మర మనిషి (Robot ) తో కాపురం చేయడమే "మై ఛాయిస్ " అంటున్న ఆధునిక మహిళ లిల్లీ !
అనుకున్నంత అయింది . "మనువు" కు అర్ధమే మారిపోయే దుస్థితి దాపురించింది. వివాహం అంటే సహజ పద్దతిలో కుటుంబ అభివృద్ధి కోసం స్త్రీ పురుషులు మధ్య జరిగే సామాజిక పరమైన ఒప్పందం ని తెలియచేసే తంతు . ప్రపంచ వ్యాప్తంగా వివాహం అనేది స్త్రీ పురుషుల మద్యే జరిగే ప్రక్రియయే . వివాహం యొక్క ప్రధానోద్దేశ్యం లో ముఖ్యమైనది సహజ పద్దతిలో సంతానం పొందడం ద్వారా తమ వంశ పారంపర్యతను కొనసాగించడం . మన హిందూ వివాహ చట్టం ప్రకారం అయితే వివాహం కి క్రింది షరతులు వర్తిస్తాయి : (1) వరుడు 21 సంవత్సరాలు, వధువు 18 సంవత్సరాలు నిండి ఉందాలి. ఈ షరతును ఉల్లంఘించితే శిక్షార్హమైన నేరంగా పరిగణింపబడుతుంది. (2)వ...