ఇంటర్నెట్లో ఆనందాలకు అలవాటు పడి, ఇంట్లో అనందాన్ని పట్టించుకోకుంటే పరిస్తితి ఇలాగే ఉంటుంది!!
మనిషి యొక్క ఆనందనమనేది అతని జీవన శైలి ని అనుసరించి ఉంటుంది. పెండ్లి కాక ముందు జులాయిగా తిరుగుతున్న కొడుకులను చూసి చాలా మంది పెద్దలు ఏమంటారు అంటే " వీడికి మంచి అమ్మాయిని చూసి ముడి పెట్టేస్తే , దారి కొచ్చి బుద్దిగా ఉంటాడు" అని. అంటే జులాయిగా తిరుగుతూ తన ఆనందం తానూ వెత్తుకునే వాడి వల్ల అతని ఆరోగ్యానికే కాక, కుటుంబానికి తద్వారా సమాజానికి మంచిది కాదు అని పెద్దల బావన . ఉదాహరణకు ఈడోచ్చిన కుర్రాడు సావాసా ల రుచి మరిగి ఇంటి పట్టున ఉండకుండా , చెప్పిన పని చెయ్యకుండా బలాదూర్ తిరుగుతుంటే , ఎప్పుడు ఏ గొడవల్లో ఇరుక్కుంటారో అని తల్లి తండ్రులు బయపడుతూ ఉంటారు. అందుకే అతనిని ఇంటి పట్టున ఉంచటానికి పెండ్లి చెయ్యటం కూడా ఒక మార్గం అనుకుని తగిన సంబందం చూసి పెండ్లి చేస్తుంటారు. సాదారణంగా కొత్త పెళ్ళాం మోజులో తన తిరుగుళ్ళకు స్వస్తి చెప్పి, ఇంట్ పట్టున ఉండి వేళకు తిండి తింటూ , నిద్ర పోతూ ఉం...