మీకు ఇష్టమైన దానిని "ఎక్స్-రే" కళ్లతో చూస్తే, కనిపించేది "విశ్వరూపమే"
సాదారణ(బాహ్య ద్రుష్టి) వేరు జ్ణాన ద్రుష్టి వేరు.అలాగే సాదారణ ప్రజలు వేరు, జ్ణానులు వేరు.జ్ణానులు సాదార్ణంగా ఐహిక సుఖాల మీద అంత ఆసక్తి కలిగి ఉండరు. సామాజిక బాద్యతలలో కూడా ఏది ఎంత వరకు అవసరమో అంత వరకే చేస్తారు. ఇతర సాదారణ ప్రజలు వలే ఆరాట పడరు. కారణం వారికున్న జ్ణాన ద్రుష్టి.మరి ప్రజలందరికి ఇటువంటి జ్ణాన ద్రుష్టి అవసరమా? అలా ఉంటే ఈ సమాజం నిరిప్తత,నిస్తేజమయి పోతుంది. అందుకే గీతాచార్యుడు అంటాడు"వేల కొలది జనులలో,ఏ ఒక్కడో జ్ణాన శక్తి కొరకు ప్రయత్నించును,అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్థం గా తెలుసుకో గలుగుతున్నాడు.". ఈ కారణం చేతనే మనకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. మనిషి పునరుత్పత్తి,ఆనంద జీవనానికి కామ ద్రుష్టి తప్పని సరి.స...