కోడి గుడ్ల కోసం కోరి గర్భం తెచ్చుకున్నామన్న "దేవుని బిడ్డలు"!!!
వారు గోదావరి ఖనికి చెందిన 5 గురు మహిళలు .విశ్వాసులు అందరికీ ఉన్నట్లే వారికీ ఒక దేవుడు ఉన్నాడు . వారు ఆ దేవుడి గురించి యమ ప్రార్ధనలు చేస్తే , వారి ప్రార్దనా దీక్షకు మెచ్చి వారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు . ప్రత్యక్షమై " ఏమి కావలయును అడుగండి " అని అనగా " మాకు కడుపులు కావలయును దేవా " అని తమ మనసులోని కోరికను తెలియ చేసారట . అయితే ఇందులో తిరకాసు ఏమిటంటె ఆ 5 గురు మహిళల్లో ఒకరికి ఆరోగ్యా కారణాల చేత గతం లో గర్భ సంచి తీసివేస్తే , మరొకరికి కుటుంభ నియంత్రణా పదకంలో బాగంగా ఆపరేషన్ చేసారట . అందుకే వారి దేవుడికి కొంత అనుమానం వచ్చి " ఇప్పుడు గర్భం లు ఎందుకు " అని ప్రశ్నించగా , తమ కాలనీలో గర్భవతులకు మాత్రమే , ప్రభుత్వం వారు రోజూ గుడ్లు , పౌష్టిక ఆహారం ఇస్తున్నారు కాబట్టి , అవి కావాలంటే " కడుపులు కంపల్సరి " అనే సరికి తెల్ల బోయిన వారి దేవుడ...