చివరకు సిమాంద్ర రాజదానికి "ఉంపుడు గత్తె " హోదాయేనా !?
తెలంగాణా రాష్ట్రం ! అనివార్యం .! ఆ రాష్ట్ర ఏర్పాటుకు ఏ రాజకీయ పార్టి అడ్డుచేప్పటం లెదు అని అన్ని రాజకీయ పార్టీలు పైకి చెపుతున్నాయి . కాని ఏదో వంకతో రాష్ట్రవిభజన ఆగితే బాగుండు అని సిమాంద్ర లోని అన్ని రాజకీయ పార్టీల వారు మనసులో అనుకుంటున్నారు . దిని కోసం "విభజించడానికి మాకు అబ్యంతరం లేదు , కేవలం విభజన తిరు మీదే మా అబ్యంతరం " అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు . ప్రజల మనసులో ఏముందో దానిని కూడా సరిగా అవసరమైన వేళ , అవసరమైన వేదికల మిద చెప్పడం చేతకాని రాజకీయ నాయకులు ఉండటం సిమాంద్ర ప్రజల దురదృష్టం . కారాలు మిరియాలు నూరి బీరాలు పలికిన వారంతా ఇప్పుడు మీడియా సాక్షిగా బోరున ఏడుస్తుంటే , అవకాశాలు ఉన్నా సరిగా అటాడలేక, ఓడిపోయి ఏడుస్తున్న ఆటగాళ్ళు గుర్తుకు వస్తున్నారు . ఇక ఉద్యోగుల నాయకులైతే మరీను ! మన డ్యూటి మనం చేసాం ! ఇక ఒక్క రోజు పని ఎగ్గొట్టినా ఇక ప్రబుత్వాలు జీతాలు ఇవ్వవు కాబట్టి , వెంటనే విదుల్లొ ...