గోవుల్ని కాపాడమంటే,అసలు ఆవుల్నే మాయం చేస్తున్న అధికార్లు!
అసలు మనకు భక్తి లేదు! ఉంటే ఇలా మన దేవాలయ వ్యవస్త బ్రష్టు పట్టి పోదు. హిందువులంటే మంచివారు. ఉదారులు,నీతిని అవినీతిని ఒకే రీతిగా చూడగల సమ వాదులు. అందుకే ఎండోమెంట్ అధికార్లుకి హిందూ బక్తులు అంటే బొత్తిగా బెరుకు లేకుండా పోయింది కాబోలు. లేకుంటే నిన్న కాక మొన్న సింహా చలం అప్పన్న స్వామీ సన్నిదిలో "గోశాలలోని" గోవులు సుమారు వంద దాకా ఒక్క సారిగా మరణిచాయని,భక్తులు అందోళన చెందితే వాటి నివారణకు చర్యలు తీసుకుంటామని సాక్షాతు ఎండోమెంట్ మినిస్టర్,అత్యున్నత సమీక్షా సమావేశమనంతరం ప్రకటించి , నలబై ఎనిమిది గంటలు గడవక ముందే,ఆలయ అధికారి ఇంత ఘోరానికి తలపెడతాడా? మొన్న రాత్రి సింహాచలం దేవస్తానానికి భక్తులు సమర్పించిన పన్నెండు గోవులను, ఆలయ సూపరింటెండేంట్ ప్రోత్సాహాంతో, ఏడుగురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుంటే స్తానికులు పట్టుకుని పోలిసులకు అప్పగిస్తే, ఆ సూపరింటెండేంట్ ని సస్పెండ్ చేసి విచారణకూ అదేశించారట ఆలయ కార్యనిర్వహణాది కారి. ఈ ఉదంతం భక్తుల మనోబావాలను ఎంతగా గాయపరుస్తుందో వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఎండోమెంట్ అధి