ప్రేమికుల రోజు కదా అని "పేస్ బుక్ ప్రేమికుడు " ని కలిస్తే , "గాంగ్ రెప్ " బహుమతి ఇచ్చాడట !
ఇండియాలో ప్రేమికులు అన్నా , ప్రేమికులు రోజు అన్నా కొంత మంది యువకులకు ఎలాంటి అభిప్రాయం ఉంటుందో భువనేశ్వర్ సమీపంలోని నయాగడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన తేట తెల్లం చేస్తుంది . అమ్మాయి పేరు ఏదైతేనేం , అ అమ్మాయి + 2 అంటే ఇంటర్ చదువుతుంది . అందరికి ఉన్నట్లే ఆమెకు పెస్బుక్ ఖాతా ఉంది . ఖాతా ఉంది కాబట్టి బాయ్ ప్రెండ్ రిక్వెస్ట్ లు ఉంటాయి . అందులో ఒక రిక్వెస్ట్ కి ఓ.కే చెప్పటమే కాక 20 రోజుల్లోనే వారి మద్య ప్రేమ ఏర్పడిపోయి భువనేశ్వర్ అంతా వారి ప్రేమ పరిమళాలు వెదజల్లారు . పార్కుల్లో , పబ్బుల్లో , సినిమాల్లో ఎక్కడా చూసినా వీరి వీర ప్రేమే ! అలా వారి అంతులేని ప్రేమ కొనసాగుతుండగా మొన్న ప్రేమికుల దినం అయిన పిబ్రవరి 14 రానే వచ్చింది . మామూలు రోజుల్లోనే ప్రేమను ఇరగదిసె ఆ 20 రోజుల ప్రేమ జంట ఇక ప్రేమికుల రోజున ఖాళీగా కూర్చుంటే వారి 20 రోజుల ప్రేమకు అర్ధం ఏముంది? అందుకే రోజున ప్రేమికుడి కోరిక మేరకు ఆ ఇంటర్ చ...