"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??
భారత దేశం లో ఉన్న "కుల వ్యవస్థ " అనబడే విధానం ప్రపంచం లో ఏ దేశం లో లేకపోవచ్చు . మొదట్లో వృత్తుల ఆధారంగా నిర్ణయించబడిన కులాలు చివరకు రాను రాను జన్మతః నిర్ణయింపబడానికి కొంతమంది పండిత పుత్రులు కారణమయినప్పటికీ , అగ్రకులాలు ,నిమ్నకులాలు అని వర్గీకరించబడడానికి , పై కులాల ఆధిపత్యం క్రింది కులాల వారి మీద శతాబ్దాలుగా కొనసాగిస్తుండటానికి మాత్రం అన్ని కులాల వారి ప్రమేయం ఉంది. ప్రతి కులస్తుడు తనపై పెత్తనం చేయచూసే అగ్రకులస్తుడి అహకారం ని ప్రశ్నించే బదులు ,తనకంటే క్రింది కులం గా ఉన్నవారి మీదే తన ఆధిపత్య అహంకారాన్ని చెలాయించడానికే ఇష్టపడ్డారు కాబట్టే కులాహంకార దురాచారాం అన్ని వందల ఏండ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఆఖరకు దళితులలో కూడా ఈ జాడ్యం ఉన్నప్పుడు , తరతరాల నిమ్న కులాల వెనుకబాటు తనానికి ఏ ఒక్క కులాన్నో టార్గెట్ చేసి నిందించడం ఎంతవరకు సమంజసం?
మొన్నీ మధ్య "కంచ ఐలయ్య " అనే ప్రొపెసర్ గారు ఒక పుస్తకం రాశారు. దాని పేరు "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు " అని. సదరు ఇలాయ గారి గురించి చెప్పాలంటే అయన పక్కా హిందూ వ్యతిరేకి. అయన రాసిన పుస్తకాల్లో ప్రముఖమైనది "నేనెట్లా హిందువునైతా " . దానిలో అయన చెప్పిన మాటలు ఏమిటంటే
'[In our childhood] all of us, the Dalitbahujans of India, never heard the word "Hindu'-not as a word, nor as the name of a culture, nor as the name of the religion. We heard about Turukoollu (Muslims), we heard about Kirastaanapoollu (Christians), we heard about Baapanoollu (Brahmins) and Koomatoollu (Baniyas) spoken of as people who were different from us.' - Kancha Ilaiah
దీని అర్ధం ఏమిటంటే "మన చిన్నప్పుడు "హిందూ " అనే పదం ఎప్పుడూ వినలేదు . ఆ పేరుతొ ఒక సంస్కృతి కానీ , మతం కానీ లేవు. మనం విన్న పదాలు ఏమిటంటే "తురకోళ్లు ,కిరస్తానపోల్లు ,బాపనోళ్ళు , క్రొమటోళ్లు " .అంతే . మిగతా మనమందరం బహుజనులం. పై వర్గాల వారిలో మనకు దగ్గరి బంధువులు ఎవరయ్యా అంటే తురకోళ్ళు , కిరస్తానపోల్లే తప్పా బ్రాహ్మణులు , కోమట్లు కాదు . ఎందుకంటే తురకోళ్లు ,కిరస్తానపోల్లు మాంసం తింటారు కాబట్టి , మనమూ మాంసం తింటాము కాబట్టి వారే మన వాళ్ళు . మరి మాంసం అనేదానిని బాపనోళ్ళు , క్రొమటోళ్లు ముట్టరు కాబట్టి వారు మనకు ఇతర జాతి క్రింద లెక్క " . ఇది ఐలయ్య గారు చెప్పిన గొప్ప సామజిక సూత్రం. జంతువులని గనుక వాటి ఆహార పద్ధతులు బట్టి శాకాహార , మాంసాహార జంతువులుగా ఎలా వర్గీకరించారో , సమాజం లోని మనుషులను కూడా వారి ఆహార పద్దతి బట్టి వర్గీకరించి వారి మధ్య బంధుత్వాన్ని నిర్ణయించాలి అనే గొప్ప సూత్రాన్ని కనుగొన్నందుకు అయన గొప్ప "సామాజిక శాస్త్రవేత్త " అయినట్లు ఉంది. అయన చిన్నప్పుడు "హిందూ " అనే పదం వినలేదంటా . మరి "బహుజనులు " అనే పదం విన్నాడా ?
మరి అయన గారు చెప్పిన చెప్పిన సూత్రమే నిజం అయితే , భారత దేశం లో చాలా మంది బహుజనులు శాకాహారులుగా ఉన్నారు. అలాగే బ్రాహ్మణులు , వైశ్యులు మాంసం ని ఆహారంగా స్వీకరిస్తున్నారు. మరి వీరినేమనాలి ? కాబట్టి ఆహార పద్దతులను బట్టి మానవ సంబంధాలు నిర్ణయించడం "జంతు పద్దతి " అవుతుందేమో కానీ "మానవ పద్దతి "కాదు. కేవలం హిందూ జీవన విధానం లో జీవిస్తున్న వారి మధ్య తంపులు పెట్టి, సమాజాన్ని చీల్చి , బహుజనులు పేరుతొ హిందువులను ఇతర మతాల్లోకి వెళ్లేలా ప్రేరేపించేందుకు ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలను "ఐలయ్య షెప్పర్డ్ " ప్రతిపాదించి ప్రజల్లోకి వదులుతున్నారు అనేది సత్యం.
భారరతదేశాన్ని అన్య మతస్తులు ఆక్రమించాలి అంటే , మొదట చేయాల్సలింది "హిందూ జీవన విధానం " ని ఎదో రకంగా ధ్వ0సం చేయడం . దానికి మోకాలికి బట్ట తలకు ముడి వేసే కంచ ఐలయ్య లాంటి మేధావులు అవసరం. కాబట్టి వారికి కావలసిన దానిని సమకూర్చి, వారి చేత తలా తోక లేని సిద్ధాంతాలను చెప్పించి , హిందువులను చీల్చి , అన్యమతాల పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం లో భాగమే ""నేనెట్లా హిందువునైతా "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు " అనే పుస్తకాలు రాయడం ,అవేవో గొప్ప సిదాంత గ్రంధాలు అయినట్లు రాదాంతాలు చేయడం. తాను పుట్టిన "కురుమ గొల్ల" కులం పేరు ని షంషేర్ గా చెప్పుకోలేక , సిగ్గుపడి అన్యభాషలో "షెప్పర్డ్ " అని చెప్పుకునే "కంచ ఐలయ్య " లాంటి వారికి సాంప్రదాయక వ్యాపార వర్గం వారైన కోమట్లును స్మగ్లర్లు అనే నైతిక అర్హత ఎక్కడిది?
అసలు ఇప్పుడు వ్యాపారం అనేది కేవలం వైస్యులే చేస్తున్నారా? ఇతర కులాలు వారు చేయడం లేదా? మరి వారంతా స్మగ్లర్లేనా? అనడానికైనా ఒక హద్దూ పద్దూ ఉండక్కర్లేదా? ఒకప్పుడు జీవన భృతి కోసమే చేసిన సాంప్రదాయక వర్తకం, విదేశీ వర్తకుల సహవాస దోషం తో "ఆధునిక వ్యాపార " లక్షణమైన "లాభాల కోసం ఎట్టి నీచాలకు పాల్పడినా తప్పు లేదు " అనే స్థాయికి దిగజారి పోయింది. అది కేవలం వ్యాపారులకు మాత్రమే పరిమితం కాలేదు. మన దేశ సామాన్య పౌరుల్లోనూ ఇంకి పోయింది. "ఆడపిల్ల పుడితే లాసూ , మగపిల్లాడు పుడితే ప్లస్సు " అనుకునే సామాన్య బుద్ధి వ్యాపార బుద్ధి కాదా? పైసలిస్తే తప్పా ఏ పని పూర్తీ కానీ , చివరకు కు ఓట్లు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఇష్టపడని సామాన్య పౌరులు ఉన్న రాజ్యం లో జీవిస్తూ , రాజకీయ పార్టీలకు వైశ్యులు డబ్బులు ఇచ్చి సమాజం ని చెడగొడుతున్నారని ఆరోపించడం లో అర్ధం ఏముంది. ? మీ బాదంతా హిందూ దేవాలయాలకు , సంస్థలకు వైశ్యులు ఆర్థికంగా తోడ్పాటు అందించి , వాటి అభివృద్ధికి కారణమవుతుందనడం వలననే , ఇతర మతాల సంస్థలు వారు అనుకున్న స్థాయిలో హిందూ వ్యతిరేక భావజాలాలు ప్రజల్లో కి తీసుకెళ్లలేకపోతున్నారు అనే కదా? వారు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలు కోసమే కదా , ఆర్య వైశ్యులు మీద ఇంత నీచమైన దాడికి దిగింది.
కంచ ఐలయ్య గారికి చిత్త శుద్ధి ఉంటె , అన్ని నిమ్న కులాలు మాదిరే కోమట్లు కూడా తమకు ఒక గౌరవప్రదమైన సామాజిక హోదా కావాలనే "ఆర్య వైశ్యులు " గా ప్రకటించుకుని అందరితో పాటు ముందుకు సాగుతున్నారు అని గ్రహించాలి. " గొల్లలు " యాదవులు "అయింది , సాలీలు "పద్మ శాలీలు " అయింది , కుమ్మరులు "శాలివాహనులు " అయింది , వడ్రంగి ,కంసాలి , కమ్మరులు "విశ్వబ్రాహ్మణులు " అయింది గౌరవప్రదమైన సామాజిక హోదా గుర్తింపు కోసమే అయినప్పుడు , కోమట్లు ఆర్య వైశ్యులు గా గుర్తింపు కోరుకోవడం గౌరవప్రదమైన సామాజిక హోదా గుర్తింపు కోసమే కదా ! మరి అటువంటి ఆర్య వైశ్యులను "కోమట్లు " అని కించపరిచే విదంగా రాయడమే కాక, వారిని స్మగ్లర్లు అని అనడం దారుణం. ఐలయ్య గారికి దమ్ము ఉంటె బడా స్మగ్లర్ గా పేరుగాంచిన "అన్యమతస్తుల " పై ఆ విధమైన రాతలు రాయగలరా ? రాసి బ్రతికి బట్ట కట్ట గలరా?
హిందూ జీవన విధానం అనుసరించే మత వ్యవస్థలలో నిమ్న వర్గాలకు సంబంధించి ఏవైనా అన్యాయాలు జరుగుతుంటే వాటిని సవరించుకోవడానికి హిందువులకు తగిన శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. వాటి కోసం యాదవులు "షెప్పర్డ్ " లు కావలసిన అవసరం లేదు , వైశ్యులు "మర్చంట్ " లు కావలసిన అవసరం లేదు . అంటే ఐలయ్య గారిలాగా మతాలూ మారన వసరం లేదు. ఈ మధ్య అనేక మంది వెనుకబడిన తరగతులు వారు తమను తమ దేవతలకు సంబంధించిన దేవాలయాలలో పూజారులుగా నియమించామని ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారు అంటే వారిలో పెరుగుతున్న స్వీయ మత హక్కుల చైతన్యమే కారణం.
నిజంగా కంచ ఐలయ్య గారిలో నిమ్నవర్గాల వారి మీద ప్రేమ ఉంటె , వారు తమ కులం లో జన్మించిన భగవంతుని అవతారమైన శ్రీ కృష్ణ భగవానులు వారిని ప్రేరేపణగా తీసుకుని తాను "యాదవ " సామాజిక వర్గానికి చెందిన వాణ్ని అని గర్వంగా ప్రకటించుకునే వాడు. అంతే కానీ విదేశీ మోజుతో "షెప్పర్డ్" అని ప్రకటించుకునేవాడు కాదు. కోట్లాది మంది భారతీయుల చేత బగవంతునిగా పూజింపబడుతున్న, "గోపాలకుడు " ను కాదని , "గొర్రెపాలకుడు " అనే బిరుదు ధరించిన ఐలయ్య షెప్పర్డ్ మందిని ఆడిపోసుకునే రాతలు రాస్తుంది వెనుకబడిన వర్గాల వారి కోసం కాదు , తన వెనక ఉండి రాయిస్తున్న "హిందూ వ్యతిరేకుల కోసం " అని తెలుగు ప్రజలు గుర్తించారు. దానికి తార్కాణం అన్ని వర్గాల ప్రజలనుండి ఆయనకు లభిస్తున్న నిరసనలే.
ఐలయ్య షెప్పర్డ్ లాంటి కోటి మంది కుహనా మేధావులు ఏకమైనా హిందూ జీవన విధానం లోనివసించే వారి ఐక్యతను దెబ్బ తీయలేరని అయన వెనుక ఉన్న వారు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది .
జై హిందూ జై జై హిందూ
Sir.. can you quote some examples for your statement "భారత దేశం లో చాలా మంది బహుజనులు శాకాహారులుగా ఉన్నారు."
ReplyDeleteహిందూ జీవన విదానం లో బాగమైన బహుజనులు ( వెనుకబడిన తరగతుల వారూ) లో చాలా మంది కృష్ణ మతం (ఇస్కాన్), రామానుజ వైష్ణవ మతం , లాంటి మతాలూ స్వీకరించి ఆయా మత నిబందనలకు అనుగుణంగా మాంసాహారం ని త్యజించిన వారూ ఉన్నారు . అలాగే కొన్ని ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండటానికి కుడా మాంసాహారం మానివేసిన వారూ ఉన్నారు.ఈ మద్య ఒక పేపర్లో చదివాను. మా౦సాహారులు అంటే తరచుగా మాంసం ని ఆహారం తీసుకుంటూ, అది లేనిదే ముద్ద దిగని వారినే మంసాహారులుగా గుర్తించాలి తప్పా, నెలకు నాలుగు సార్లు అంతకంటే తక్కువుగా మాంసాహారం తినేవారిని శాకాహారులుగానే గుర్తించవచ్చు అని. ఈ లెక్క ప్రకారం చుస్తే భారతదేశం లో అత్యదికులు శాకాహారులే మరి.
Deleteకొన్ని రోజుల క్రితం సాయిబాబా కు ఎందుకు గుడులు కడుతన్నారాని చర్చ జరిగింది మీ బ్లాగ్ లో లింక్ ఇస్తారా?
ReplyDelete(సాయిబాబా భక్తులకి ,స్వరూపానంద స్వామికి మధ్య గొడవలకు కారణమైన "ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం 1987 ".
Deletehttps://ssmanavu.blogspot.in/2016/10/1987.html )
ఈ బ్లాగులో పైనున్న Blog Search gadget ను ఉపయోగించి మీకు కావలసిన పోస్ట్ లు చూడవచ్చు.
Thanks sir
DeleteWelcome.
Delete