శాస్త్రీయ జ్ఞానం కోసం "సైన్స్ " చెప్పిస్తే , ఇంగిత జ్ఞానం కోల్పోయి "చాగంటి వారి బాష్యం" లో సైన్స్ ఎక్కడ అన్నాడట !!!
సరసాలాడాల్సిన వేళ శరీర విజ్ఞాన శాస్త్రం బొదిస్తున్న శాస్త్రీయ విజ్ఞాని !!! నేను ఈ రోజు ఫేస్ బుక్ లో ఒక "శాస్త్రీయ జ్ఞాని " ని అని చెప్పుకుంటున్న ఒకాయన గారి టపా చూశాను. అయన గారు ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృష్టితోనే చూడాలనే అదో రకమైన "అజ్ఞాన వేదిక " కు చెందిన వ్యక్తీ కాబట్టి , అతనికి పంచ కట్టు కట్టి ప్రవచనాలు ఇచ్చే శాస్త్రులు అన్నా , సాంప్రాదాయ వాదులు అన్నా , ముక్యంగా హిందూ మతానికి చెందిన వారంటే తగని ఒళ్ళు మంట. కాబట్టి హిందూ మతానికి చెందిన వారు చేసే పనులలో నిత్యం లోపాలు వెతుకుతూ గొప్ప "రంద్రాన్వేషకుడు " గా పేరు గాంచాడు. అటువంటి రంద్రాన్వేషకులు గారికి ఈ మద్య చూపు ధార్మిక ప్రవచకులు అయిన శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి మీద పడింది. అయన గారు తానూ పరీసీలించిన లేక అబ్యసించిన ధర్మ గ్రందాలలోని ధర్మ సూక్ష్మాలను , ప్రస్తుత పరిస్తులకు అన్వయిస్తూ , తమ వద్దకు వచ్చిన వారికి ఇంట్రస్ట్ కలిగించే విదంగా ప్రసంగం చేయడం అయన ప్రత్యేక