వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!

                                                                                         
                                                                                 



                             నేను ఇదే బ్లాగులో కొన్ని టపాలలో ఒక విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. హిందూ అనేది ఒక మతం కాదని, అది ఒక జీవన విదానం అని , ఒక క్రమ పద్దతిలో , ప్రక్రుతి నిర్దేసించిన విదానం లో ఉంటుందని చెప్పడం జరిగింది. దానినే మన వాళ్ళు సింపుల్ గా "ఏ వయసులో ఆ ముచ్చట " అని చెప్పారు. దానిని మను ధర్మం చతుర్  ఆశ్రమ జీవన విదానం అంది. అవి (1). బ్రహ్మచర్యం (2). గృహస్తం (3) వానప్రస్తం (4). సన్యాసం . నిజానికి భారత దేశం లో ఐ క్రమబద్దమైన జీవన విదానం అనుసరిస్తే మనకు గురువులూ అవసరం లేదు, మాత లూ అవసరం లేదు. వానప్రస్తం లో ఉన్న మన పెద్దలే మనకు గురువులు మాతలు అవుతారు. సన్యాస ఆశ్రమం లో ఉన్న వారే మనకు పరమ పూజ్యులు అవుతారు.

                                                           


   కాని మన పెద్దలు మనకు చెప్పిన జీవన విదానం వేరు. మనం అనుసరిస్తుంది వేరు. 60 యేండ్ల వాడు న చెప్పాల్సిన జీవన సారం 20 యేండ్ల వాడు చెపుతుంటె , 20 ఏండ్ల వాడు ఆరాటపడాల్సిన దాని కోసం 60 యేండ్ల వాడు ఆరాట పడుతున్నాదు. దీనినే గతి తప్పిన సామాజిక వ్యవస్త అనవచ్చేమో . ఇటువంటి వ్యవస్తలో కోరికలు నియంత్రించుకోలేక పబ్లిక్ కి పట్టుబడే  దొంగ స్వామీజిలు, దొంగ బాబాలు , దొంగ మాతలు  ఉండకుండా ఎవరు ఉంటారు? ఇలాంటి వారి వలననే మన హిందూ ధర్మం అప్రతిష్ట కు గురి అవుతుంది. 

                                                               
       

                                  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఇటివల ముంబయిలో ఒక స్వయం ప్రకటిత దేవత తన ముచ్చటలు తీర్చుకోవడానికి పగలు సాద్వి మాత గా , రాత్రుళ్ళుపరమ రోతగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాకి చిక్కింది. ఈమె పేరు "పరమ శ్రద్దే రాదే మా ". ఈమెకు ముంబాయితో పాటు ఇంకా కొన్ని ప్రాంతాల్లో   ఆశ్రమాలు ,  ఆ ఆశ్రమాల  తరపున కొన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆశ్రమ నిర్వాహకుల వ్యక్తిత్వం, వారి ధర్మ ప్రబోధం  బట్టి కాక , ఆశ్రమం పేరున నిర్వహించే సేవా కార్యక్రమాలు బట్టి ఆశ్రమాలు పాపులర్ అవుతుండడం వలన , కొంత మంది బ్లాక్ మని దారులు బాబాలను , మాతలను సృష్టించి జనం మీదకు వదలి సేవా కార్యక్రమాల ముసుగులో  బోల్డంత దనం సంపాదిస్తున్నారు. అలాంటి బాపతే ఈ  రాదా మా కూడా . 

     విచిత్రం ఏమిటంటె ఈ మహా సాద్వి అసలు పేరు సురేంద్ర కౌర్. పంజాబ్ స్వస్తలం . పెండ్లి అయింది. ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె అల్లుడు ఉన్నారు. చిన్నప్పటి నుంచి కాళీ భక్తురాలు అని ఆమెను పోకస్ చేసి " రాదే మా " గా మార్చి ఆశ్రమ దందా లోకి దించి ఉంటారు. ఆమె 3 గ్గురు పిల్లలు తల్లి అయినా , వైరాగ్య జ్ఞానం అబ్బకపోబట్టి వయసు ఉరకలు తగ్గలేదు. అమ్మ వారి డ్రెస్ లు వేసి ఆశ్రమంలో కూర్చో బెట్టినా మనసంతా "మినీ స్కర్ట్ "లు వేసుకుని పరువాల ప్రాయం లో పొందని రుచులు కోసం ఆరాటం . అందుకే విదేశి వస్త్రదారణతో మోడ్రన్ గర్ల్ గా మారి తన కోరికలు తీర్చుకునేది అట. దొంగ స్వాములు చేసినట్లే ఈమె కూడా భక్తుల కౌగిల్లల్లో పరవసించి పోయేది అట. చివరకు ఈ  మహా తల్లి  వరకట్నపు కేసులో ఇరుకుని ప్రస్తుతం పరారిలో ఉందట. బహూశా ఈమె చేష్టలు వలన తమ ఆశ్రమ దందాకు నష్టం వస్తుందని బావించిన ఈమే స్పాన్సర్లే ఈమెను వరకట్న కేసులో ఇరికించి ఉండవచ్చు. ఆమె ద్వారా సంపాదించిదంత మూటగట్టుకుని , ఆమెను వెళ్ళ గొట్టదనికే ఆమె రహస్య కార్యక్రమాల వివరాలు , పొటోలు బయట పెట్టడం వలననే ఆమె బాగోతం బయటకు వచ్చింది అనుకుంటా. 

                          కోరికలు తీరని వారు చస్తే దెయ్యాలు అవుతారు అంటారు. అది నిజమో కాదో కాని కోరికలు తీరని వారు, వైరాగ్యం అబ్బని వారు  మాతలు, స్వామీజీలు అయితే ఆశ్రమాలు భూత్ నిలయాలు  గా మారడం  ఖాయం.  అందుకే నేను అనేది

కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే."


                                 (Republished Post. RPD 7/8/2015)

Comments



  1. ఆహా ! ముఖ వర్చస్సన
    ఓహో !మాతా జిలేబి ఓం హ్రీం! క్రీం భ్రీం !
    బాహాట మాయె బతుకులు
    స్వాహా స్వామిని మనోభి సరసము తెలియన్ !

    జిలేబి

    ReplyDelete
  2. చాలా చక్కగా చెప్పారు.ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన