ముసలోడికి కూడ" రేప్" చెయ్యాలన్పించిందట!
మొన్న ఖమ్మం జిల్లాలో ఒక అరవైయేళ్ల వ్రుద్ద మహిళ పోలిస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే, తన ఇంటికి దగ్గర్లోనే ఉంటున్న ఒక 65 సంవత్సరాల వ్రుద్దుడు, చేలో ఉన్న తన పై అత్యాచారం చేశాడని. పోలిస్లు కేస్ రిజిస్టర్ చేసి అమెను వైద్య పరిక్షలకు పంపించారు. అతనిని కస్టడిలోకి తీసుకుని కేస్ విచారిస్తున్నారు.
ఇక్కడ విషయం ఏమిటంటె, అరవై ఏళ్లు వచ్చిన వ్యక్తులు కూడ మనసుని కంట్రోల్ చేసుకోలేక పోతే, పడుచు వాళ్లకి ఏమని బుద్ది చెపుతారు. చిన్న పిల్ల మీద అత్యాచారాళ్లొ, వ్రుద్దుల పాత్ర తాక్కువేమి కాదు. పెద్ద వారు కదాని, తల్లి తండ్రులు చిన్న పిల్లల్ని ఇరుగు పొరుగు ఉండే ముసలి వారి దగ్గరకు వెళ్లడానికి అబ్యంతర పెట్టరు. అలాగే చిన్న పిల్లలు కదాని ఏమి చేసిన బయట పడే అవకాశాలు లేవని భావించిన ఈ మానసిక రోగులు తమ పైశాచికత్వాన్ని, పసి పాపల మీద చూపిస్తుంటారు. అందరూ అలా అని కాదు. ముసలి వారైనా సరే వారి వెనుకటి ప్రవర్తనలు ద్రుష్టిలో ఉంచుకునే వారి వద్దకు పిల్లల్ను పంపడం మంచిది. పిల్లల పట్ల అతిగా శ్రద్ద చూపుతున్నా, పరాయి వారైనప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండడం మంచిది.
నేనకుంటాను మనిషి తనకు లేని దానినే ఎక్కువుగా ప్రదర్సించాలని ఉబలాట పడతాడు. దీనిని కంట్రోల్ చేసుకోలేనివారు,మానసిక సమస్యతో బాద పడుతుంటారు. ఇటువంటి వాటిని అదిగమించటానికి, భగవద్యానం, గ్రంద పఠనం చక్కగా ఉపకరిస్తాయి. కాని సమాజంలో పెరిగిపోతున్న అనైతిక జీవన విదానం, వయసులో రసిక పురుషులుగా పేరొందిన వారికి ఇంకా ఉబలాట పడేలా చేస్తున్నాయి. దానికి తోడు స్టెరాయిడ్లు లాంటివి వారి కోర్కేలకు అడ్డూ, అదుపు లేకుండా చేస్తున్నాయి.
రేప్ చేయడమనేది మనిషిలో మిగిలి ఉన్న జంతు సంస్కృతీ . జంతువుకు లైంగిక కోరిక తీర్చుకోవడమే ప్రదానం . అందుకే స్త్రీలు పురుషులు విషయం లో జాగరూకతో ఉండాలని పెద్దలు చెప్పే మాట ఏంతో వాస్తవిక దృష్టితో కూడుకున్నది . పెద్దవారైనా, చిన్న వారైనా మగవాడు మగవాడే, ఆడది ఆడదే. మనకున్న సంస్కారమే అందరికి ఉంటుందని సంస్కారులు అనుకోవడం సత్య దూరమే అవుతుంది. వ్యక్తుల్ని శారిరక పరిస్తితిని బట్టి కాక, వారి మానసిక స్తాయిని అనుసరించి అంచనా వెయ్యడం మంచిది. ముసలోడే కదా ఏం చేస్తాడులే అనుకోబట్టే పాపం ఆమె గారు పోలిస్ స్టేషన్ కి రావాల్సి వచ్చింది.
(15/12/2012 Post Republished).
Comments
Post a Comment