నిర్భయ చట్ట భయం తోనే నందిగామ అమ్మాయి "పూజిత"ను హత్య చేసారా ???
నేను ఇంతకు ముందు నిర్బయ చట్టం కూడా " స్త్రీల చావుకు" కారణాల్లో ఒకటి అవుతుందా!? అనే టపాలో నిర్భయ చట్టం వలన అమ్మాయకులైన ఆడపిల్లలు బలి అయ్యే ప్రమాద ముందని చెప్పాను . మొన్న హైదరాబాద్ పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలో, తగలబడిన శవం రూపంలో కన్పించి , సంచలనం సృష్టించిన "పూజిత " అనే నందిగామకు చెందిన విద్యార్దిని కేసు కూడా అందులో బాగమే అని అనుమానం కలుగుతుంది . వివరాలు లోకి వెలితే , పూజిత విజయవాడలో చార్టర్డ్ అకౌంట్ విద్యార్దిని , ఈమె స్వగ్రామం నందిగామ .ఈమె కొన్నాళ్ళు హైదరాబాద్ లో ఉండి చార్టర్డ్ అకౌంట్ ట్రైనింగ్ తీసుకుందట . అప్పుడు బీహార్ కు చెందిన ఒక పోలిస్ ఆఫీసర్ కొడుకు ఈమెకు బాయ్ ప్రెండ్ అయ్యాడు . ఆమె ఆ తర్వాత విజయవాడ వచ్చినా వారి ప్రెండ్ షిప్ కొనసాగుతూనే ఉంద...