రాసుకో నాస్తీకా ! "గ్రహచారం బాగా లేకపోతె గాల్లోకి కాల్పులు జరిపినా , భూమి మీదోడు చస్తాడు "

                                                                                             మొన్న కేరళా రాష్ట్రం లోని కొల్లం లో గల పుట్టంగల్ దేవత ఆలయం లో తెల్లవారు ఝామున సంబవించిన ప్రమాదం కడు విషాదకరమైనది. ఆ ఘోర సంఘటనలో సుమారు 110 మందికి పైగా భక్తులు చనిపోవడం , మరో 200 మంది దాక గాయపడడం యావత్ భారతావనిని కలచి వేసింది. భారత ప్రదాని సైతం తక్షణం స్ప్పాట్ కి మరియు హాస్పిటల్ కి వెళ్లి అక్కడి పరిస్తుతులను స్వయంగా గమనించి బాదితులకు సహాయం ప్రకటించడం జరిగింది. కేరళా ముక్యమంత్రి గారు కూడా సంఘటణ మీద జుడిషియల్ విచారణకు ఆదేసించారు. చికిత్స పొందుతున్న భక్తులలో తీవ్రంగా గాయపడిన వారు ఇంకా చనిపోతునే ఉండడం కలచి వేస్తుంది.

   పై విషాద కర సంఘటణ కేవలం మానవ తప్పిదం అని అర్దమవుతుంది. ఏటా పుట్టంగల్ గుడి ఉత్సవాలలో బాణా సంచా పోటీలు నిర్వహించే ఆచారం ఉన్నా , తగిన జాగ్రతలు తీసుకోకుండా పోటీ దారులు అత్యుత్సాహం చూపడం వలననే ప్రమాదం జరిగింది అంటున్నారు. కిక్కిరిసిన భక్త సమూహం ఉన్న చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రూల్స్ కి వ్యతిరేకంగా పోటి జరగడాన్ని అనుమతించినందుకు గుడి యాజమాన్య సభ్యుల మీద మరియు బాణా సంచా పోటీ దారుల మీద కేసులు పెట్టి విచారిస్తున్నారు. పోటీ దారుల్లో కూడా ఒకరిద్దరు మరణించినట్లు ఉంది. పై దంతా పరిసీలిస్తుంటె  ఈ  ఘోర సంఘటనకు కారణం మానవ తప్పిదమే కాని, "ఏక్ట్  అప్ గాడ్ " కాదు అనేది అర్దం అవుతుంది.

                                                                           


  
                                      బాది త  భక్తులు ను ఆదుకుని సకాలం లో సపర్యలు చేయడం లో RSS వారు ప్రదాన పాత్ర వహించినట్లు తెలుస్తుంది. బాదితులకు అవసరమైన రక్త దానం చేయడం  కోసం వారు హాస్పిటల్ వెలుపల బారులు తీరిన విదానం చూస్తుంటె మాటలు చెప్పే నాస్తికుల కంటె ఆపదలో ఆదుకునే ఆస్తికులు ఎంతో మిన్న అని అనిపిస్తుంది. . నాస్తికులం అని చెప్పుకునే వారు వచ్చి సంఘటనా స్తలాన్ని చూసారే  తప్ప, బాదితులకు వారు చేసిన సహాయం ఏమీ లేదు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని కొంత మంది నాస్తిక వాదులు  సందు దొరికింది కదా అని అడ్డ దిడ్డమైన కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. సంఘటణ గుడిలో జరిగింది కాబట్టి దానికి పూర్తి బాద్యత పుట్టంగల్ తల్లిదే అన్నట్లు, భక్తులను ప్రమాదం నుండి కాపాడలేని ఆమె దేవత ఎలా అవుతుందని, దేవుడు లేదూ , దేవత లేదూ అని అడ్డగోలుగా  సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ కీచకానందమ్ పొండడం చూస్తుంటె వీళ్ళు  ఖచ్చితంగా "శవాల మీద మరమరాలు ఏరుకునే వారు " అనిపిస్తుంది.

  దేవుడు అయినా సరే  మనిషి జన్మ ఎత్తితే   విది రాత నుండి  తప్పించుకోలేరనే మన పురాణాలు, ఇతి హాసాలు  తెలియచేస్తున్నాయి. గుడిలో అయినంత మాత్రానా జాగ్ర్తత్తలు తీసుకోవలసిన అవసరం లేదని దేవతలు లేక దేవుళ్ళు చెప్పారా? అనాలోచితంగా ప్రవర్తిస్తే  ప్రమాదాలు జరుగవని ఏ గ్రందం లోనైనా ఉందా? మన తెలుగు వారు వాడె ముతక సామెత ఒకాతి ఉంది "గాచారం మారేతో కుదా క్యా కరేగా " అని . ఇదే సూత్రం కేరళా విషాదాంతమ్ కి వర్తిస్తుంది. విది బలీయమైనది అని బలంగా నిరూపించే ఒక సంఘ్హటన మొన్ననే అస్సాం లో జరిగింది. దీని గురించి తెలుసుకున్నాక అయినా నాస్తికుల నోర్లు మూతపడతాయేమో !?
                                                                                                                                           

  అస్సాం లోని తీన్సుఖియా జిల్లాలోగల పెనిగిరి లీ జరిగిన  సంఘటణ ఇది . అక్కడ ఒక ఇంట్లో 3 అంటె తండ్రి కొడుకు కోడలుని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. దాని నిమిత్తం పోలిసులు 5 గురిని అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ కి తీసుకు వచ్చారు. అయితే  వారిని  తమకు అప్ప చెపితే తామే శిక్షిస్తామ్ అని బాదితుల తరపు వారు కొందరు పోలిస్ స్టేషన్ మీద కర్రలతో దాడి చేసారు. వారిని బయపెట్టె నిమిత్తం అక్కడి పోలిసులు నియమానుసారం  ముందుగా గాల్లోకి కాల్పులు జరిపారు. కాని విది వక్రీకరించటం వలన పోలిస్ తుపాకులు లో నుండి పైకి వెళ్ళిన గుండ్లు అక్కడ ఉన్న హై టెన్షన్ విద్యుత్ వైర్లుకు తగిలి అవి తెగి పడ్డాయి. అలా తెగిపడిన వైర్లు సరా సరి వెళ్లి గొడవ చేస్తున్న 10 మంది అందోళన కారులు మీద పాడడం తో వారు అక్కడి కక్కడే చనిపోవడం తో అనుకోని ఈ సంఘటనకి ఆందోలన కారులతో పాటు పోలిసులూ నిస్చ్చేష్టులు అయారు. అదీ గ్రహాచారం అంటె .
          
                                             ఈ  సంఘటన  చూసాకా నాస్తికులకు ఒకటి చెప్పాలి అనిపిస్తుంది. రాసుకో నాస్తీకా ! "గ్రహచారం బాగా లేకపోతె గాల్లోకి కాల్పులు జరిపినా , భూమి మీదోడు చస్తాడు " అని.

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

ఇంగ్లీష్ దుస్తులు వేసుకుని "Happy New Year " అంటే , కన్నడ కేకలు వేస్తూ వెంటపడి వేధించారు అట !

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.