రత్నాల నమ్మకాలను నమ్మని T.V 9 వారికి , రాణుల " శాపాలు " మీద నమ్మకమేనట!

T.V. 9 తెలుగు చానల్ వారు తెలుగు ప్రజలలో ఉన్న మూడ నమ్మకాలను పారద్రోలి వారిని చైతన్యవంతులు చేయాలనే తపనతో ఉన్నట్లు, ప్రతి పావు గంటకు ఒక సారి వారు పని కట్టుకుని చేసే స్లోగన్లు తెలియచేస్తుంటాయి . దానికోసం వారు ప్రజల నమ్మకాల మిద దాడిచేస్తుంటారు . ఉదాహరణకు తెలుగువారిలోనే యావత్ భారతీయులలో పేరుకు తగినది అనో , జాతక చక్రం ప్రకారమో, వజ్రం, కెంపు, పచ్చ లాంటి వాటితో పొదిగిన ఉంగరాలు ధరించే నమ్మక్కం ఉంది . వాటి మీద మన రాష్ట్రంలో కోట్ల బిసినెస్ టర్నోవర్ అవుతుంది . శాస్త్రీయ విజ్ఞానులం అని చెప్పుకునే వారికి అవి అప్త్రాల్ "రంగు రాళ్ళు " కావచ్చేమో కాని , వాటి మిద వ్యాపారం చేసే వారికి మాత్రం అవి ఖచ్చితంగా కోట్లకు పడగలెత్తించె విశ్వాస నిధులు . ఇక ప్రజలు కూడా వాటిని నమ్మి దరిoచడమే కాక వాటి వలన అంతో ఇంతో మేలు జరుగుతుoడబట్టే వారిలో నమ్మకం దిన దిన ప్రవర్ధమాన మవుతుంది అనుకుంటున్నాను . ఇ...