తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

                                                                     


                       తిరుమల తిరుపతి దేవస్థానం ! దేవ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి కోవెల . ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఆర్థికపరంగా వత్సరానికి అన్ని వనరుల నుంచి  వేయి కోట్ల పైన ఆదాయం పొందుతున్న దేవాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు మీద అజమాయిషీ కోసం ప్రభుత్వం I.A.S  కేడర్ కలిగిన అధికారిని కమిషనర్ గా నియమిస్తే ,కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం గ్రూప్ ఆలయాల అజమాయిషీ కోసం ప్రత్యేకంగా  I.A.S  కేడర్ కలిగిన అధికారిని  "కార్య నిర్వాణాధికారిగా " నియమిస్తున్నారు అంటే ఆర్థిక పరంగా ఆ దేవాలయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవచ్చు. తిరుమల క్షేత్ర్రాలు నిర్వహణ కోసం ప్రత్యేక చట్టం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆక్ట్ లో అంతర్భాగంగా ఉంది. తిరుమల కొండ పైన ఉన్న అన్ని విభాగాలకు చెందిన సంస్థలు పంచాయతీ ,పారెస్ట్  లాంటివి కూడా దేవస్థానం E.O అజమాయిషీ లోనే పని చేస్తుంటాయి.

    ఇక పొతే తిరుమల దేవస్థానం కార్యకలాపాలు విషయం లో భక్తులకి ఏమి పాత్ర ఉండదా అంటే ఎందుకుండదు ? చట్ట ప్రకారం దేవస్థానం కి ధర్మకర్తల మండలి ఉంటుంది. అందులో  హిందూ మతానికి చెందిన పరమ భక్తులైన వారు  నియమింపబడాలి అనే చట్టం చెపుతుంది. కానీ దానిని భర్తీ చేసేది ఎవరు? "మాకు మతం తో పని లేదు. మతానికి రాజకీయానికి అస్సలు సంబంధం ఉండకూడదు. మాకు అన్ని మతాలు సమానం . కానీ మత సంస్థలు మీద పెత్తనం చేయాలంటే  మాకు హిందూ మత సంస్థలు అంటేనే ఇష్టం. ఎందుకంటే అన్య మత సంస్థలు జోలికి వెడితే మా వీపులు పగులగొడతారు కాబట్టి , హిందూ సంస్థలు జోలికి తప్ప వేరే మతాలూ జోలికి వెళ్ళo  కాక వెళ్ళo  " . అని ప్రతిన పూనిన రాజకీయ పార్టీలు, వారి అద్వర్యం లో ఏర్పడే ప్రభుత్వాలు. సదరు ప్రభుత్వాలకు ఏమైనా దేవుళ్ళ మీద ,వారికి జరిగే సేవల మీద ఉండే ఆసక్తితో గుళ్ళ మీద అజమాయిషీ కోరుతున్నారా ? అంటే ఆబ్బె అదేమీ కాదు. కేవలం ఆ గుళ్లకు వచ్చే ఆదాయం మీద ఆపేక్షతోనే అనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రం లో వేలాది గుడులు భూములు ఉండి ,ఆక్రమణలకు గురై ఆదాయం లేక ,దూపదీప నైవేద్యాలకు నోచుకోని స్థితిలో  ఉంటె వాటిని పట్టించుకోవడానికి చిత్తశుద్ధి చూపని రాజకీయ ప్రభుత్వాలు ,పెద్ద దేవస్థానాలు మీద శ్రడ్డ చూపుతున్నట్లు ఎందుకు ఉన్నాయి అంటే దాని ద్వారా వారికి కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలే తప్ప అన్యదా కాదు అనేది సత్యం. అటువంటి ఆర్థిక ప్రయోజనాలు సమకూర్చే దేవాలయాలలో తిరుమల దేశం లోనే ప్రధానమైనది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి "బంగారు బాతు " లాంటిది. మరి అలాంటి బంగారు బాటు మీద అజమాయిషీ ని సెక్కులర్ లు మని చెప్పుకునే రాజకీయ పార్టీలు తో ఏర్పడిన ప్రభుత్వాలు వదులుకుంటాయా? చచ్చినా వదులుకోవు. 

      హిందూ సంస్థలు మీద అజమాయిషీ స్వయం ప్రతిపత్తి కలిగిన ధార్మిక మండళ్లకు అప్పచెప్పాలని హిందూ సమాజం ఎప్పటినుండో డిమాండ్ చేస్తుంది. ఇదే విషయమై అనేక కేసులు అటు సుప్రీంకోర్టులోను,ఇటు వివిధ రాష్ట్రాల హై కోర్టులలోను నడుస్తున్నాయి. సెక్కులర్ కంట్రీగా చెప్పబడే భారత దేశం లోని మెజార్టీ ప్రజలు అవలంభించే హిందూ జీవన విధానం కి చెందిన సంస్థలను ఏ మతానికి చెందని ప్రభుత్వాల అజమాయిషీ నుండి విడిపించుకోవడానికి హిందువులు నానా యాతనలు పడాల్సి వస్తుందంటే వారికి ఒక ఐక్య కార్యాచరణ లేక పార్టీల పేరుతొ విడిపోయి ఉండడడమే .  ఆంద్రప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ పదవి నుండి I.V కృష్ణారావు గారిని తొలగించడం వలన  ,మొన్న తిరుమలలో అయినా వంశ పారంపర్య ప్రధాన అర్చకులైన  రమణ దీక్షితులు గారిని చట్ట ప్రకారం అని చెపుతూ రిటైర్మెంట్ ఉత్తరువులు ఇచ్చి ఇంటికి పంపించడం వలన ,దానిని కొందరు, బ్రాహ్మణులు అంటే కమ్మ వారికి ఉన్న కోపం చేతే ఇలాంటి పనులు చేస్తున్నారు అని ఆక్షేపిస్తున్నారు కానీ , ఆ ఇద్దరినీ తొలగించకుంటే ఆ మాట వచ్చి ఉండేది కాదు కదా . అలాగే వారిని తొలగించిన తర్వాత ఆ పోస్టుల్లో నియమితులు అయింది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే తప్పా అన్యులు కాదు కదా . అందుకే ఈ  అంశాన్ని  కమ్మ, బ్రాహ్మణ సామాజిక అంశంగా చూడరాదు . రమణ దీక్షితులు  గారి రిటైర్మెంట్ అంశం పైకి ఏ  కారణంగా కనపడుతున్నప్పటికీ  అది కొన్ని ఏండ్లుగా హిందువులు సాగిస్తున్న "హిందూ సంస్తల స్వాతంత్ర్య ఉద్యమం" లో భాగంగా 
చూడాలి తప్పా , సామాజిక వర్గాల మధ్య ఘర్షణ గా చూడరాదు. అలా చుస్తే అది రాజకీయ నాయకులకే లాభిస్తుంది తప్ప హిందూ సంస్థల పోరాటానికి ఏమాత్రం ఉపయోగ పడదు అని నా అభిప్రాయం . 

    ఇది ఎన్నికల సీజన్ కాబట్టి ఇకనైనా హిందువులు కళ్ళు తెరచి , హిందూ సంస్థల కార్యకలాపాల విషయం లో మనకు పూర్తీ స్వేచ్ఛ నివ్వడానికి ఒప్పుకునే పార్టీలనే గెలిపించాల్సిన  తరుణం ఆసన్నమయింది. 
  ఇదే విషయం గురించి మరింత సమాచారం కొరకు క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.
మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.