగిన ద్వితీయ వివాహాన్ని బహుభార్యత్వం అనే నేరంగా పరిగణిస్తారు.
 (3). వధూవరులిద్దరూ వివాహానికి అనుమతి ఇవ్వగల మానసిక సామర్థ్యం కలిగి ఉండాలి. మానసిక వైకల్యం వివాహానికి కానీ, సంతాన వృద్ధికి గానీ ఆటంకమవుతుంది.

 (4)వధూవరులిద్దరూ తరచూ మానసిక వైకల్యానికి లేదా "ఎపిలెప్సీ" అనే మానసిక వ్యాధికి గురి అయి ఉండరాదు.

   (5) . వధూ వరుల మధ్య నిషేధించబడిన స్థాయిలలో బంధుత్వం ఉండరాదు. అనగా ఒకరు వారి తల్లి నుండి మూడు తరాలు లేదా తండ్రి నుండి మూడు తరాలలో బాంధవ్యం కలిగి ఉండరాదు. అలాగే వధూవరులకు సపిండ బంధుత్వంలో ఒకే తరపు బంధువు పైస్థాయిలో ఉండరాదు. సోదర/సోదరి, పిన తండ్రి/మేనమామ, మేనకోడలు/కూతురు, మేనత్త/పినతల్లి/మేనల్లుడు/కుమారుడు, సోదరులు/సోదరీల సంతానముల మధ్య వివాహం నిషేధించబడింది. ఏ వ్యక్తి అయినా తన సోదరుడి భార్యను విడాకులైన తరువాత కూడా వివాహం ఆడరాదు. అయితే ఏ ప్రాంతములోనైనా, లేదా సామాజిక వర్గంలోనైనా అనాదిగా పాటిస్తూ వచ్చిన ఆచారం రీత్యా నిషిద్ధ స్థాయిలలో బంధుత్వం ఉన్నప్పటికీ వివాహం చేసుకోవచ్చు. అలాగే భార్య గతించిన వ్యక్తి, భర్త గతించిన మహిళను వివాహమాడవచ్చు.

     మనకు మన మతం నిర్దేశించినట్లే , వివిధ మతాలూ తమ మతస్తులకు కొన్ని వివాహ పద్ధతులు ను నిర్దేశించాయి . అయితే ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని వివాహాల్లో ఉండే సార్వజనిక నియమం ఏమిటంటే , వివాహం అనేది స్త్రీ పురుషుల మద్యే జరిగే ప్రక్రియ. కానీ మనిషికి రాను రాను  జ్ఞానం ఎక్కువై , "నా ఇష్టం నాది " అనే తత్త్వం,ప్రక్రుతి నియమాలకు వ్యతిరేకంగా  బలపడి పోతూ వస్తుంది . దానినే "మై చాయిస్ " తత్త్వం అంటున్నారు . నా  ఇష్టం వచ్చిన బట్ట కడతా , అడగడానికి మీరెవరు ? అనే స్థాయి నుంచి నా ఇష్టం వచ్చిన వారిని మనువాడతా అనేదాకా వెళ్ళింది . అందులో భాగంగానే స్త్రీలను స్త్రీలు , పురుషులను పురుషులు పెండ్లి చేసుకునే వికృత స్థాయికి చేరింది . అదేదో చాటుగా మాటుగా చేసుకుంటుంటే ఎదో వారి మానసిక దౌర్బల్యం అనుకోవచ్చు . కానీ స్వలింగ వివాహాలు తమ జన్మ హక్కు అయినట్లు వాటిని గుర్తించి చట్టబద్దం చేయాలని అనేక దేశాలలో ఉద్యమాలు చేసే స్థాయికి ఎదిగారు ఈ వికృత మానసికులు . వారి డిమాండ్లకు తలా యొగ్గి కొన్ని దేశాలు స్వలింగ వివాహాలు చట్టబద్దం చేసినవి . కాలిఫోర్నియా లో ఇద్దరు మగాళ్లు అనబడేవారు చేసుకున్న  స్వలింగ వివాహం ఎలా జరిగిందో క్రింది వీడియోలో చుడండి . 

                                                                          

     
              అయితే అంతటితో ఆగుతారా ఈ ఆధునిక వికృత మానసికులు  . ఆకాశం నుండి క్రిందకు జారిన గంగ చివరకు పాతాళ లోకానికి చేరినట్లు "మై చాయిస్ " అనే ఒకే ఒక్క వెసులుబాటుతో వికృత భావాలతో మానసికంగా తాము పతనమవడమే  కాక "తా చెడ్డ కోటి వనమెల్లా చెరచినట్లు " తాముండే సమాజాన్ని పతనమొందించడానికి తయారు అవుతున్నట్లు ఉంది. దానిలో భాగమే ప్రెంచ్ లోని లిల్లీ అనే ఆధునిక మహిళా ఇచ్చిన స్టేట్ మెంట్ . అదేమిటో క్రింద చూడండి . 

                                                                       


                                 చూసారుగా ! ఈమె గారు ఒక మరమనిషిని ప్రేమించింది అట . దానితో సంవత్సర కాలంగా కాపురం కూడా చేస్తుంది అట . తానూ రోబో సెక్సువల్ అని చెప్పుకోవడానికి ఏంతో గర్వపడుతుంది అట . ప్రాన్స్ దేశం లో రోబో మాన్ వివాహం చట్టబద్దం అయినా వెంటనే అదే రోబోను పెండ్లి చేసుకుని తమ మధ్య జరుగుతున్నా సహజీవనం ని చట్టబద్దం చేసుకుంటుంది అట . తనకు మాంసం ముద్ద లా ఉండే మనిషితో కలసి ఉండటం ఇష్టం లేదని అందుకే "నిరంతరం అలసిపోని " మర మనిషితో సహజీవనం చేస్తున్నాను అని చెప్పింది అట . 2050నాటికి ప్రాన్స్ లో రోబో - మం వివాహాలు చట్టబద్దం అవుతాయని ఆశిస్తునందు వల్ల అప్పటి దాకా ప్రీ -మారిటల్  ఎంజాయి చేస్తాము  అని సగర్వంగా ప్రకటించింది , మనుషులు అంటే గిట్టని ఈ లిల్లీ బుల్లి . 

    ఇదంతా వింటుంటే , మన పెద్దోళ్ళు చెప్పే ముతక సామెత గుర్తు వస్తుంది . అదేమిటంటే "తెగిడిచిన వారికి తెడ్డే మరి " అని . ఇక రాను రాను ఎన్నెన్ని వికృతాపూర్వక వింతలూ చూడాలో !. తన నియమాలకు వ్యతిరేకంగా మనిషి ఆడుతున్న ఈ వికృత క్రీడను ప్రక్రుతి ఒప్పుకుంటుందా  ? బహుశా పోగాలం దాపురించబట్టే ఇలాంటి పోకదల బుద్దులు మనుషుల్లో కలుగుతున్నట్లు ఉంది. 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన