సిగ్గు లేని పెండ్లికి చీర కట్టుడు ఎందుకు ? మతి లేని వారికి "మగతనం" ఎందుకు?!!!
మొన్నీ మద్య అమెరికాలోని కాలి పోర్నియాలో ఒక జంటకు పెండ్లి లాంటి తంతు ఒకటి జరిగింది. ఇక్కడ పెండ్లి లాంటి తంతు అని ఎందుకు అంటున్నాను అంటె , అందులోని వ్యక్తుల హావబావాలు ,వేషాలు , పెండ్లి వేదిక, పురోహితుడు, కార్యక్రమం అన్నీ అచ్చంగా పెండ్లి కార్యక్రమం లాగే అనిపించినా , అందులో అసలు వదూవరులకు కావాల్సిన లక్షణాలు లేవు. అందులో ఇద్దరూ పురుషులే . పేర్లు సందీప్ , కార్తీక్ అట. వారిద్దరూ ఒక డేటింగ్ సైట్ లో కలుసుకున్నారట . ఆ సైట్ లో పురుషులు , స్త్రీల కోసం చూస్తుంటె , వీరి మానసిక సమస్యల వల్ల , వీరు పురుషుల కోసం వెతుక లాడడం మొదలు ఎట్టారట . చివరకు వీరి చూపులు కలుసుకున్నాయి . ఆ తర్వాత పెదవులు కలుసుకున్నాయి . ఆ పై ప్రకృతికి విరుద్దంగా కలవకూడనివి అన్ని కలిసి , వీరి బందం నాగార్జున సిమెంట్ లాగా దృడంగా మారింది అట .
ఇలా మూడేళ్ళు గడిచాక , వారి వారి అమ్మా బాబులను నయానో , భయానో ఒప్పించి , కొందరి సమక్షంలో వీరిద్దరు పెండ్లి లాంటిది ఒక కార్యక్రమం ద్వారా ఒకటి అయ్యారు. ఈ కార్యక్రమo లో గమ్మతైన విషయం ఏమిటంటె , వివాహం అనేది స్త్రీ పురుషుల మద్యే జరుగుతుంది అనే విషయాన్ని, వారి చేష్టలు ద్వారా ఒప్పుకున్నారు . క్రింది విడియోలో చూడండి . ఆ ఇద్దరిలో ఒకరు స్త్రీ మాదిరి పైట వేసుకుని వయ్యారాలు ఒలకపోయడం, చేతులకు మెహంది పెట్టుకోవడం , ముద్దులు పెట్టుకుంటూ చేతులు /అడ్డం పెట్టుకోవడం , ఇలాంటి సిగ్గు మాలిన చేష్టలు ద్వారా అయిన పెండ్లికి స్త్రీ పాత్ర కంపల్సరి అని రుజువు చేసారు .
పెండ్లి అనేది కచ్చితంగా ఒక స్త్రీకి పురుషుడికి మద్య జరిగితేనే దానికి ఒక అర్దం పరమార్దం. కేవలం ఓట్ల రాజకీయాల మీద బ్రతికే తప్పుడు రాజకీయ వ్యవస్థ వలన సేమ్ సెక్స్ మారేజ్ లకు చట్ట బద్దత లభించినా , అలాంటి సిగ్గులేని పెండ్లిళ్ళు అన్నీ "నేచురల్ లా" కి వ్యతిరేకమైనవే !. రేపు "జంతు సంబోగ " ఇచ్చా పరులు అధికమై ,వారు కూడా "జంతువు లను ప్రేమించాము , వాటినే పెండ్లి చేసుకుంటాము " అంటె , చట్టాలు చేస్తారు కాబోలు. మానవ -జంతు సంబందానికి , మగాడు -మగాడు /సంబందానికి పెద్ద తేడా ఏముంది? రెండింటి లోను సంతానాభివ్రుద్ది నిల్. మగాడు ,మగాడు మద్య సెక్స్ రహిత ప్రేమ ఉంటె ఎవరు అబ్యంతరం పెడతారు? అన్న దమ్ముల మద్య , స్నేహితుల మద్య ఉన్నది ప్రేమ కాదా ? దానికి సేమ్ సెక్స్ మారేజ్ చేసుకోవాలా? కాదు కదా? కాబట్టి వారి మద్య ప్రేమ కాదు ఉంది! కేవలం సజాతి తో సెక్స్ లో పాల్గొనాలి అనే మానసిక చాపల్యం . దానిని సరిచేసుకోవటానికి తెరపి కౌన్సెలింగ్ లు తీసుకోవటానికి బదులు , రాజకీయ /వ్యవస్తల మీద ఒత్తిడి తెచ్చి , చట్టాలు చేయించుకుని , తమ సిగ్గులేని పనులకు అప్రోవల్ తెచ్చుకున్నారు . అసలు వీరికి పెండ్లి అనేది అవసరమా ? ఎవరిని ఉద్దరించడానికి ఈ Same Sex Marriages !కాదు, కాదు!Shame Sex Marriages!
whose mad those happy అని అనుకోవడం తప్పా చేయగలిగింది ఏమి లేదు .
(Republished. OPD :20/4/15).
Comments
Post a Comment