"మరాటా సింహం" శివుని సన్నిదికి వెళ్లారు.
ఏ స్తానిక ప్రజా సమూహమైనా ఒక ప్రత్యేక గుర్తింపు పోందాలన్న కోరికకలిగి వుంటుంది. మన దేశంలో కులవ్యవస్త బలీయమైనా,ఎక్కడా ఒకే కులసమూహాం గా జీవించలేదు.భాషా సమూహాంగా జీవిస్తున్నాం.అదే ఉద్దేశ్యంతో మన సర్కార్ వారు బాషా ప్రయుక్త రాష్ట్రాలు గా దేశాన్ని పాలనా మండళ్లుగా విబజించింది. వాటిలో మరాటిలు నివసించే "మహారాష్ట్ర"ఒకటి. "బోంబాయి" మహారాష్ట్ర రాజధాని అయినప్పటికి,అది అనేక రాష్ట్రాల ప్రజల్ని ఆకర్షించడం వల్ల,ఇతర రాష్ట్రాల నుండి వలసలదికమై చివరకు స్తానిక ప్రజల జీవన అవకాశాలకు గండి కొట్టడం వల్ల వారి నిరసన"మరాటా ఆత్మాభిమానం" రూపంలో వెల్లువెత్తింది.ఆ వెల్లువ కు రూపమే"బాల్ దాకరే" మొదట్లో "మరాటా ఆత్మ...