స్త్రీ జనోద్దరణ అంటే "మొగుడ్నిమొదటి దెబ్బ.కొట్టు" అని ", పెళ్ళానికి పనికి మాలిన సందేశం ఇవ్వడమా!?
ఈ మద్య పనీ పాట లేని కుర్రకారు కొంతమంది , సోషల్ మీడియాల్లో పాపులారిటి తో పాటు డబ్బులు కూడా వస్తాయని కాబోలు అర్ధం పర్దం లేని స్వీయ కల్పిత సన్నివేశాలు ను చిత్రీకరించి , వాటిని తమ విశ్లేషణ లకు అనుకూలంగా ఎడిటింగ్ లు చేసి యూ ట్యూబ్ లో పెట్టేస్తున్నారు . వాటిలొ ఒకటి నిన్న చూసాను . దాని సారాంశం ఏమిటంటే పురుషులు తమ బార్యలను పబ్లిక్ గా ఎంత హింసించినా పట్టించుకోని పబ్లిక్ , అదే స్త్రీ తన ఆత్మ రక్షాణార్దమ్ తిరిగి భర్త ని ఒకటి కొడితే పబ్లిక్ అంతా పోగయి వారిని విడదీసి , అతనికి సపోర్ట్ గా నిలుస్తారట! అందుకే ఎప్పుడైనా సరే భర్త వయిలెంట్ అయితే మొదటి దెబ్బ భార్యయే కొట్టాలట! లేకపోతే ఆమెకు ఛాన్స్ రాదనీ దిక్కుమాలిన సందేశం ఇస్తుంది క్రింద ఇవ్వబడిన "First Slap From you :elimination of violence against women" . అబ్బా! ఎంత గొప్ప సందేశం. భార్యా భర్తల గొడవల్లో ఒకరు ఉద్రేక పడినప్పుడు , మరొకరుతగ్గిఉండి గొడవ తగ్గుముఖం పట్...