వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!
కాని మన పెద్దలు మనకు చెప్పిన జీవన విదానం వేరు. మనం అనుసరిస్తుంది వేరు. 60 యేండ్ల వాడు న చెప్పాల్సిన జీవన సారం 20 యేండ్ల వాడు చెపుతుంటె , 20 ఏండ్ల వాడు ఆరాటపడాల్సిన దాని కోసం 60 యేండ్ల వాడు ఆరాట పడుతున్నాదు. దీనినే గతి తప్పిన సామాజిక వ్యవస్త అనవచ్చేమో . ఇటువంటి వ్యవస్తలో కోరికలు నియంత్రించుకోలేక పబ్లిక్ కి పట్టుబడే దొంగ స్వామీజిలు, దొంగ బాబాలు , దొంగ మాతలు ఉండకుండా ఎవరు ఉంటారు? ఇలాంటి వారి వలననే మన హిందూ ధర్మం అప్రతిష్ట కు గురి అవుతుంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఇటివల ముంబయిలో ఒక స్వయం ప్రకటిత దేవత తన ముచ్చటలు తీర్చుకోవడానికి పగలు సాద్వి మాత గా , రాత్రుళ్ళుపరమ రోతగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాకి చిక్కింది. ఈమె పేరు "పరమ శ్రద్దే రాదే మా ". ఈమెకు ముంబాయితో పాటు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశ్రమాలు , ఆ ఆశ్రమాల తరపున కొన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆశ్రమ నిర్వాహకుల వ్యక్తిత్వం, వారి ధర్మ ప్రబోధం బట్టి కాక , ఆశ్రమం పేరున నిర్వహించే సేవా కార్యక్రమాలు బట్టి ఆశ్రమాలు పాపులర్ అవుతుండడం వలన , కొంత మంది బ్లాక్ మని దారులు బాబాలను , మాతలను సృష్టించి జనం మీదకు వదలి సేవా కార్యక్రమాల ముసుగులో బోల్డంత దనం సంపాదిస్తున్నారు. అలాంటి బాపతే ఈ రాదా మా కూడా .
విచిత్రం ఏమిటంటె ఈ మహా సాద్వి అసలు పేరు సురేంద్ర కౌర్. పంజాబ్ స్వస్తలం . పెండ్లి అయింది. ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె అల్లుడు ఉన్నారు. చిన్నప్పటి నుంచి కాళీ భక్తురాలు అని ఆమెను పోకస్ చేసి " రాదే మా " గా మార్చి ఆశ్రమ దందా లోకి దించి ఉంటారు. ఆమె 3 గ్గురు పిల్లలు తల్లి అయినా , వైరాగ్య జ్ఞానం అబ్బకపోబట్టి వయసు ఉరకలు తగ్గలేదు. అమ్మ వారి డ్రెస్ లు వేసి ఆశ్రమంలో కూర్చో బెట్టినా మనసంతా "మినీ స్కర్ట్ "లు వేసుకుని పరువాల ప్రాయం లో పొందని రుచులు కోసం ఆరాటం . అందుకే విదేశి వస్త్రదారణతో మోడ్రన్ గర్ల్ గా మారి తన కోరికలు తీర్చుకునేది అట. దొంగ స్వాములు చేసినట్లే ఈమె కూడా భక్తుల కౌగిల్లల్లో పరవసించి పోయేది అట. చివరకు ఈ మహా తల్లి వరకట్నపు కేసులో ఇరుకుని ప్రస్తుతం పరారిలో ఉందట. బహూశా ఈమె చేష్టలు వలన తమ ఆశ్రమ దందాకు నష్టం వస్తుందని బావించిన ఈమే స్పాన్సర్లే ఈమెను వరకట్న కేసులో ఇరికించి ఉండవచ్చు. ఆమె ద్వారా సంపాదించిదంత మూటగట్టుకుని , ఆమెను వెళ్ళ గొట్టదనికే ఆమె రహస్య కార్యక్రమాల వివరాలు , పొటోలు బయట పెట్టడం వలననే ఆమె బాగోతం బయటకు వచ్చింది అనుకుంటా.
కోరికలు తీరని వారు చస్తే దెయ్యాలు అవుతారు అంటారు. అది నిజమో కాదో కాని కోరికలు తీరని వారు, వైరాగ్యం అబ్బని వారు మాతలు, స్వామీజీలు అయితే ఆశ్రమాలు భూత్ నిలయాలు గా మారడం ఖాయం. అందుకే నేను అనేది
కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే."
(Republished Post. RPD 7/8/2015)
ReplyDeleteఆహా ! ముఖ వర్చస్సన
ఓహో !మాతా జిలేబి ఓం హ్రీం! క్రీం భ్రీం !
బాహాట మాయె బతుకులు
స్వాహా స్వామిని మనోభి సరసము తెలియన్ !
జిలేబి
చాలా చక్కగా చెప్పారు.ధన్యవాదాలు.
ReplyDelete