దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!
ప్రపంచం లో వెల్లివిరుస్తున్న మై చాయిస్ కల్చర్ లో భాగం అయినటువంటి "సింగిల్ పేరెంట్ " సిస్టం ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఉదాహరణ నటుడు తుషార్ కపూర్ తండ్రి అయిన విధానం . సింగిల్ పేరెంట్ విధానం అంటే పుట్టిన పిల్ల లేక పిల్లవాడికి తల్లితండ్రులు ఉండరు. తల్లి లేక తండ్రి మాత్రమే ఉంటారు. ఇదెలా అంటే పెండ్లి అంటే ఇష్టం లేని వారు, అపోజిట్ సెక్స్ మీద ఇంట్రస్ట్ లేనివారు , లెస్బియన్, గే సంబంధాలు పట్ల అనురక్తి కలవారు , తమలో సహజంగా కలిగే సంతాన వాంఛా , తద్వారా వంశాభివృద్ధి చేసుకోవాలనే కోరికను నెరవేర్చుకోవడానికి , ఆధునిక వైద్య శాస్త్రం అందించే సర్రోగసి లాంటి విధానాలు ను పాటించి తల్లి లేక తండ్రిగా తమ పిల్లలను ఈ భూమి మీదకు తీసుకువస్తున్నారు. అలా సర్రోగసి విధానం ద్వారానే తనకు కొడుకు పుట్టాడని సంతోషంగా ట్విట్టర్ లో ప్రకటించాడు నటుడు నిర్మాత అయినా తుషార్ కపూర్ అనే బాలీవుడ్ నట...