బ్రహ్మం గారి కాలజ్ఞాన వాక్యాలను నిజం అని నిరూపించిన "పనామా పేపర్స్ లీక్ ".
ఇండియా నోస్టర్ డామస్ గా పేరు గాంచిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామీ వారు చెప్పిన కాలజ్ఞాన వాక్యాలు నిజం అయ్యాయి అని తెలుగు ప్రజలు చాలా మంది నమ్ముతున్నారు. అయన గారు చెప్పిన కాలజ్ఞానం ని బ్రహ్మం గారి మఠం వారి తోపాటు కొంత మంది రచయితలూ గ్రందాల రూపం లో అచ్చు వేయించి ప్రజలకు అందించారు. బ్రహ్మంగారు చెప్పినవాటిలో కొన్నింటిని పరిసిలిస్తే మనకూ చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ నాటి కాలం లో కనపడుతున్న ఎన్నో వస్తువులు బ్రహ్మం గారి కాలం నాటికి ఉనికిలో లేకపోనప్పటికి వాటి గురించి అయన గారు తన కళ్ళకు కనిపించిన విదంగా చెప్పడం , అచ్చం అవి అలాగే ఈ నాడు జరుగుతుండడం అద్బుతం అని చెప్పవచ్చు. ఉదాహరణకు "రెక్కల కోడి వచ్చును , దాని రెక్క విసురుకు లక్ష మంది చచ్చును " అన్న కాల జ్ఞాన వ్యాక్యం అచ్చుగుద్దినట్లు ఈ నాటి బాంబర్ విమానాల పోలికకు సరిపోతుంది. యుద్దాల నెపం తో బాంబర్ విమానాల రెక్కల నుండి కురిసే బాంబుల దాడికి వేలాది మంది ప్రజలు చనిపోవడం విన్నాము,కన్నాము . ...