జన అజ్ఞానమే వేదికగా ఖమ్మం జిల్లాలో కంప్యూటర్ రోగ నిర్దారణ నివేదికలంట!
మోసాలు చేసే వారికి కులం ,మతం, వర్గం, బాష, బావం అనేవి ఏవి ప్రత్యేకంగా ఉండవు. వారి మోసాలకు అనువైన దానిని ఎంచుకుని లబ్ది పొందడమే వారికి తెలిసిన ఏకైక విద్య . . అలా మోసాలు చేసే వారికి ఆదునిక విజ్ఞానం కూడా బాగా ఉపయోగ పడుతుందనడం లో ఏ మాత్రం అబద్దం లేదు. మనిషికి కనిపించే దేవుడు వైద్యుడు. ఆ వైద్యుడు ని తయారు చేసిన వైద్య శాస్త్రం అన్నీ శాస్త్రాలలో కెల్లా ముఖ్యమైనది. ఎందుకంటే రోగాలతో చావుకు దగ్గరవుతున్న మనిషిని బ్రతికించగల శక్తి ఆ శాస్త్రం అబ్యసించిన వారికి మాత్రమే ఉంటుంది కాబట్టి. కానీ ఆ శాస్త్రం లో నిష్ణాతులు అనిపించుకున్న వారే , వారి ఆద్వర్యంలో నిర్వహించబడే వైద్య శాలలే శవాలకు సైతం నటనా వైద్యం చేస్తూ అమాయకులు అయిన వారి నుండి లక్షలు గుంజుతున్నారు అంటే అది ఖచ్చితంగా ఆదునిక విజ్ఞానం పేరు మీద జరుగుతున్న దోపిడియే. ఒక మంత్రగాడి వలన ...