19 యేండ్ల ,"లా"చదివే అమ్మాయిని , 17 ముక్కలుగా నరికిన పేస్ బుక్ ప్రియుడు!

                                                                                   


                                                   ఫేస్ బుక్ ప్రియుల దురాగాతాల చరిత్రలో మరో ఘోరమైన నేరం ఇది. ఇంటి పక్క అబ్బాయి అయినా , కాలేజిలో సహాధ్యాయి అయినా , పేస్ బుక్ మిత్రుడు అయినా మగాడు మగాడే . ఒక్క సారి అమ్మాయి లవ్ సిగ్నల్ ఇచ్చిందంటె ఇక ఆమె అతని ఆస్తి అయిపోతుంది. అలాంటి ఆస్తి తనకి కాకుండా వేరే వారిది కూడా అని తెలిసినప్పుడు అతని రక్తం మరిగి పోతుంది. వాడు దేనినైనా తట్టుకుంటాడు కాని , ప్రియురాలు చేసే మోసాన్ని అస్సలు తట్టుకోలేడు . అందుకు  వాడు  ప్రియురాలిని మట్టు పెట్టడానికి కూడా వెనుకాడదు అని తెలిపే సంఘటనలు ఎన్నో జరిగాయి. జరుగుతున్నాయి . కాని ఎంత కసి ఉంటే ప్రేమించిన ప్రియురాలీని 17 ముక్కలుగా నరికి , ఆ ముక్కలను బైక్ మీద పెట్టుకుని ఊరంతా తిరిగాడు ఆ ఫేస్ బుక్ ప్రియుడు? విషయం వింటుటునే ఒళ్లంతా జలదరిస్తుంది ! ఇక వివరాలు లోకి వెలితే

                             ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో జరిగింది ఈ  ఘోర ఉదంతం. అమ్మాయి పేరు గౌరీ శ్రీ వాత్సవ. వయసు 19 . చదివేది మాస్టర్ అఫ్ లాస్. వయసు కంట్రోల్ లో ఉందనివ్వడం లేదనుకుంటా ఫేస్ బుక్ లో చాటింగ్ లకు అలవాటు పడింది. ఆ క్రమం లోనే హిమాంశు ప్రజాపతి అనే కామర్స్ విద్యార్దితో పరిచయం అయింది. ఆ పరిచయం ఎంతవరకు వెల్లీందంటె, వాడు ఎక్కడికి రమ్మనా అక్కడికి ఒంటరిగా వెల్లేంత వరకు. ఇక అంత చనువు పెరిగాక 23 ఏండ్ల కుర్రాడు ఊరుకుంటాడ ? తన ప్రతాపం గర్ల్ ప్రెండ్ కి చూపాలని ఉవిల్లూరడూ ! అందుకే ఒక ఫైన్ మార్నింగ్ తన ఇంట్లో వారందరు ఊరికి వెళ్ళడం చూసి ప్రియురాలిని ఇంటికి ఆవ్హానించాడు. చాటింగ్ లతో బోరెత్తి పోయిన ఆమేకు ప్రియుడు సమక్షం లో గడపాలని అనిపించిదేమో అతని అహ్వానాన్ని మన్నించి సరే అంది. వెంటనే తన బైక్ మీద వచ్చి ఆమెను పికప్ చేసుకుని , చాలా దురం లో ఉన్న తన ఇంటికి తీసుకు వెళ్ల్లాడు .

   అక్కడ ఏమేమి చేసారో కాని మాటల సందర్బం లో ఆమెకు సంబందించిన కొన్ని వాట్సప్ చిత్రాలు చూసాడు ఆ ప్రియుడు. ఆమెకు తన తనతోనే కాక , ఇంకా కొంతమంది అబ్బాయిలతో చనువు ఉందని గ్రహించి అగ్రహోదగ్రుడు అయ్యాడు అట. తన అందమైన ముఖం  చూసి, తనకు మాత్రమే పడి పోయింది అని ఇన్నాళ్ళు బావిస్తున్న ప్రియురాలు , ఆమె ప్రేమ ఖాతాలో  ఇంకా ఎన్నో పద్దులు ఉన్నాయి అని తెలిసాక భరించలేక పోయాడు. వెంటనే ఒక కట్టి తీసుకుని ప్రియురాలిని 17 ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలను గొనె సంచిలో పెట్టుకుని , నిర్బయంగా తన బైక్ మీద తిరుగుతూ వేరు వేరు చోట్ల పాతి పెట్టి వచ్చాడు . ఇందులో ఇంకొక మిత్రుడు కూడా వాడికి సహాయం చేసాడు అట. ఈ సంఘటన 1 వతారికు పిబ్రవరి 2015 లో జరిగింది.

    ఇంటి నుండి  వెళ్లి న కూతురు సకాలం లో ఇంటికి చేరకపోయే సరికి , కంగారు పడిన గౌరీ తల్లి తండ్రులు , అక్కడక్కడ వెతికి , చివరకు పోలిస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసారు. తెల్లారి ఒక చోట అమ్మాయి శరీరం తాలూకు బాగాలు దొరకడం తో ఎలర్ట్ అయిన పోలిసులు , దర్యాప్తు చేపట్టి , చివరకు ఆ ఫేస్ బుక్ ప్రెండ్ ని అతని స్నేహితుడిని అరెస్ట్ చేసి, నాలుగు పీకితే , జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పారు అట . ఏ ప్రియుడు అయినా ప్రియురాలిని 17 ముక్కలుగా నరికి , వాటిని బైక్ మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతారా ? అని నిర్ఘాంత పోయిన పోలిసులు , హిమాంశు మానస్తిక ఆరోగ్య పరిస్తితి మీద కూడ వైద్యుల నివేదికను కోరారు అట.

                                     ఏది ఏమైనా 19 యేండ్ల అమ్మాయికి బాయి ప్రెండ్ లు ఉండటం సహజమే అని అనుకునే స్తాయికి మన సమాజం ఇంకా ఎదగలేదు. ఈ  సమాజం లో మగవాళ్ళు  మారకముందే స్త్రీలు  మారిపోవడం లో స్పీడ్ గా ఉన్నారు  స్త్రీ ప్రేమని పురుషుడు తన ప్రాపర్టి అనుకోవడం సాంప్రాదయిక బావనలో బాగమ్. స్త్రీ పురుషులు అన్ని విధాలా పరీక్షలు జరుపుకునే డేటింగ్ పద్దతికి ఇక్కడి ప్రజలు వ్యతిరేకమ్. ఒక్కసారి ఇష్టపడి ప్రేమించుకోవడం మొదలు పెడితే తమ ప్రియులు తమకే స్వంతం అనే బావన ఇక్కడి వారిలో నరనరాన జీర్ణించుకు పోయి ఉంది. ఎంత ఎక్కువుగా ప్రేమిస్తే , అంత ఎక్కువుగా ఆ "స్వంత బావన" వారిలో ఉంటుంది. దానికే మాత్రం బంగం కలిగినా మగాడు మ్రుగాడి లా మారతాడు. హిమాంశు విషయం లో అదే జరిగింది.
                              19 యేండ్ల గౌరికి వారి మద్య ఉన్నది కేవలం ఫేస్ బుక్ ప్రెండ్ షిప్ , దాని వలన వారిద్దరి మద్య  ఏర్పడిన ఆకర్షణ అని అనిపించి ఉండవచ్చు. ఎదో ఎంజాయి కోసం ఫేస్ బుక్ ప్రెండ్ షిప్ ని వాడుకుందాం అని అనుకోవచ్చు. కాని అదే విషయాన్ని తన ఫేస్ బుక్ ప్రెండ్ కి చెపితే అతనికి తన మీద తేలిక బావం ఎర్పడుతుందని  , దాని వలన తన ఇమేజ్ దెబ్బతింటుందని బావించి , లవ్ గేమ్ ఆడి ఉండవచ్చు. కాని లా గురించి తెలిసినంతగా ఆమెకు లవర్ మనస్త్వత్వం  గురించి తెలియక పోవటం వలన ,దయనీయంగా  17 ముక్కలుగా మారిపోయింది. ఆప్కోర్స్ హిమాంశు చేసిన పనికి అతడికి కూడా మాక్సిజిమం ఉరిశిక్ష ని పొందవచ్చు. లేదా ప్రొవకేషన్ రుజువు అయితే యావజ్జీవం పొందవచ్చు. ఏది ఏమైనా ప్రేయసి ప్రియుల బందం ఇలా విషాదాంతం అయింది. అసలు ఇలా వీరిద్దరూ ఇలా తెగించి ప్రవర్తించ దానికి దారి తీసిన పరిస్తితులకు కారణం ఎవరు?

   చదువుకునే ఆడపిల్లలు కు చదువు విషయం లో ఇచ్చినంత స్వేచ్చా , బాయి ప్రెండ్ ల విషయం లో ఇస్తే , ఇలాంటి ఘోరమైన పరిస్తితులే దాపురిస్తాయి. పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏమి చేస్తున్నారో , తల్లి తండ్రులు అప్పుడప్పుడు చెక్ చేసుకోవలసిన బాద్యతను మరచి పోతే , లేక పట్టించుకోకపోతే అందుకు పలితం అనుభవించక తప్పదు. ఇదే సూత్రం మగపిల్లల తల్లి తండ్రులకూ వర్తించినా , ఆడపిల్లలకు నష్టం ఎక్కువ కాబట్టి , ఎక్కువ బాద్యత  ఆడపిల్లల తల్లి తండ్రులు తీసుకోవాలి. అందుకే మనం  మహిళా రక్షణ కోసం , ప్రత్యేక మహిళా పోలిస్ స్టేషన్ లు, షీ టీం లాంటివి ఉన్నాయి తప్పా , పురుషులకు లేవు. నేరం చేసిన మగవాడిని నెలల కాలం లో శిక్షించ గలం . కానీ అదే మగవాడి లోని బావాలు మారాలంటే శతాబ్దాల కాలం పడుతుంది. మన సమాజం లో మగవాడి బుద్ది వెస్ట్రన్ టైప్ లోకి మారక ముందే , స్త్రీ మారి పోయి , మ్రుగాళ్ళ చేత చిక్కి విల విల లాడుతుంది. ఆదునిక స్త్రీ స్వేచ్చా వాదం కూడా అందుకు తోడ్పడుతుంది. మగవాడిని కరెక్టుగా అంచనా వేసి అందుకు తగిన విదంగా నడచుకొమ్మని చెప్పే సాంప్రదాయ వాదం చాందస బావం గా మారి పోవడం వలన దాని రక్షణను ఆధునిక స్త్రీలు పొందలేక పోతున్నారు.

                                  ఇక చేతిలో సెల్ పోన్ లు యువత మంచికి ఎంతవరకు ఉపయోగపడుతుందో కాని , పక్క దారులు పట్టి పాడై పోవడానికి ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా సైట్ లు ఇతోదికంగా సహాయపడుతున్నాయని పై ఉదంతం తెలియ చెస్తుంది. 19 యేండ్లు కష్టపడి పెంచిన కూతురిని, ఒక మ్రుగాడి పైశాచికత్వానికి  పోగొట్టుకున్న గౌరీ  తల్లి తండ్రుల వ్యడను ఎవరు తీర్చగలరు?ఫేస్ బుక్  ద్వారా జరిగే ఘోరాలు ఇలాంటివి ఎన్నో!

   SOURCE:     http://www.solutionzoom.com/trending-viral/19-years-old-girl-cut-into-17-pieces-by-her-facebook-boyfriend/

                                            (Republished Post)

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం

మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది!

"నాగుపాము" మహిమలు గూర్చి మా ప్రత్యక్ష అనుభవాలు