ఆస్తికత్వమైనా, నాస్తికత్వమైనా చివరకు నిర్దారించేది దైవ ఉనికినే.
దైవత్వం అనే బావన మానసిక పరమైనది. ఈ కనిపిస్తున్న స్రుష్టి అంతటికి కారణమైంది ఏదొ ఒకటి ఉందన్న ఆదిమ బావనలోనూడి ఉద్బవించిందే దైవత్వ బావన. "ఏ ఒక్కటి తెలుసుకుంటే సర్వం తెలిసినట్టవతుందో అదే బ్రహ్మ జ్గ్ణానం " అన్నది వేద ఉవాచ.ఇక్కడ బ్రహ్మ జ్గ్ణానం అంటే మరేదో కాదు ఈ స్రుష్టి కారకమైన దైవం గురించి తెలియడమే. దాని కోసం మానవుడు ఒక ప్రక్క జ్గ్నాణ మార్గంలో,మరొక ప్రక్క భక్తి మార్గంలో వందల యెండ్లుగా శొదిస్తున్నాడు. మన హిందూ జీవన విదానం అటు జ్గ్నాన మార్గానికి,ఇటు భక్తి మార్గానికి సమాన గౌరవం ఇచ్చింది.భక్తి మార్గం అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మి, ఏదొ ఒకీ రూపంలో కాని రూపరహితంగా కాని భక్తి పూర్వకంగా ఆరాదిస్తే ఆ దేవుని సాఖ్షాత్కారం కల్గుద్ది అని నమ్మి పాటించడం, జ్గ్ణాన మార్గం అంటె దేవుడు ఉన్నాడు అని నమ్మి, ఆ శక్తిని తెలుసుకోవాడానికి ద్యాన మ...