విడాకులు విడాకులే , మాజీ మొగుడి మీద పగ పగయే అన్న పెళ్ళానికి సుప్రీం కోర్టు ఎలా కళ్ళెం వేసింది ?
నిజంగా చెప్పేవారు లేక సంసారాలు చెడిపోతున్నాయా ? లేక చెప్పినా వినిపించుకోని భార్యా భర్తల వలన చిద్రమవుతన్నాయో అర్దం కావటం లేదు . పెండ్లి నాడు చేసుకున్న ప్రమాణాలకు అస్సలు విలువ ఇవ్వలేదు సరే , కోర్టుల్లో చేసుకున్న ఒడంబడికకు కట్టుబడకుండా , విడాకులు తీసుకుని , వేరే పెండ్లి చేసుకుని కూడా , మొదటి మొగుడి మీద క్రిమినల్ కేసు కొనసాగాలంటే కుదురుతుందా ?. కుదరదు , అని స్పష్టం గా చెప్పింది భారత ఉన్నత న్యాయస్తానం. వారిద్దరూ భార్యా భర్తలు . వారికి జనవరి 25 1996 లో వివాహం అయ్యింది . వారిద్దరి మద్య పొరపొచ్చాలు ఏర్పడి పెండ్లి అయిన ఏడాదిన్నర కే వివాహం విడాకులు వరకు వెళ్ళింది . 1997 జులై లో భర్త విడాకులుకి అలహాబాద్ కోర్టులో కేసు వేసాడు . నామీదే కోర్టులో కేసు వేస్తావా అన్నట్లు భార్యా నవంబర్ లో అతని మీద 498-A కేసు , వరకట్న కేసు పెట్టింది . అం...