రక్షణ విషయంలో, ఆడపిల్ల, కుక్కపిల్ల,ఒకటేనా?
మొన్న డిల్లీలో ఒక ఆడపిల్ల మీద జరిగిన దాడిని చూసిన తర్వాత,మనసున్న ఎవరికయినా కన్నీల్లు రాక మానవు. చివరకు ఆ అమ్మాయికి మెరుగయిన వైద్య సహాయం అందించే స్తితిలొ కూడ మనం లేము. మనకంటే ఎంతో చిన్నదయిన "సింగపూర్" కి పంపించాల్సీ వచ్చింది. విషయం జరిగి నాలుగు రోజులు అయింది కాబట్టి,అంతా సద్దుమనిగిపోతుందిలే అని ప్రబుత్వాదికారులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఒక వేళ ఆ తల్లి కేమన్నా అయితే మరొక రోజు విచారిద్దాం.ఈ కేసు తర్వాత దేశం లో ఇంకొన్ని ఇటువంటి దురాగతాలె జరిగాయి.వాటిని పత్రికలు ప్రచురించినా పెద్దగా స్పందన రాలేదు. డిల్లీలో ఒక విద్యార్థినికి జరిగిన అన్యాయం మీద విద్యార్థులు గళమెత్త బట్టి సాక్షాత్...