పిల్లలున్న "గొడ్డు మోతు"తల్లితండ్రులు అంటే వీరే !
సాదారణంగా సంతానం లేని పశువులని "గొడ్డుమోతు పశువులు " అనటం కద్దు . అలాగే పిల్లలు లేని స్త్రీలను కూడా కొంత మంది తోటి స్త్రీలు గొడ్డుమోతు వారు అని అవమానిస్తూ అవహేళన చేస్తుంటారు . కాని ఇది సరి అయిన పద్దతి కాదు. పిల్లలు కలుగక పోవడం అనేది దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ , దాని కోసం చింతిo చవలసిన విషయం కాని, సంతాన హినులను అదేదో పాపం చేసిన వారిలాగా చూడాల్సిన అవసరం లెదు.
ముక్యంగా హిందూ జీవన విదానంలో "సప్త సంతానం " గురించి చెప్పడం జరిగింది . అందులో కడుపున పుట్టిన వారు ఒక బాగం మాత్రమె . హిందూ గృహస్తుకు పేరు తెచ్చె మిగతా 6 రకాల సంతానం లో దత్త పుత్రులు , కవితలు , గ్రందరచనలు చెయ్యడం , పాఠశాలలు కట్టించడం , చెరువులు తవ్వించడం, మొదలగు పనులన్నీ "సప్త సంతానం " లో బాగమేనని చెప్పారు . కాబట్టి పిల్లలు లేని వారు నిస్సందేహంగా "గొడ్డు మోతులు " కారు . మరి గొడ్డు మోతులు అంటే ఎవరో చూదాం .
ప్రతి వ్యక్తీ తనకు సహజ సంతానం ఉన్నా లేక పోయినా "పితృ హ్రుదయం" మాత్రు హ్రుదయం " ఉంటే చాలు . అంటే తమ పిల్లల పట్ల తమకు కలిగే మమతాను రాగాలే ఇతరుల పిల్లల పట్ల కలిగి ఉంటే వారు తల్లి తండ్రులు అని పిలబడటానికి అర్హులే . కాని కొంత మంది తల్లి తండ్రులకు తమ పిల్లల పట్ల కూడా మమతాను రాగాల సంగతి దేవుడెరుగు , ఏ మాత్రం జాలి కరుణా లేకుండా కర్కశంగా వ్యవహరిస్తుంటారు . ఉదాహరణకు క్రింది వీదియోలోని హొమ్ టూషణ్ టిచరమ్మను చూడండి . కలకత్తాకు చెందిన ఈవిడ తనకు అప్పచెప్పిన విద్యార్దిని ఎంత దారుణంగా హింసిస్తుందో ? సి .సి కెమెరాల పుణ్యామాని ఈ విడ గారి దురాగతం బయట పడింది కాని లేకుంటే అ బిడ్డడు రోజూ ఎంత నరకం అనుభవించాల్సి వచ్చేదో? ఆవిడకు తన పామిలీ తో కూడా సత్సంబందాలు సరిగా లేవట. ఆమె స్వబావమే శాడిజం . కాబట్టి ఇలాంటి తల్లి కి పిల్లలు ఉన్నా ఆమె "గొడ్డుమోతు " క్రిందే లెక్క .
అలాగే మొన్న కాకినాడలో అంధ విద్యార్దుల పాఠశాలలో ఒక అంధ విద్యార్దిని ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో కరస్పాండెంట్ దారుణంగా కొట్టాడు . విచిత్రం ఏమిటంటే అ కరస్పాండెంట్ కూడా అంధుడే . అయినా సరే సరే అతినిలో పితృ హృదయం లోపించటం వలన అంత దురాగతానికి పాల్పడ్డాడు . కాబట్టి అతను కూడా "గొడ్డుమోతు " కేటగిరి లోకి చేరతాడు . అతని గొడ్డుమోతు తనం ఎంత దారుణంగా ఉందో క్రింది విడియోలో చూడ గలరు . ఆ దృశ్యం చూస్తుంటే , మాత్రు హృదయం , పితృ హృదయం ఉన్న వారెవరికైనా కళ్ళు చెమ్మగిల్లక మానవు.
(24/7/2014 Post Republished).
Comments
Post a Comment