చివరికి పాపులర్ ఫాదర్లు కూడా సినిమా యాక్టర్లేనా!
ఫావరేట్ ఫాదర్ కీ.శే. మద్దిగుంట తిరుపతయ్య గారు. అమ్మయ్యా! గాందీ గారు చనిపోయి బ్రతికి పోయారు. లేకుంటే ప్రెసెంట్ పాపులర్ ఫాదర్ని చూసి, ఖచ్చితంగా " హరీ రామ్" అనేవారు. ఏ పిల్లలకయినా తమ తల్లితండ్రులే గ్రేట్. తమకోసం కష్టపడి, నిరంతరం తమ కెరీర్ కోసం తపిస్తున్న తమ తండ్రిని ఏ బుద్దున్న బిడ్డా మరచిపోడు. తమ తండ్రి తమ కోసం ఎంత కష్ట పడుతున్నారో, అందరి తండ్రుల్ అలాగే తమ తమ పిల్లల కోసం , వారి ఉన్నతి కోసం ఆరాటపడుతున్నారు. ఎక్కడో ఒకరిద్దరు మినహాయింపు ఉంటే ఉండవచ్చు. కాని జనరల్ ప్రతి బిడ్డకి తమ తండ్రిని మించిన అభిమాన హీరో మరొకరు ఉండరు. అందుకే కాబోలు అందరికి ఉన్నట్లే తండ్రులను గుర్తుంచుకోవడం కోసం ఒక రోజు వారికి ...