రత్నాల నమ్మకాలను నమ్మని T.V 9 వారికి , రాణుల " శాపాలు " మీద నమ్మకమేనట!
T.V. 9 తెలుగు చానల్ వారు తెలుగు ప్రజలలో ఉన్న మూడ నమ్మకాలను పారద్రోలి వారిని చైతన్యవంతులు చేయాలనే తపనతో ఉన్నట్లు, ప్రతి పావు గంటకు ఒక సారి వారు పని కట్టుకుని చేసే స్లోగన్లు తెలియచేస్తుంటాయి . దానికోసం వారు ప్రజల నమ్మకాల మిద దాడిచేస్తుంటారు . ఉదాహరణకు తెలుగువారిలోనే యావత్ భారతీయులలో పేరుకు తగినది అనో , జాతక చక్రం ప్రకారమో, వజ్రం, కెంపు, పచ్చ లాంటి వాటితో పొదిగిన ఉంగరాలు ధరించే నమ్మక్కం ఉంది . వాటి మీద మన రాష్ట్రంలో కోట్ల బిసినెస్ టర్నోవర్ అవుతుంది . శాస్త్రీయ విజ్ఞానులం అని చెప్పుకునే వారికి అవి అప్త్రాల్ "రంగు రాళ్ళు " కావచ్చేమో కాని , వాటి మిద వ్యాపారం చేసే వారికి మాత్రం అవి ఖచ్చితంగా కోట్లకు పడగలెత్తించె విశ్వాస నిధులు . ఇక ప్రజలు కూడా వాటిని నమ్మి దరిoచడమే కాక వాటి వలన అంతో ఇంతో మేలు జరుగుతుoడబట్టే వారిలో నమ్మకం దిన దిన ప్రవర్ధమాన మవుతుంది అనుకుంటున్నాను . ఇదే విషయంలో నా స్వానుభవం కూడా ఉంది . అదేమిటంటే :
పది యేండ్ల క్రితం అనుకుంటా ఒకాయన నా జాతకం చూసి "మీరు పచ్చపొదిగిన ఉంగరం ధరిస్తే చాలా మేలు జరుగుద్ది అంటే నేను నవ్వి ఊరుకున్నాను . నేను మా ఇలవేల్పు లక్ష్మి నరసింహ స్వామీ మిద అచంచల మైన నమ్మకం ఉన్నవాడిని . నా పరిదిలో లేని దాని గురించి నేను ఎప్పుడూ కలత చెoదను. నా వెనుక నరసింహ స్వామీ శక్తి ఉందన్న బావం నిరంతరం నాలో ఉంది . కొన్ని కొన్ని విపత్కర సమయాలలో నాలో ఉన్న తెలివి తేటలు కంటే , నాకు అ స్వామీ కల్పించిన పరిస్తితులే కాపాడాయి . . బయట వారికి అవి నా తెలివి తేటలు అని అనిపించినా నిజం అది కాదు .అది నాకు మాత్రమె తెలుసు. అందుకే నేను "పచ్చ " గురించి పట్టించుకోలేదు . కాని నా శ్రీమతి పోరుతో నమ్మకం లేక పోయినా పెట్టుకున్నాను . అంతే! అ నెలలో నేను పొందిన అనుభవం ఎప్పటికి మరువలేను .
పచ్చ కలిగిన ఉంగరం పెట్టిన వారం రోజులలో నాకు ఆర్దిక నష్టం ఒకటి జరిగింది . మా పాపకు డెంగ్యూ జ్వరం వచ్చి తీవ్ర స్తాయిలోకి వెళ్లి తిరిగి కోలుకోవడం జరిగింది . రావలసినవి రాక పోగా అదనపు ఖర్చులు , ఆరోగ్య సమస్యలు ఇలా ఒక నెలలోనే , అప్పటివరకు చాలా ప్రశాంతంగా నడుస్తున్న మా కుటుంబం ఒక్క సారిగా ఒడిదుడుకులకు లోనయ్యింది . దానితో ఆ పచ్చ ను తీసి పారేసాను . దానితో మళ్లి ఎ ఆటంకాలు లేకుండా సాపిగా సాగిపోతుంది జీవితం . అయితే ఇక్కడ రంగు రాళ్ళ విషయంలో నాకు అనుభవమయిoది "నేగటివ్ ఎపెక్టు ". అందుకె నేను దానిని తిరస్కరించాను . ఒక విషయానికి నెగటివ్ ఎపెక్టు ఉంటె కచ్చితంగా పాజిటివ్ ఎపెక్టు కూడా ఉంది తీరాలి . అలా పాజిటివ్ ఎపెక్టు అనుభవం అయినవారికి వాటి మిద నమకం ఉండడం సర్వ సాదారణం . కోటి T.V. 9 లు స్క్రోలింగ్లు ఇచ్చి ప్రచారం చేసినా అది మారడం అంత తేలికైన పని కాదు. కాకపొతే పూర్తిగా ఇలవేల్పు శక్తిని నమ్మిన నా లాంటి వారికి రత్నాలు , వజ్రాల ధరించడం వల్ల నష్టమే ఒరిగిదేమీ లేదు అని అన్పిస్తుంది నాకు.
నిజంగా T.V. 9 వారికి మూడ నమ్మక్కాలు మిద వ్యతిరేకత ఉందా అంటే , అది అంతా వారి ప్రచార పటాటోపమే తప్పా , వేరు కాదు అని ఈ మద్య వారు ప్రసారం చేసిన ఒక కార్యక్రమం వలన తెలిసింది . రంగు రాళ్ళను ధరించడం మూడ నమ్మక్కం అని తెగ ఊదరగొట్టే చానల్ వారికి,కన్నడ దేశంలో ఒక రాణి ఇచ్చె శాపాలు పనిచేస్తాయని చెప్పడం మూడ నమక్కం కాదా ? T.V 9 వారు ఒక కార్యక్రమంలో మైసూర్ రాజుల చరిత్ర గురించి చెపుతూ , వారి వంశం లో మగ వారసులు కలగక పొవాడానికి కారణం ., సదరు వంసస్తులలో ఒక రాజు గారికి శత్రు రాజ్యానికి చెందినా ఒక రాణి ఇచ్చిన శాపమట ! అందుకే వారెవ్వరికి తరం విడచి తరం లో మగ సంతానం లేక పిల్లల్ని దత్తత చేసుకుంటున్నారట . అయితే T.V 9 వారి కధనం ప్రకారం సదరు శాపం ఇచ్చిన స్త్రీ "మైసూర్ రాజవంశం పూర్తిగా మగ పిల్లలు లేకుండా పోతారు అని . కాని మైసూర్ రాజులు తరం విడచి తరంలో పుత్ర సంతతి పొందుతున్నారు అని తెలుస్తుంది . అలా అయితే సదరు రాణి గారి శాపం ఎక్కడ పలిo చిందో , దానిని పని కట్టుకుని T.V 9వారు ఎందుకు చెప్పారో అర్ధం కాలేదు . ఏది ఏమైనా నాకు అర్ధం అయింది ఒకటే T.V చానల్ వారు ఏమి చేసినా , ఏది మాట్లాడినా వారి చానల్ రేటింగులు కోసం తప్పా , సమాజ ఉద్దరణకు మాత్రం కాదు . అందరి కంటే ఏదైనా డిపరెంట్ గా చేస్తేనే కదా , జనం చూపు వారి వైపు మళ్లేది! అందులో బాగమే మూడనమ్మకాల మిద పోరాటo అనే తంతు ప్రసారాలు! దట్సాల్!
Video Link:https://youtu.be/OFuat_ASU3U (Republished Post,OPD: 9/4/2014)
sir, not only Telugu people, it is believed all over the world, including Muslims, becuase i interact with many, now im working in gulf.
ReplyDeleteYou experienced negative effect of stone, my self i experienced positive effect of pearl. Believe it or not, in our 'way of living', we believe everything is god, we express gratitude to everything whether it is mother earth or sun or tree or fire, water or meal, everything is life itself, we call it 'pagadam' stone but itself was life before turning to 'pagadam', we know pearl it self a life before pearl, every item in this universe is life, everything has its own vibration, (we call it vibration but i feel it is interacting with whole universe) every vibration has its own effect, if it is good for us we own it other wise we reject it.
Coming to TV9, i feel it is purely an anti Hindu organization, ( i can tell N no of incidents). You know very well how anti Hindu organizations are working with pukka planning to degrade Hindu ways.
Narasimha Rao Garu,
ReplyDeleteThe Mysore Kings curse is true and since the same the Mysore kings original heirs not have any children and they have to Adopt a child and the same is continuing although the adopted sons had biological children and next generation the adoption is repeated. The present Prince was also adopted.
Yes, the TV channel is against our culture.
Regarding wearing of Ratnas there are varios theories and views (quite Opposite). Some times the Remidy may backfire due to wrong interpretition. For example: We went to a medical practisenor and he prescribed some medicines and the same medicine may have side effects. Now a days the medical practissioners are taking advantage and intersted in only earning of money. Is this mean total medical practise is wrong like wise the astrologers are also trying to encash the customers weakness.
This comment has been removed by the author.
Deleteమీరన్నదానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను ! ఇదే విషయం గురించి ఇదే బ్లాగులో ఒక పోస్ట్
Delete"వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?" అనే టైటిల్ తో 2012 లో పెట్టాను . దానికి సంబందించిన లింక్ ఇది https://ssmanavu.blogspot.in/2012/10/blog-post_10.html
బహుశా నా విషయం లో కూడా , మీరన్నట్లు, నేను ధరించిన ఉంగరం లోని పచ్చ నాకు వ్యతిరేకపాలితాలు చూపించి ఉంటుంది . మీ స్పందనకు ధన్యవాదాలు వెంకట్రామ్ గారు.
Thank you for your reply. I am regual reader of your blog.
Delete