మహిషాసురిడిని మట్టు పెట్టిన ఖమ్మం జిల్లా పోలిసులు!
మనకు పురాణా గాధ ఒకటి ఉంది. మహిషాసురుడనే రాక్షసుడు ఒకడు ప్రజలను, మునులను విపరీతంగా బాదిస్తుంటే,ఆతడి బాద తట్టుకోలేని వారు ఆ శక్తిని ప్రార్దిస్తే, మాత మహిషాసుర మర్దనం గావించి అందరికి మేలు చేకూర్చిందని. ఇక్కడ మాత అయితే రాలేదు కాని పాల్వంచ పోలిసులు వచ్చారు, మహిషాసురిడిని మర్దించారు! వివరాల్లోకి వెలితె, రంగారావు గారు ఒక రైతు. ఖమ్మం జిల్లా, పాల్వంచ మండలం నాగారం గ్రామం లో అతనికి పొలం ఉంది. ఆ పొలంలో ని పైరును ఒక దున్నపోతు మేయటం చూశాడు అతడు . దానిని అదిలించాడు. అదే అతను చేసిన తప్పు. ఇక్కడ సదరు దున్నపోతు గురించి పరిచయం ఏమిటంటే, అక్కడ ప్రజలు కొందరు దేవుని పేరు మీద మొక్కుబడిగా "దున్నపొతులను" వదలడం రివాజు. ఆ దున్నపోతులు స్వేచ్చగా తమకు ఇష్టం వచ్చిన చోట మేయటం, పడుకోవటం చేస్తుంటాయి. వాటిని రైతులు "దేవుని దున్నపోతులు" కాబట్టి ఏమి అనరు!. కాని రంగారావు గారు మాత్రం దానిని అదలించారట!. దానితో కోపం వచ్చిన దున్నపోతు రంగారావు వెంటపడితే ఆయన భయంతో పరిగ