కామం ని ప్రేమ అనుకుంటే కాలమంతా చిత్తకార్తే!
ప్రేమ కి ఒక విశిష్టత ఉంది.అదేమిటంటే అది ఎవరినైనా ఒకే ద్రుష్టితో చూస్తుంది. అది తల్లితండ్రుల మీద కావచ్చు, బార్యా భర్తల మద్య కావచ్చు, కుటుంభ సబ్యులమీద కావచ్చు. తను ప్రేమించే వారి సుఖ సౌఖ్యాలను కాంక్షించడమే నిజమైన ప్రేమ . అంతే కాని తమ సుఖం కోసం తమను ప్రేమించేవారిని కాలదన్ని వారిని బాదించడం దానికి ప్రేమ అనే అందమైన పేరు పెట్టుకుని తమ సుఖం తాము చూసుకోవడమ్ ఖచ్చితంగా కుటుంబ ద్రోహమే అవుతుంది. నాకు తెలిసిన కథ చెపుతాను.మీరే ఆలోచించండి. ఒక మద్య తరగతి రైతు కుటుంబం నకు చెందిన ఇంటర్ అమ్మాయి, వారి ఇంటికి దగ్గరలో ఉంటున్న కూలి కుటుంబం నకు చెందిన అబ్బాయి లవ్ లో పడ్డారు.వారి విషయం తెలిసిన పెద్దలు అమ్మాయిని మందలించి అమ్మాయ్ని వాళ్ల అమ్మమ్మ ఇంటికి పంపించారు. ఇది తెలిసుకున్న అబ్బాయి తన స్నేహితులతో కలిసి ఆ అమ్మాయి ఉంటున్న దగ్గరికి వెళ్ళి, ఆమెను ప్రొత్సహింహించి అమ్మాయితో జంప్ అయి పోయారు. ఇది తెలిసిన పెద్ద...