మతం మారినంత మాత్రాన మమత కులకర్ణి మొగుడు 'మహ్మద్ ' అయ్యాడా ?!!

                                                                               



                      మమత కులకర్ణి . 90 దశకంలో తన అంద చందాలతో బాలిఉడ్ ని ఒక ఊపు ఊపిన నటిమణి .డబ్బూ మరియు  పబ్లిసిటి కోసం టాప్ లెస్ గా నటించిన ఈ  నటిమణి , అవటానికి మరాటీ మహీళ యే అయినా తన అంద చందాలతో, వాక్చాతుర్యం తో పదిమందిని ఆకర్షించి ఎంతో టాప్ పొజిషన్ కి వెళ్లి పోయింది.అందమైన  బాలిఉడ్ బామలను చూస్తే డ్రగ్ మాఫియా కింగ్ లకు ఎంతో క్రేజ్. అందుకే నీలికళ్ళ మందాకిని డాన్ అబుసలేమ్ కి ప్రియురాలిగా మారితే , మమతా కులకర్ణి వికీ గో స్వామీ అనే డ్రగ్ స్మగ్లర్ కి దాసోహం అంది. ఈ  వికీ గో స్వామీ ఎవరయ్యా అంటే :

      గుజరాత్ లోని ఒక పోలిస్ ఆఫీసర్ కొడుకు వికీ గో స్వామీ . మద్య నిషేధం ఉన్న గుజరాత్ లో అయ్య మద్యం స్మగ్లర్లను పట్టుకునే పోలిస్ ఆఫీసర్ పదవిలో ఉంటె కొడుకు మద్యం స్మగ్లర్లతో చేతులు కలిపి స్మగ్లర్ అయ్యాడు. అలా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 90 దశకం నాటికి డ్రగ్ స్మగ్లర్ అయ్యాడు. దుబాయి వెళ్లి డాన్ దావూద్ ఇబ్రహీం ఆశీర్వాదం తో డ్రగ్ స్మగ్లింగ్ వర్దిల్లేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇక్కడ మమతా కులకర్ణి తన అందచందాలతో ప్రేక్షకులకు  పిచ్చెక్కిస్తుంటె , అక్కడ గో స్వామీ తన మాదక ద్రవ్యాలతో కోరిన వారికి మత్తెక్కిస్తున్నాడు. ఇలా ఇద్దరూ మత్తెకించే రంగం లో ఉన్నారు కాబట్టి కాంటాక్ట్ కుదిరి గో స్వామికి ప్రియురాలిగా మారింది కులకర్ణి .
                                                                           

                   
               
                గో స్వామీ జాంబీయాలో ఆ తర్వాత దక్షిణాప్రికా లో తన సామ్రాజ్యం విస్తరింపచేసాడు.దుబాయి తో సహా కొన్ని దేశాలకు  పోలీసులకు మోస్ట్ వాంటెడ్ పర్సన్  గా మారాడు. 1998 లో డాన్  అబూ సలేం పుణ్యమా అని దుబాయి అధికారులు గో స్వామిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెడితే దుభాయి కోర్టు 25 యేండ్ల శిక్ష విదించింది. అంటే లెక్క ప్రకారం 2023 లో విడుదల కావాల్సి ఉంది. కాని దుభాయి లోని చట్టాలలోని లొసుగులను ఆదారం చేసుకుని కేవలం 16 యేండ్ల జైలు శిక్షను మాత్రమే అనుభవించి 2013 లో ముంబాయికి వెల్లగొట్టబడ్డాడు. దుబాయి చట్టం లోని లొసుగులు ఏమిటో చూదాం.

   మన దేశం లో సత్ప్రవర్తనకు గాను యావజ్జీవ శిక్ష విదించబడిన ఖైదీలు శిక్షా కాలం పూర్తి కాకుండానే విడుదల చేయబడతారు. దుబాయిలో కూడా ఈ వెసులు బాటు ఉంది. అయితే అక్కడ సత్ప్రవరత్న అంటే ఇస్లాం మతం స్వీకరించడమ్ , రోజూ ఖురాన్ చదవడం, ముస్లిం అమ్మాయిని పెండ్లి చేసుకోవడం. ఇంకేం! గో స్వామీ ఇవ్వన్నీ చేసాడు. ఇస్లాం మతం స్వీకరించి  పేరు మార్చుకున్నాడు.రోజూ  ఖురాన్ చదివాడు . తన గర్ల్ ప్రెండ్ అయిన మమతా కులకర్ణిని మతం మార్చి మరీ పెండ్లి చేసుకున్నాడు. గో స్వామీ చేసిన ఈ  త్యాగాలు చూసి దుబాయి అధికార , రాజకీయ, మత నాయకుల కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. ఒక్క సారిగా అంతులేని మతాభిమానం వేల్లువల్లా పొంగుకు వచ్చి , అతన్ని 9 సంవత్సరాలు ముందే విడుదల చేసారు. అయితే అతగాడి ప్రవర్తన అంత నమ్మశక్యం కాదు అని అనిపించిందో ఏమో , ఈ  మతం మారినాడు మన దేశం లో ఉండటం కంటె ఇండియాలో ఉండటమే బెస్ట్ అని ముంబాయికి పంపించేసారు.
                                                                     



                                      "చెప్పు తినెడు కుక్క చెరుకు తీపెరుగునా " అని ఒక సారి డ్రగ్ స్మగ్లింగ్ కి అలవాటు పడిన గో స్వామీ మతం మారినా తన మనసు మార్చుకోలేదు. తిరిగి కెన్యా వెల్ల్లాడు. అక్కడ అదే వేదవ పని చేస్తూ పోలిసుల చేతిలో అరెవ్స్ట్ అయ్యాడు. ఇక ఇండియాలో, ఇంకా అనేక చోట్ల ఉన్న అతని చీకటి వ్యాపారాన్ని అతగాడి ముద్దుల పెండ్లాం మమతా కులకర్ణి చక్కబేట్టేదట . ఇదే క్రమం లో పోయిన వారం ముంబాయి దగ్గర దానే లో  2000 కోట్లు విలువ చేసే డ్రగ్ రాకెట్ పట్టుబడితే దానికి సూత్రధారి మతం మారిన మమతా కులకర్ణి మొగుడే అని పోలిసులు నిర్ధారించారు. ఆతను కెన్యా లో ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్లి విచారణ చేయాల్సి ఉంది. ఈ  విషయం లో మమతా కులకర్ణి పాత్ర ఏమిటొ ఆరా తీయనున్నారట. అదీ సంగతీ.

     "ఎలుక తోలు తెచ్చిఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు అనే పద్యం గురించి  దుభాయి అధికారులకు  తెలియదు కాబోలు! అందుకే రోజూ ఖురాన్ చదవగానే గో స్వామీ పవిత్రుడు అయి పోయాడు అనుకుని విడుదల చేసి మతాభిమానం చాటుకున్నారు. మతం మారినంత మాత్రాన మమత కులకర్ణి మొగుడు 'మహ్మద్ ' అయ్యాడా ?. అవుతాడా ? నో నెవ్వర్ ! మతం మారినంత మాత్రానా మాండ్రెక్స్ కింగ్ తన నైజం మార్చుకోలెదు. దావూద్ ఇబ్రహీం , అభూ సేలం లాంటి డాన్లు లాగానే అతడూ ఒక ముస్లిం డాన్ గా మారాడు. దట్సాల్!

  మహమద్ అంటే ఎంతో గొప్పగా కొనియాడబడిన వాడు అని అర్దం.మతం మారినంత మాత్రానా మాదాక ద్రవ్యాల వ్యాపారి మహమద్ కాలేడు అనడానికి గో స్వామీ జీవితమే ఉదాహరణ.

Comments

  1. Narasimha Rao Garu,

    Mamata Kulakarni Father is also Retd. DSP (Police dept.). It is very strange that Police officers children turned as criminals!!! (Dawood father is Police Head Constable).

    ReplyDelete
    Replies
    1. అవును మరి!మాదక ద్రవ్యాల స్మగిలింగ్ లో ఉన్న కిటుకులు,తద్వారా వచ్చే కోట్ల రూపాయల లాభం ,మజా గురించి స్మగ్లర్ల తర్వాత ఎక్కువ తెలిసేది పోలీసులకే.అందుకే తమ వారసులను పరోక్షంగా ప్రోత్సాహించి ఉంటారు.

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం