Posts

Showing posts with the label దుర్గమ్మా

చేసే పూజలు "బతుకమ్మా, దుర్గమ్మా" అని, కానీ దీవీంచేది మాత్రం "చావమ్మా" అనా!

   మనకు దసరా నవ రాత్రులు వచ్చినవంటే అందరికి ఎంతో ఆనందం. అటు ఆంద్రాలోనూ, ఇటు తెలంగాణ లోనూ దసరా చాలా ముఖ్యమైన పండుగయే! ముఖ్యంగా ఈ పండుగ స్త్రీ శక్తి కి ప్రతీకగా "దుర్గా మాత ఆమె అవతార రూపాలైన వివిద శక్తులను పూజిస్తూ హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో మెలగుతారు.                                                                              తెలంగాణ ప్రాంత స్త్రీలు వారిచుట్టుపక్కల పూసే గుమ్మడి, గునుగు, తంగేడు, కట్లపూలు, గన్నేరు పూలతో బతుకమ్మలు పేరుస్తారు. గుమ్మడిపువ్వులోని పచ్చని పుప్పొడిని పసుపు గౌరమ్మగా భావిస్తారు. భక్తిక్షిశద్ధ ప్రధానం కానీ, మిగతా శిష్టులు చేసే ఉపాసనలతో వీరికి పనిలేదు. అమ్మా! నీవీ రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు గెలిచి బతుకమ్మా! అని బతుకమ్మను కోరుకుంటారు. . అదే వివిధ రకాల వాయినాల నైవేద్యం. ఒక్కొక్కరు ఒక్కో పదార్థాన్ని చేసి తెచ్చి బతుకమ్మకు నివేదించి, స్త్రీ మూర్తులనే దేవీమూర్తిగా భావించి వాయినాలిచ్చుకుంటారు. బలాన్నిచ్చే నువ్వులు, బెల్లంతో నూలు ఉండలొకరోజు, సేవలడ్డూలు, పాయసం, దోసకాయ, పెసరపప్పు (నానపెట్టింది), పెసరపప్పు వేయించి, పిండిచేసి, చక్కెర, నెయ్యితో