అంద్రా వారికి కావలసింది నిజంగా ఐఖ్యతా, హైద్రబాదులో వాటానా?


                                                          

   అన్న దమ్ములు ఆస్తుల కోసం,హక్కుల కోసం విబేదించడంలో తప్పు లేదు. అసలు నన్నడిగితే,కుటుంబంలో అయినా,వ్యాపారంలో అయినా అరమరికలు లేకుండా ఎప్పటి కప్పుడు పద్దతి ప్రకారం లెఖ్కలు చూసుకుంటూ,నిర్మొహమాటంగ తప్పులు ఎత్తి చూపుతూ, వాటిని సరిచేసుకునే అన్న దమ్ములు కలకాలం కలిసి ఉండగలుగుతారు. ఇందులో వారి నిర్మొహమాటం,నిక్కచ్చితనం వల్ల ఎప్పటి కప్పుడు వారి మద్య అభి ప్ర్రయ బేదాలు తొలగిపోయి,ప్రశాంతంగా జీవించటానికి తోడ్పడుతుంది. అలా కాక అన్న మీద గౌరవం పేరుతో తప్పు జరుగుతున్నా తమ్ముళ్ళు ఏమి మాట్లాడక పోవడం, తాను చేసే దానికి తమ్ముళ్ళు ఏమి అనటం లేదు కాబట్టి వారి అనుమతి ఉన్నట్టు గా బావించి,అన్న తీసుకునే నిర్ణయాలు కుటుంభానికి నష్టం కలిగించి నప్పుడు,అప్పట్టి దాక బెల్లం కొట్టిన రాయిలా ఉన్న వారు, ఒక్కసారిగా అదేదో సినిమాలో హీరో అన్నట్లు "అంతా నువ్వే చేశావు" అని పెత్తనం చేసే వారిమీద విరుచుకు పడుతుంటారు. అదిగో అలాంటప్పుడే అప్పటి దాక ఎంతో ఆదర్శంగా పైకి కనిపించిన ఆ అన్న దమ్ములు ఒక్క దెబ్బతో విడి పోతారు. ఇక్కడ  కుటుంభ సబ్యుల అయిక్యతకు బంగం కలిగించే నిర్ణయలు తీసుకున్న అన్న యెంత బాద్యుడో, సమస్య తమ ద్రుష్టికి రాగానే అడగడం వదిలేసి సాచేత దోరణి అవలంభించిన తమ్ముళ్లు బాద్యులే.

  పై ఉదాహరణ ఎందుకు అంటే ,ఇప్పుడు మన రాష్ట్రం విడిపోవడానికి కేవలం ఆంద్రావారినో, తెలంగాణా వారినో బాద్యులుగా చూపడం ద్రుష్టి లోపమే  అవుతుంది. ఒక వేళా తెలంగాణా వారు అంటున్నట్లు ఆంద్రావారి అరవైయేండ్ల దోపిడే రాష్ట్ర విబజనకు కారణమయితే , మరి ఈ నిరంతర దోపిడిని ప్రశ్నించి అరికట్టలేని తెలంగాణా నాయకులది తప్పు కాదా? తప్పులు మీరు చేసి పైపెచ్చు ప్రజల మద్య తంపులు పెట్టడం ఎంత వరకు సబబు. అటు ఆంద్రా ప్రజలు అయినా, ఇటు తెలంగాణా ప్రజలు అయినా వారి వారి రాజకీయ నాయకుల మీద పూర్తి విశ్వాశం ఉన్నట్లు ఏమి కనబడటం లేదు. కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే ఈ విబజన మీద గొడవ. బావోద్వేగాలు కొంత కాలం ప్రబావం చూపినా, చివరకు హైద్రాబాద్,సాగునీరు విషయాలలో వాటాలు కుదిరితే ఆ వర్గాలు కూడా శాంతించ వచ్చు.ప్రజలకు నమ్మక్కం కలిగించి, సమైఖ్యతతో  పాలించగల దమ్మున్న మగాడు లేనప్పుడు, విడిపోయి ఎవరి ఏడుపు వారు ఏడవడం మంచిది.

             అటు ఆంద్రా వారిలో కూడా హైద్రాబాద్ పోతే తమ పిల్లల బవిష్యత్తు ఎదో పాడైపోతుందనే బావంతో సమైక్యతను కోరుకుంటున్నట్లు కనపడుతుంది.దాని కోసం ఆఖరకు "నిర్బయ " లను కాపాడలేని డిల్లి  వారి పాలనలో హైదరాబాద్  ఉండాలని కోరుకుంటున్నారు . ఇటు తెలంగాణా వారిలో కూడా ఆంద్రా వారు ఏదో తమని దోపిడి చేస్తూ ఉండబట్టె తమకి ఉద్యోగ అవకాశాలు రావడం లేదని ఫీలవడ్డం వల్లనే రాష్ట్ర విబజనకు డిమాంద్ చేస్తున్నట్లు ఉంది.రేపు తెలంగాణా వచ్చాక కూడా   వారికి ఉద్యోగాలు రాకపోతే  పరిస్తితి ఎలా ఉంటుంది ? ఆలోచించారా ?    వారిలో కాని , ఇటు ఇటు వీరిలో కాని , "మనమ్ అన్న దమ్ములం. మన చరిత్ర చాలా గొప్పది.మగాళ్ళు పరిపాలన చేసిన రోజుల్లో కలసి ఉన్నాం. కొజ్జాలు పాలన చేసిన రోజున విడి పోయాం. గత కొన్ని వందల యేండ్లుగా మనల్ని ఏకం చేసే మగాడే రాకపోయే.! ఏదో కమ్మునిశ్టులు, స్వ్వాతంత్ర సమరశీలురు,మరియు  సర్దార్ వల్లభ భాయి గారి దయ వల్ల, కొన్ని ప్రాంతాలు కోల్పోయినా, ఎలాగో మనం ఏకమయ్యే బాగ్యం కలిగింది. కొంచం స్వార్దం వదలిపెట్టి మన తెలుగు జాతి ఒక బలమైన జాతి అని చాటుదాం" అని ఎంతమందికి ఉంది? నిజంగా ఉంటే మొదట మీరు చెయ్యాల్సిన పని ఇప్పుడున్న  రాజకీయ పక్షాలను వదలి వేయండి.కుల, మత, వర్గ, ప్రాంతీయ స్వార్దం కోసం కాక  కేవలం తెలుగుజాతి ఏకత కోసం,తెలుగు గడ్డ అభివ్రుద్ది కోసం పని చేసే ఒక రాజకీయ పార్టిని స్తాపించి దాని కింద ఏకం కండి. అంతే తప్పా, ఎవరి పార్టీని వారే సమర్దించుకుంటూ, ఎవరి నాయకులను వారే పొగుడుతూ, ఎదుటి వారి మీద బురద చల్లాలనుకునే ఈ నీచ రాజకీయాలు వల్లా అటూ ఆంద్రా, ఇటు తెలంగాణా ప్రజలు చివరకు చూడబోయేది రావణ కాష్టం లాంటి శ్రిలంక రాజ్యాల్నే తప్పా,వెలుగులు వెలిగే తెలుగు రాజ్యాలను మాత్రం కాదు.

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం