పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

కన్న తల్లి తండ్రులు ఎవరైనా తమ పిల్లలను తామే చంపుకుంటారా ? సృష్టిలో ఏవో కొన్ని జీవులు తప్పా , అన్ని జీవులు తమ సంతానాన్ని కడుపులో పెట్టి కాపాడుకుంటాయి . ఇదేదో ఆదర్శం కోసం చేసే పని కాదు. సృష్టి ధర్మమే అది . మరి మనుషులై ఉండి తమ కన్న కూతురినే చున్ని ఉరి పెట్టి చంపారు అంటే , వారు ఖచ్చితంగా ఆమె తల్లి తండ్రులు కాక పోయి అయినా ఉండాలి లేదా ఉన్మాదులు అయినా అయి ఉండాలి . లోకమంతా వారిని ఆమె తల్లి తండ్రులు అంటున్నారు కాబట్టి మనమూ అనుకుందాం . మరి వారికి ఉన్మాదం ఏదో అవహించబడి బడి ఉండాలి . ఏమిటది ?. విషయం లోకి వెళితే : పచ్చల దీప్తి గుంటూరు రాజేంద్ర నగర్ కు చె...