భగవంతుడు ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుంటున్న "బడా స్టార్".




                                                                    

   దేవుడు ప్రతి మనిషికి జీవితంలో ఒకటో,రెండో అవకాశాలు ఇస్తాడట, తమ జీవితం సార్దకం చేసుకోవడానికి. అది గ్రహించి ఆ అవకాశాన్ని వినియోగించుకున్న వాడు చరిత్ర పురుషుడు అవుతాడు. వినియోగించుకోని వాడు సామాన్యుడిగానే మిగిలి పోతాడు. కాని ఆ అవకాశాన్ని దుర్వినియోగ  పరచిన వాడు మాత్రం తప్పకుండ చరిత్ర హీనుడవుతాడు.

  మన తెలుగువారిలో నాకు తెలిసినంత వరకు అట్టి అవకాశాన్ని వినియోగించుకుని సఫలీక్రుతులైన వారు గౌరవనీయులు నందమూరి తారక రామరావు గారు . ఆంద్రుల అత్మ గౌరవ నినాదం తో, తెలుగు పతాకాన్ని జాతీయ స్తాయిలో రెపరెప లాడేలా చెయ్య గలిగిన వాడు తారక రామరావు. అప్పట్టిదాక సౌత్ ఇండియా అంటే డిల్లీ వారి ద్రుష్టిలో కేవళం "మద్రాసీ" మాత్రమే అనుకునే స్తాయి నుండి ఆంద్రా అనేది ఉన్నదని ఉత్తర బారతం వారికి తెలిసేలా చేసారు. గౌరవనియులు పి.వి. నరసింహా రావుగారు, ప్రదాన మంత్రిగా, గౌరవనీయులు రాజశెఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినా , వారు డీల్లీ పాలకుల అనుమతానుసారమే చేసారు కాబట్టి , ప్రదమ తాంబూలం రామారావు గారికే దక్కుతుంది. ఇక చంద్ర బాబు నాయుడు గారు కూడా , డిల్లీ పాలకులకు వ్యతిరేకమైనప్పట్టికి, అది రామారావు గారి వారసత్వం తప్పా వేరు కాదు.

  రామారావు గారి స్పూర్తితో తెలుగు చలన చిత్ర సీమ నుండి ఆర్బాటంగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన మరో బడా స్టార్ "చిరంజీవి" గారు. ఆయన గారి ఠాగూర్, స్టాలిన్ లాంటి బొమ్మలు చూసి తెలుగు జాతి పౌరుషాన్ని ప్రతిబింబించగల మరొక నాయకుడు దొరికాడని తెలుగు ప్రజలు ఆశ పడ్డారు. "ప్రజా రాజ్యం" ఆరంభ సభ చూసి మరొక "తెలుగు సూర్యుడు" ఉదయిస్తునాడు అని ప్రజలు సంబరపద్డారు. కాని ఎన్నికలలో కొద్ది సీట్లు  మాత్రమే సాదించిన ప్రజారాజ్యం పార్టీ ని చూసి ప్లాప్ అయిన సినిమా హీరోలా ఫిలయిన చిరంజీవి,డిస్టిబ్యూటర్ లకు  స్వంత సినిమా అమ్మినట్లు పార్టిని డిల్లీ వారికి సమర్పించేసి తాను మాత్రం మంత్రి అయ్యాడు. ఇప్పుడు రాష్ట్ర విబజన వచ్చేసరికి తెలుగు వారి పక్షాన గళం వినిపించాల్సిన సమయంలో కేంద్రం పక్షానా చిలక పలుకు పలుకుతూ , అమ్మ పట్ల తనకున్న అత్యంత వినయ విదేయతలు ప్రకటించటం చూస్తుంటే "ఇలాంటి వాడినా మనం సూర్యుడు అనుకున్నది" అని తెలుగు ప్రజలు బాద పడుతున్నారు.

   కాళ్ళు పిసికితే  వచ్చే ముఖ్యమంత్రి పదవి కన్నా, కన్నెర్ర చేస్తే వచ్చే  మున్షీ  పదవి ఎంతో గౌరవప్రదమయింది. చిరంజీవి గారికి సకల బోగ బాగ్యాలు ఉన్నాయి. ఆయన స్తాయికి కేంద్ర మంత్రి పదవి ఆప్ట్రాల్. అధిష్టానం కాళ్ళు పట్టు కుంటే మంత్రి పదవి లబించవచ్చు. కాని ప్రజాబిమానం చూరగొనాలంటే పూర్వ జన్మ సుక్రుతం ఉండాలి. అది చిరంజీవి గారికి పుష్ఖలంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో సిమాంద్రులు , కేంద్ర్రానికి వ్యతిరేఖంగా   రాష్ట్ర సమైక్యతను కాపాడ గల  దమ్మున్న నాయకుడు కావాలని చూస్తున్నారు. మరి ఇటువంటి సువర్ణ అవకాశాన్ని  సమర్దుడైన వారు ఎవరైనా వదులు కుంటారా? ముఖంలో ఎక్కడా లేని విదేయత బావాన్ని ప్రదర్సిస్తున్న చిరంజీవి గారు  ఎన్నటికి తెలుగు జాతి పౌరుషాన్ని చాట లేడని అర్దమవుతుంది. కొన్ని మీడియా కదనాల ప్రకారం చిరంజీవి లొంగుబాటు తత్వం వలనే తెలుగు ప్రాంత విభజన జరిగింది అంటున్నారు. అదే నిజమయితే ఆయన చరిత్ర హీనుడవుతాడు. అలా కాకుండా ఉండాలంటే, వచ్చిన సువర్ణ అవకాశం ని ఎలా వినియోగించుకోవాలో విజ్ణులని సంప్రదిస్తే మంచిది. "సంక్షోభం నుండే నూతన నాయకత్వం ప్రభవిస్తుంది అనేది నిజమే అయితే తప్పకుండా మరొక నూతన రాజకీయ నాయకత్వాన్ని మనం చూడ వచ్చని ఆశించవచ్చు......

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!