తెలంగాణా ను అడ్డుకుంటున్నందుకే C.M గారి హెలికాప్టర్ ను M.P గారు పేల్చి వేస్తాను అంటుంటే , రేపు తెలంగాణా రాకపోతే సీమాంద్రా సెటిలర్స్ పరిస్తితి? ?
ఎవరికైనా పెడతానంటే ఆశ , కొడతానంటే భయం! సీమాంద్రా నాయకులు ఇచ్చిన అంగీకార పత్రాలు ఆదారంగా సోనియా గాందీ తెలంగాణా రాష్ట్రానికి O.K అంది. కానీ ఇప్పుడు సీమాంద్రా ప్రజలు ఒప్పుకోవటం లేదు కబట్టి కోంతమంది నాయకులు మాట మార్చి సమైక్యామ్ద్రా కావలంటున్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ఉన్న కీలక సమయం లో ముఖ్యమంత్రి గారు తెలంగాణా మంత్రి గారు నిర్వహిస్తున్న శాసన సభ వ్యవహారాల శాఖ మార్చి దానిని సీమాంద్రా కు చెందిన మంత్రికి అప్ప చెప్పడం ఖచ్చితంగా రెండు ప్రాంతాల నాయకుల మద్య అరని చిచ్చును రగిలించే చర్య అని చెప్పవచ్చు. దీని మీద తెలంగాణా కు చెందిన M.P పొన్నం ప్రభాకర్ గారు C.M. గారి మీద కారాలు మిరియాలు నూరుతూ ,C.M గారు కరీం నగర్ వస్తే అయన హెలికాప్టర్ ను గాల్లోనే పేల్చి వేస్తాను అని ఒక తీవ్ర వాది లా మాట్లాడడం , తెలంగాణా నాయకులలో రాష్ట్ర విభజనను అడ్డుక...