అంద్రా వారికి కావలసింది నిజంగా ఐఖ్యతా, హైద్రబాదులో వాటానా?
అన్న దమ్ములు ఆస్తుల కోసం,హక్కుల కోసం విబేదించడంలో తప్పు లేదు. అసలు నన్నడిగితే,కుటుంబంలో అయినా,వ్యాపారంలో అయినా అరమరికలు లేకుండా ఎప్పటి కప్పుడు పద్దతి ప్రకారం లెఖ్కలు చూసుకుంటూ,నిర్మొహమాటంగ తప్పులు ఎత్తి చూపుతూ, వాటిని సరిచేసుకునే అన్న దమ్ములు కలకాలం కలిసి ఉండగలుగుతారు. ఇందులో వారి నిర్మొహమాటం,నిక్కచ్చితనం వల్ల ఎప్పటి కప్పుడు వారి మద్య అభి ప్ర్రయ బేదాలు తొలగిపోయి,ప్రశాంతంగా జీవించటానికి తోడ్పడుతుంది. అలా కాక అన్న మీద గౌరవం పేరుతో తప్పు జరుగుతున్నా తమ్ముళ్ళు ఏమి మాట్లాడక పోవడం, తాను చేసే దానికి తమ్ముళ్ళు ఏమి అనటం లేదు కాబట్టి వారి అనుమతి ఉన్నట్టు గా బావించి,అన్న తీసుకునే నిర్ణయాలు కుటుంభానికి నష్టం కలిగించి నప్పుడు,అప్పట్టి దాక...