గ్రంధాలు పట్టుకు తిరిగేవారు జ్ఞానులూ, ఆవు చుట్టూ తిరిగే వారు అజ్ఞానులా ?!!



                                హిందూ జీవన విధానంలో భగవంతుని దర్శించి తద్వారా జీవన్ముక్తులు అయ్యే పద్ధతుల్లో ముక్యంగా 3 మార్గాలు ఉన్నాయి . (1). జ్ఞాన మార్గం (2) భక్తి మార్గం.3 కర్మమార్గం . సాంప్రదాయిక జ్ఞానమార్గంలో ఉన్నవారు ఎవరైనా ఒక గురువును ఆశ్రయించి , వేదోపనిషత్తుల ఇతర గ్రంధాలలోని   సారాంశం తెలుసుకోవడం ,ఆ గురువుగారు చెప్పిన విధానంలోనే భగవంతుణ్ణి దర్శించడం చేస్తుంటారు. వీరి దృష్టిలో దేవుడు వేరు . గురువు వేరు. దేవుడు గురించి తెలుసుకోవాలంటే గురుబోధలు ద్వారానే అది సాధ్యమవుతుoది తప్పా అన్యదా కాదు అనేది జ్ఞాన మార్గీయుల అభిప్రాయం లేక విశ్వాసం .

                        ఇక భక్తి మార్గం లో భగవత్ దర్శనం చేసుకునే వారికి ఏ గ్రంధాలు లేక గురువులు తోనూ పని లేదు . వారికి అలౌకిక అనందం ఇచ్చేది ఏదైనా సరే దానిని భగవంతుణ్ణి గానే భావిస్తారు  . నిత్యం  తాము దేవుడు అని నమ్మడానికి వీరికి ఏ గ్రంద సారాంశం అక్కర్లేదు,గురు బోధలు అవసరం లేదు . తమ పెద్దలు పూజించే దేవుళ్ళు కావచ్చు, జీవితంలో ఏదో ఒక సమయం లో ఆపద ఏర్పడితే దాని నుంచి కాపాడినవాడు అని నమ్మిన  దేవుడు కావచు, చనిపోయిన మహాపురుషులు కావచ్చు,బ్రతికి ఉన్న బాబాలూ స్వాములు కావచ్చు, చెట్లు గట్లు, పుట్టలు, పాములు, గోవులు ఇలా ఒకటేమిటి విశ్వంలో ఉన్నది ఏ జీవ లేక నిర్జీవ పదార్దమ్ అయినా సరే, తాము నమ్మినంతనే ఆరాదించడం మొదలు పెట్టి అంతులేని అలౌకిక అనందం పొందుతుంటారు. ఒక విదంగా జ్ణాన మార్గం లో ఉన్న వారి కంటె భక్తి మార్గం లో ఉన్న వారే ఎక్కువుగా అలౌకిక అనందమయులుగా ఉంటారు. ఎందుకంటె జ్ణాన  మార్గం లో ఉన్నవారికి మల్లే "నీ మార్గం  గొప్పా? నా మార్గo గొప్పా? అనే వాదోపవాదాలు చేసుకోవడానికి వీరికి ఏ గురువు బోదలు గురించి కాని, గ్రంద సారాంశాలు గురించి అంతగా తెలియకపోవడం వలన తాము నమ్మినదే దైవమ్ అని బావిస్తూ ఉండడం, సాద్యమైనంత వరకు  వేరే వారి భక్తి విశ్వాసాలు గురించి ఆలోచించకకపోవడం వలన వారు జ్ఞాన మార్గీయుల కంటే ఎక్కువుగా  అలౌకిక అనందాన్ని పోందుతున్నారని చెప్పవచ్చు.

                  కర్మ మార్గం విషయానికి వస్తే మానవ జన్మ అనేది భగవంతుడు తనకు ఇచ్చిన ఒక వరం అని , తాను ఏమి చేయాలో ఆ భగవంతుడు ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆ ప్రకారమే తన జీవన విధానం కొనసాగిస్తూ ఆశ్రమ జీవన విధానం ద్వారా జీవన ముక్తుడు అయ్యే విధానం . హిందూ జీవన విధానం అంతా కర్మ మార్గమే . ఆ మార్గం లో జ్ఞానం భక్తి రెండూ అవసరమే అనేది తెలియ చేస్తోంది . దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం.   ఇక్కడ మాత్రం మొదటి రెండు మార్గాలని అనుసరించే వారి గురించి ప్రస్తావించడం జరిగింది .  జ్ణాన మార్గం గొప్పా, భక్తి మార్గం గొప్పా  అంటె ఏ మార్గం అయినా "మానవత్వం" అనే పరిదిని దాటి పోకుండా  ఎవరిష్టానుసారం వారు  , వారి వారి మానసిక స్థాయిలు బట్టి ఆ యా మార్గాలు అనుసరించడమే కరెక్టు.  ఇక్కడ మానవత్వం అనే పరిధిని  ఎందుకు  గీయాల్సి వచ్చ్చిందో చెపుతాను. మానవత్వం అనే ఒకే ఒక గీతను దాటినందుకు ఆధునిక విజ్ఞాన ఫలితాలు మనిషికి మరణ మృదంగం వినిపిసున్నాయి . 

                                                                     

                     
                                మనిషి ఆవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి , అవును గో మాతగా కొలవడానికి తరతరాలుగా గోవు తో హిందూ జీవన మార్గం లో ఉన్న వారికి కల అనుబంధమే కారణం . మన పూర్వికులు గోవు ఇచ్చిన పాలు త్రాగి తమ ఆరోగ్యం ని సమర్థవంతంగా ఉంచుకున్నారు. గోవు వేసిన పేడను  ఎరువుగా తమ పంట పొలాలకు వేసి భూసారం పెంచుకోవడం ద్వారా భూమాత ఆరోగ్యాన్ని కాపాడారు . అందువలన స్వచ్ఛమైన పంటలు పండడం వలన వాటిని తిండికి ఉపయోగించుకుని మనుషులు మంచి పుష్టిగా బలంగా ఉండగలిగారు . ఆ పంటలు వలన దనాభివృద్ది కూడా కలిగి సకల జనులు అష్టైశ్వర్యాలతో , ఆయురారోగ్యాలతో సుఖ శాంతులు తో ఉన్నారు . వీటన్నింటికి ప్రధాన కారణం ఏమిటి ? గోమాత వలన మానవాళికి మంచి జరుగుతుందనే   జ్ఞానం . సదరు జ్ఞానం ని మానవ కళ్యాణానికి , ప్రక్రుతి లేక పర్యావరణ పరిరక్షణకు మాత్రమే ఉపయోగించాలి అన్న ఇంగిత జ్ఞానం . మానవాళి కి మంచి చేసిన గో మాత పట్ల మన పూర్వికులు తమ కృతజ్ఞతను చాటుకోవడానికి అనుసరించిన విధానమే "గో మాత ఆరాధన ". అందులో భాగమే గో పూజ, గో ప్రదక్షిణ వగైరాలు . తమ పూర్వీకుల గో ఆరాధనా విధానం నే మనలో చాలా మంది ఈ నాటికి పాటిస్తున్నారు . ఇది భక్తి మార్గం లో భాగమే కదా! అసలు నన్నడిగితే నేటి ఆధునికులు అని విర్రవీగే మనకు మన పూర్వీకుల విధానాలను విమర్శించే నైతిక అర్హత ఉందా? ఉంది అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా ? లేదు ఎందుకంటే మన గుండెలు మన పూర్వీకుల గుండెలు అంత  స్ట్రాంగ్ గా లేవు గనుక !. ఎందుకు లేవో చూద్దాం . 


      ఆవులను పూజించటం మానివేసాం . ఆవు పేడను ఎరువుగా వాడిన భూములు నుండి వచ్చిన పంటలు లోని పోషక విలువలు కంటే , ఆవులను కోసుకు తినడం ద్వారా ఎక్కువ పోషక విలువలు లభిస్తాయనే ఆధునిక జ్ఞానం  తెలుసుకున్నాం . ఎక్కడో పంటలు పండని ఎడారి ప్రాంతాలు నుండి వచ్చిన వారి మతం లో వారి ఆహారపు అలవాట్లకు ఆకర్షితులై , ఆరోగ్య ప్రదాతలు అయినా ఆవులను కబేళాలకు తరలించడం మొదలు పెట్టాం. ఫలితంగా సాంప్రదాయ వ్యవసాయం నాశనమైంది . ఆధునిక గ్రందాల్లోని  సారాంశం తెలుసుకుని శాస్త్రీయ వాదులం అయి పోయాం. ఆవు పేడ ను ఎరువుగా ఉపయోగిస్తే ఎకరానికి 10 బస్తాలే వస్తాయి , అదే శాస్త్రీయ రసాయనిక ఎరువులు వాడితే నాలుగు ఇంతలు  ఎక్కువ దిగుబడులు వస్తాయి అనే గ్రంథ విజ్ఞానం వలన రెచ్చిపోయి భూములను రసాయనిక ఎరువులు తో నింపి వేసాం. తద్వారా విస్తారంగా వస్తున్న పంట దిగుబడులు చూసి మన విఙ్నానానికి మనమే ఎంతో మురిసి పోయాం. ఆవులు ఇచ్చే పాలు ప్రెష్ గా తాగే విధానం లోనుంచి వాటిని కృత్రిమంగా ప్యాక్టరీలలో నిలువ చేసే  పరిజ్ఞానం సంపాదించాం. చివరకు పాల ఉత్పత్తి  కొరత వలన కృత్రిమ రసాయనిక పాలను సృష్టించే విజ్ఞానం వంట బట్టించుకున్నాం .   చివరకు ఏమైంది ? మనుషులు ఉత్త మనుషులు అయ్యారు , భూములు వట్టి భూములు అయ్యాయి . 

    మనకు లభిస్తున్నఆహార పదార్థాలు లో విషం ,కూరగాయలు లో విషo ,పొద్దునే ఇంట్లోకి తెచ్చే పాల ప్యాకెట్లలో విషం. ఆరోగ్యం కోసమని తెచ్చుకునే పండ్లలో విషం . ఇలా మన ఆరోగ్యాల కోసమని ఉపయోగించే పదార్థాలు అన్ని విష తుల్యమైతే మరో దిక్కు లేక వాటినే ఆరగించుకుంటూ అనేక అనారోగ్యాలకు గురి అయి కార్పరేట్ ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ "ఆధునిక మానవులం " అని చంకలు గుద్దుకుంటున్నాం . కమ్మని కాపీ త్రాగే ప్రాప్తం లేదు . తియ్యటి పండు తినే ప్రాప్తం లేదు . అంతెందుకు?  కమ్మని విందు భోజనం ఆరగించే దమ్మున్నా వారు ఎంత మంది ? పట్టు మని పాతికేళ్ళు రాక ముందే "చక్కర వ్యాధి " సంప్రాప్తమవుతుంటే ఇక మనిషి ఆనందంగా జీవించేది ఏమిటి ? టిఫిన్ చేయాలంటే గోలి మార్ (మందు బిళ్ళ) , భోజనం చేయాలంటే  గోలి మార్ , పడుకోవాలంటే గోలి మార్ , కాసేపు పరిగెత్తితే ఆయాసం వచ్చి గోలి మార్ అనాలసిందే .ఈ మధ్య పేపర్లో చదివాను . నగరాల్లో ఉద్యోగాలు చేసే యువత సంసారంలో సరిగమలు పలికించుకోవడానికి కూడా  తమ క్యాలండర్ లలో డేట్ లు పిక్స్ చేసుకుని అలా కాలం ని నెట్టుకొస్తున్నారట. అది ఆధునిక జీవన విధానం . ఇదంతా ఎవరి మహిమ? గోవు చుట్టూ తిరిగినంత సేపు మనిషికి ఇలాంటి దురవస్థ రాలేదు. గ్రంధాలు ను పారాయణం చేసి శాస్త్రియ జ్ఞానం సంపాదించడం వలననే ఇలాంటి "గోలి మార్ " అసమర్థ  జీవనయానo .

     ఇప్పుడు చెప్పండి ఆవు చుట్టూ తిరిగిన వారు అజ్ఞానులా ? గ్రంధాల సారం గ్రహించామని  విర్రవీగే వారు అజ్ఞానులా ? ఈ  విషయం లో నా నిశ్చితాభి ప్రాయం ఒకటే " మానవత్వ హీనమైన జ్ఞానం  వలన లభించే భౌతిక అనందం కన్నా ఆరాధన తత్త్వం ద్వారా లభించే అలౌకిక ఆనందమే మిన్న ". 

Comments

  1. good article
    https://youtu.be/2uZRoa1eziA
    plz watch our channel'

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!