Posts

Showing posts with the label save the temple

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

Image
                                                                                             తిరుమల తిరుపతి దేవస్థానం ! దేవ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి కోవెల . ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఆర్థికపరంగా వత్సరానికి అన్ని వనరుల నుంచి  వేయి కోట్ల పైన ఆదాయం పొందుతున్న దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు మీద అజమాయిషీ కోసం ప్రభుత్వం I.A.S  కేడర్ కలిగిన అధికారిని కమిషనర్ గా నియమిస్తే ,కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం గ్రూప్ ఆలయాల అజమాయిషీ కోసం ప్రత్యేకంగా  I.A.S  కేడర్ కలిగిన అధికారిని  "కార్య నిర్వాణాధికారిగా " నియమిస్తున్నారు అంటే ఆర్థిక పరంగా ఆ దేవాలయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవచ్చు. తిరుమల క్షేత్ర్రాలు నిర్వహణ కోసం ప్రత్యేక చట్టం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆక్ట్ లో అంతర్భాగంగా ఉంది. తిరుమల కొండ పైన ఉన్న అన్ని విభాగాలకు చెందిన సంస్థలు పంచాయతీ ,పారెస్ట్  లాంటివి కూడా దేవస్థానం E.O అజమాయిషీ లోనే పని చేస్తుంటాయి.     ఇక పొతే తిరుమల దేవస్థానం కార్యకలాపాలు విషయం లో భక్తులకి ఏమి పాత్ర ఉండదా అంటే ఎందుకుండదు ? చట్ట ప్రకారం దేవస్థానం కి ధర్మకర్తల