అందాల అరుణావని.

అనూరుడు అదలింపుతో వడి,వడిగా పశ్చిమానికి వెళ్ల్లిన సప్తాశ్వముల అరుణ రథం దాటికి, కందిపొయిన అంబర వీధి అరుణిమమైన వేళ, అవనికి కుజత్వం సంప్రాప్తించి తానే అరుణ గ్రహం లాగ గోచరించు వేళ, కనిపిస్తుంది అందాల అరుణావని.