బ్రహ్మం గారి కాలజ్ఞాన వాక్యాలను నిజం అని నిరూపించిన "పనామా పేపర్స్ లీక్ ".
అలాగే నిన్న ప్రపంచ దేశాలను ప్రకంపనాలకు గురిచేసిన International Consortium of Investigative Journalists (ICIJ) వారి రహస్య పత్రాల వెల్లడి గా చెప్పబడుతున్న "పనామా పేపర్స్ లీక్ " ద్వారా ప్రపంచ ప్రజలకు దిమ్మ తిరిగే నిజాలు బహిర్గతం అయ్యాయి. ఇన్నాళ్ళు ప్రజల చేత ఆదర్సవంతులుగా కీర్తించబడిన 12 దేశాల అద్యక్షులు , మాజీ అద్యక్షులు , ఒక్క సారిగా "దోపిడి దొంగలుగా " వారి నగ్న స్వరూపం ని పనామా పేపర్స్ ఆవిష్కరింప చేసాయి. వీరితో పాటు ప్రపం చ వ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు , వ్యాపారవేత్తలు , సినిమా స్టార్లు , మాఫియా డాన్ లు ఉన్నారట. వీరంతా తమ తమ దేశాల్లో ప్రబుత్వాలకు టాక్స్ లు ఎగవేయడం కోసం కానీ, లేక అక్రమార్జనను గుట్టు చప్పుడు కాకుండ వెరే చోట్ల దాచుకోవడం కోసం కాని , నల్ల దనం ని విదేశాలకు తరలించి అక్కడి కంపెనీలలో పెట్టుబడులు పెట్టి తమ పాపాన్ని అభివృద్ధి చేసుకుంటున్నరట. వెరే వారి విషయం కాసేపు అటుంచితే దేశాది నేతలకు సైతం ఈ అక్రమ దోపిడి -దాపిడి లో బాగస్వామ్యం ఉండటం ప్రజాస్వామ్య దేశాల ప్రజలను నివ్వెర పరుస్తుంది. మరి దీనికి , బ్రహ్మం గారి కాల జ్ఞానం కి ఏమిటి సంబందం అంటున్నారా ? అదే చెప్పబోతున్నాను.
బ్రహ్మం గారు తన కాలజ్ఞానం లో "చోరులు పాలకుల రూపం లో ఉంటారు " అని స్పష్టంగా చెప్పారు. అంటే దొంగలు పాలకులుగా రాజ్యపాలన చేస్తూ ప్రజలను దోపిడి చేస్తూ , బందిపోటుల్లాగ తమ సంపదలను రహస్య ప్రాంతాలలో ఉంచుకుంతారు అని అర్దం. కరెక్టుగా అలాగే జరిగింది కదా . 12 మంది దేశాద్యక్షులు అందులోనూ రష్యా లాంటి దేశాల అద్యక్షులకే ప్రత్యక్షంగా ఇందులో బాగం ఉందంటె ఎంత సిగ్గు చేటు. చైనా లో అవినీతి సంపాదనకు శిక్ష ఏమిటో తెలుసా? ఉరిశిక్ష ! మరి సాక్షాత్తు ఆ దేశ పొలిట్ బూరో సబ్యుడి కుమార్తె అక్రమార్జనకు పాల్పడింది అంటె సామాన్య జనాలకు కమూనిస్ట్ చైనా నాయకులు ఇచ్చే నైతిక సందేశం ఏమిటి? ఒక రకంగా ప్రపంచ దేశాలు లోని ప్రజలు " మానసిక రోగుల "చేతికి పాలనా పగ్గాలు అప్ప చెప్పి , వారే తమ నాయకులు అని కీర్తిస్తున్నారు. అవసరాలకు మించి సంపాదించడానికి ఆబగా ప్రజల సొమ్ము దోచుకోవడం, దాచుకోవడం అనేది తప్పకుండా ఒక మానసిక రోగమే. దొంగలను కింగ్ లు చేసే దౌర్బాగ్యం ఒక్క ప్రజా స్వామ్య వ్యవస్థ లో తప్పా మరెక్కడా సాద్యం కాదు అనుకుంటా . అసలు ప్రజలను పాలించడానికి కావల్సింది "ప్రజా నాయకులా ? లేక ప్రజా సేవకులా? . ప్రజా నాయకులు , ప్రజాసేవకులు మద్య ఉన్న తేడా ఏమిటొ తెలుసుకోవాలంటే ఇంతకు ముందు ఇదే బ్లాగులో నేను రాసిన టపా చదివితే తెలుస్తుంది.
Comments
Post a Comment