Posts

Showing posts with the label manavuism

వయసు కోరికలు తీరకుండా "మాత "లు గా మారితే , ఇలాంటి 'రోత' పనులే చేస్తారు. !!!

Image
                                                                                                                                                                                                         నేను ఇదే బ్లాగులో కొన్ని టపాలలో ఒక విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. హిందూ అనేది ఒక మతం కాదని, అది ఒక జీవన విదానం అని , ఒక క్రమ పద్దతిలో , ప్రక్రుతి నిర్దేసించిన విదానం లో ఉంటుందని చెప్పడం జరిగింది. దానినే మన వాళ్ళు సింపుల్ గా "ఏ వయసులో ఆ ముచ్చట " అని చెప్పారు. దానిని మను ధర్మం చతుర్  ఆశ్రమ జీవన విదానం అంది. అవి (1). బ్రహ్మచర్యం (2). గృహస్తం (3) వానప్రస్తం (4). సన్యాసం . నిజానికి భారత దేశం లో ఐ క్రమబద్దమైన జీవన విదానం అనుసరిస్తే మనకు గురువులూ అవసరం లేదు, మాత లూ అవసరం లేదు. వానప్రస్తం లో ఉన్న మన పెద్దలే మనకు గురువులు మాతలు అవుతారు. సన్యాస ఆశ్రమం లో ఉన్న వారే మనకు పరమ పూజ్యులు అవుతారు.                                                                కాని మన పెద్దలు మనకు చెప్పిన జీవన విదానం వేరు. మనం అనుసరిస్తుంది వేరు. 60 యేండ్ల వాడు న చెప్పాల్సిన

నిత్యానందమనేది కాంతల కౌగిళ్లలో ఉండేది కాదు........!

Image
                        వీరబ్రహ్మం గారు తన కాలజ్గ్నానం లో "కలి యుగాంతంలో- "ఉల్లిపాయకు ఉపదేశమిచ్చే కల్ల గురువుల్లోస్తారు,  కల్ల గురువులను కాల్చి వేయ కల్కిఅవతారుడు వచ్చేను"    అంటారు. కల్కిఅవతారం సంగతేమో కాని కల్ల గురువులైతే వచ్చేసారు. రావడమేంటి! ఎడా పెడా ఉపదేశాలు, బోదలు, ఉదరగొట్టడాలు, వాళ్లు పోవడాలు,వాళ్లు మిగిల్చిన ఆస్తులు కోసం వారసులు కొట్టుకోవడాలు అన్ని చక చకా జరిగి పోతూనే ఉన్నాయి. అసలు ఈ రోజుల్లొ కాషాయ వస్త్ర దారణ కూడ పెద్ద వ్యాపారమైపొయింది.   చిన్నప్పుడు అమ్మా బాబులని వదలి ఇండ్లలోంచి పారిపోయి, గాలికి తిరిగి, గారడీలు నేర్చుకునిప్రజల్ని తమ మాజిక్లతో  బుట్టలో పడెసుకొని బాగా  సంపాదించి,,ఆశ్రమాలు(విలాసవంతమైన ఆరామాలు) నిర్మించుకుని, సర్వ బోగాలు అనుభవిస్తు, హాయీగా కాలక్షేపాలు చేస్తున్న ఈ సో కాల్డ్ గురువులు నిజంగా హిందు మతానుసారం గురువులనబడినటానికి అర్హులా?.విశ్లేషిద్దాం         హిందూ మతమనేది నిజంగా ఇతర మతాల వలే ఒక మతం కాదు . అది జీవన విదానం .సాక్షాతు మన సుప్రీమ్ కోర్ట్ వారే ఒక కేసులో ఈ విషయాన్ని స్పష్టం చేసారు. హిందువుల జీవన విధానం ఎలా ఉండాలో ధర్మ శాస్త్

కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే.

Image
                                                                   Unlike other religions in the world,the Hindu religion does not claim any one prophet it does not worship any one god; it does not believe in any one philosophic concept; it does not follow any one act of religious rites or performances; in fact, it does not satisfy the traditional features of a religion or creed.IT IS A WAY OF LIFE AND NOTHING MORE... ....                                                                                                                                                                         APEX COURT OF INDIA   హిందూ అనేది అన్ని మతాల వలే కాదని, దానికొక ప్రత్యేకమైన ప్రవక్త,బోధనా లేవని, అది కేవలం ఒక జీవన విదానం తప్పా అన్యదా కాదని ఒక చారిత్రకమైనా తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం ఉద్ఘాటించింది. కాన్ దీనిని హిందూ మత ప్రవచనాలు బోద చేసే వారు, పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అందుకే ఎవరి అరాద్య పురుషుడ్ని వారు తమ దేవుడే గొప్ప దేవుడు, ఆయన చెప్పిందే కరెక్ట్, వేరెవ్వరూ చెప్పి

రజనీష్ బాబా రాసలీలలుకు సహకరిస్తున్నది ఎవరు?

Image
                                                                                                                వండుకుంటే  ఒకటే కూర, అడుకుంటే అరవైఆరు కూరలు రుచి చూడవచ్చు అన్న సిదాంతాన్ని బాగా వంటబట్టించుకున్న ప్రబుద్ధులు కొందరు "బాబా"ల అవతారం ఎత్తి , సదరు సిద్దాంతాన్ని సెక్సువల్ లైఫ్ ఎంజాయిమెంట్ కి అప్లై చేస్తున్నట్లు ఉంది. పెండ్లి చేసుకుంటే ఒక్క దానితోనే జీవితం అంతా సంసారం చేయాలి. అదే పెండ్లి , పెటాకులు లేకుండా బాబాలు అవతారం ఎత్తి "సంసార బాధలకు " తరుణోపాయం చెప్పే క్రమంలో , తనకు  నచ్చిన , తనను మెచ్చిన తరుణీమణులతో కూడి తన జీవితం సుఖమయం చేసుకుంటుoటే , ధర్మం తప్పినా "కామార్ధ మోక్షములు " మాత్రం కంపల్సరీ దక్కుతాయి అని వీరి ఆలోచన కాబోలు . "సంసారి కానీ వాడు సన్యాసి కావడానికి వీలు లేదు " అని హిందూ జీవన విధానం నొక్కి చెపుతున్న  దానిని తుంగలో తొక్కి డైరెక్టుగా బాబాలుగా మారుతున్న ఈ ఆధునిక సన్యాసులకు కావలసింది ఏకకాలంలో "కామార్ధ  మోక్షములు " కాబట్టి వారు కోరుకున్నది ఈ విధంగా  సాధించుకుంటున్నారు.         ఇక ఈ కామ బాబాలను ఆశ్రయించే వారిని ప

ఆస్తిక స్వాములు అరచుకుంటుంటే , నాస్తిక T.V 9 నవ్వుకుందట!!

Image
                                                                                                                             మొన్న T.V 9 ప్రత్యక్ష ప్రసారం చేసిన "స్వాముల లడాయి " అనే కార్యక్రమం చూసాక , ఈ  దేశాన్ని  విదేశి మతాలూ వందల యేండ్లుగా ఎందుకు పరిపాలించాయో చక్కగా అర్దం అయింది. "ఇంటి కుక్క , ఇంటి కుక్కను ఓర్వదు " అన్న చందంగా వ్యవహరిస్తున్న భారతీయ స్వాములు, బాబా శిష్యుల   తీరు అత్యంత గర్హనీయం. వారు గొడవ లేక లడాయి కోసం , ఇంకెక్కడా చోటు దొరకనట్లు పోయి పోయి T.V 9 స్టూడియో లోనే పెట్టుకోవాలా? ఇదెలా ఉందంటే సంసారులు పోయి సాని కొంపలో పంచాయితీ పెట్టుకున్నట్లు ఉంది! సంసార తత్వానికి, సాని తత్వానికి అస్సలు పడదు . మరి అలాంటి సాని కొంపలో సంసారులు వెళ్లి తమ సంసారాలు గురించి గొడవపడుతుంటె , సానికి ఎంత సంబరంగా ఉంటుందో , తమ స్టూడియోలో అరచుకుంటూన్న ఆస్తిక స్వాములను చూస్తుంటె నాస్తిక T V 9 కి కూడా అంతే సంబరంగా ఉండి ఉంటుంది . అందుకే సంతోషంగా "స్వాముల లడాయి" పేరుతో లైవ్ టెలికాస్ట్ చేస్తూ తమ రేటింగ్ లు పెంచేసుకున్నారు.     ఇక TV 9 లో గొడవకు దిగిన స్వాముల విషయానిక

12 యేండ్ల అమ్మాయిని రేప్ చేసి 40 యేండ్లు జైలు శిక్షను అవార్డ్ గా పొందిన కేరళా పాస్టర్ !!

Image
                                                                                                   అతడొక పాస్టర్! పేరు సనాల్ జేమ్స్ ! పై పొటొలో ఉన్న వ్యక్తి. కేరళా రాష్ట్రం లో త్రిస్సూర్ జిల్లాలో పీచీ అనే ఊళ్ళొ చర్చ్ పాస్టర్ గా పదవి వెలగబెడుతున్నాడు. ఇతడు పాస్టర్ ఉన్న చర్చ్ సాల్వేషన్ ఆర్మీ గ్రూప్ కు చెందింది ఆట. అంటే మోక్షం కోసం పని చేసే సైన్యం యొక్క గ్రూపుకు చ్ఝెందిన వాడట ఈ  సనాల్ జేమ్స్ పాస్టర్.     ఈ  మోక్ష ప్రదాత సైన్యం సభ్యుడు ఎంతమందికి మోక్ష మార్గం చూపాడో తెలియదు కాని, తన దగ్గరకు మైనర్ బాలికలు వస్తే మాత్రం కామం తో తహ తహ లాడి పోయే వాడంట. అలా ఇద్దరి మైనర్ బాలికలు మీద , వారి ఇంటి వద్దే  అత్యాచారం చేసాడు అని అతని మీద అభియోగాలు వచ్చయి. ఇది .  2014 ఏప్రిల్ లో ఒక పన్నెండేళ్ళు అమ్మాయి మీద పడి తన పశు వాంఛ తీర్చుకున్నాడు అట. ఇది ఎలా  బయట పడింది అంటె  సదరు మైనర్ బాలికలు కౌన్సిలింగ్ క్లాసులో వారి టిచర్ లకు విషయం చెపితే , వారు పోలీసులకు చెప్పారు అంట . దానితో అతని మీద IPC సెక్షన్ ల తో పాటు  తగిలించి పాస్టర్ గారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రాసిక్యుట్ చేస్తే , తిస్సుర్ జిల్లా కోర్టు

మనకు కావల్సింది "కుల సోషలిజమా?లేక వర్గ సో(శో)షలిజమా?

Image
                                                          మన దేశంలో కుల నిర్మూలన జరగాలని కలలు కన్న వారు కను మరుగై పోయారు.మన బారత రాజ్యాంగ నిర్మాతలు, కుల రహిత, మత రహిత వ్యవస్తను నిర్మించాలన్న అవేశంతో వాస్తవాలను మరచి, ఆదర్శ రాజ్యాంగం నిర్మిస్తే, అది ఆదర్శంగానే అధికార కాకి లెక్కలకు పరిమితమై, సోషలిజం వస్తుందని కలలు కంటే అది "శోష" లిజం గా మారి పోయింది.   కుల వ్రుత్తులకు పేటెంట్ హక్కులు లేకపోవడం వలన, ఎదుటివారి లాబసాటి కుల వ్రుత్తులనబడేవాటినైతే స్వీకరించారు కాని, ఎదుటివాడి కులాన్ని మాత్రం స్వికరించలేక పోయారు.ఇంతకంటే పచ్చి అవకాశ వాదం ఎక్కడైనా ఉంటుందా?   నిజానికి వ్రుత్తులను బట్టే కులాలు ఏర్పడ్డాయి. అసలు వ్రుత్తే చెయ్యనపుడు ఇంకా కులం అనేది ఎక్కడ ఉంటుంది? కాని ఉంది! ఎందుకంటే కులం అనే దానిని వ్రుత్తి నుండి విడదీసి అది ఒక శాశ్వత సామాజిక హోదా గా మార్చాం కాబట్టి!కాబట్టి ఇప్పుడు కులం ను బట్టి వ్రుత్తి చెప్పలేక పోయినా వారి వారి సామాజిక హోదాను అంచనా వెయ్యొచ్చు.అలా అందరి అంటే, అన్ని కులాల సామజిక హోదాను సమానం చెయ్యడమే నిజమయిన సోషలిజం. దీనినే "క్యాస్ట్ సోషలిజం" లేదా "సర్