ఆస్తిక స్వాములు అరచుకుంటుంటే , నాస్తిక T.V 9 నవ్వుకుందట!!

                                                                                       


                                     మొన్న T.V 9 ప్రత్యక్ష ప్రసారం చేసిన "స్వాముల లడాయి " అనే కార్యక్రమం చూసాక , ఈ  దేశాన్ని  విదేశి మతాలూ వందల యేండ్లుగా ఎందుకు పరిపాలించాయో చక్కగా అర్దం అయింది. "ఇంటి కుక్క , ఇంటి కుక్కను ఓర్వదు " అన్న చందంగా వ్యవహరిస్తున్న భారతీయ స్వాములు, బాబా శిష్యుల   తీరు అత్యంత గర్హనీయం. వారు గొడవ లేక లడాయి కోసం , ఇంకెక్కడా చోటు దొరకనట్లు పోయి పోయి T.V 9 స్టూడియో లోనే పెట్టుకోవాలా? ఇదెలా ఉందంటే సంసారులు పోయి సాని కొంపలో పంచాయితీ పెట్టుకున్నట్లు ఉంది! సంసార తత్వానికి, సాని తత్వానికి అస్సలు పడదు . మరి అలాంటి సాని కొంపలో సంసారులు వెళ్లి తమ సంసారాలు గురించి గొడవపడుతుంటె , సానికి ఎంత సంబరంగా ఉంటుందో , తమ స్టూడియోలో అరచుకుంటూన్న ఆస్తిక స్వాములను చూస్తుంటె నాస్తిక T V 9 కి కూడా అంతే సంబరంగా ఉండి ఉంటుంది . అందుకే సంతోషంగా "స్వాముల లడాయి" పేరుతో లైవ్ టెలికాస్ట్ చేస్తూ తమ రేటింగ్ లు పెంచేసుకున్నారు.

    ఇక TV 9 లో గొడవకు దిగిన స్వాముల విషయానికి వస్తే అందులో ఒకరు అది శంకారాచార్య మఠం కి సంబందించిన వారు కాగా మరొకరు సాయిబాబా భక్తాగ్రేసరులు అని చెప్పుకుంటున్న వారు. ఇక్కడ ఆదిశంకరాచార్య గారి సనాతన దర్మం గురించి కాని , సాయిబాబా గారి భక్తీ మార్గం గురించి కాని , "సాయిబాబా దేవుడా కాదా " అనే అంశం గురించి కాని చర్చించదల్చుకోలేదు. పైన తెల్పిన ఇద్దరు స్వాములు బిన్న మార్గాల్లో దైవ దర్సనం చేసుకుంటున్న వారు . ఒకరిది జ్ఞాన మార్గం అయితే మరొకరిది భక్తీ మార్గం. అందులో ఏ మార్గం  సరి అయినది అనే దానికంటే హిందూ జీవన విదానం లో ఈ రెండు  విదాలు అంతర్బాగమే అని గుర్తుంకొవడమ్ సరి అయినది. 

      శంకారాచార్య మఠం ప్రతినిది గా వచ్చిన స్వామీ యొక్క ముక్యమైన ఎలిగేషన్ ఏమిటంటే , తమ సనాతన ధర్మాన్ని , పద్దతులను సాయిబాబా అనుచరులు కాపీకొడుతూ , సాయి బాబా ని పోకస్ చేస్తున్నారని , కాబట్టి  అది సనాతన ధర్మానికి విరుద్దం అని.ఈ  వాదనలో ఉన్న  నిజం ఉందా లేదా అనేదాని గురించి చర్చించే ముందు అసలు ప్రస్తుత హిందూ సమాజానికి ఎవరి వలన ఎక్కువ కీడు జరుగుతుందో తెలుసుకుంటె , ఇలా హిందూ అనైక్యతకు దారి తీసే వాదాలకు తావు ఇవ్వడం ఎంత బుద్ది తక్కువో అర్ధం అవుతుంది.

                     అసలు హిందూ మతాల లోని పద్దతులను అంటే దెవాలయ నిర్మాణాలు మొదలుకుని, పాటలు, స్త్రోతాలు అన్ని కాపీ కొడుతూ విదేశి దేవుల్లను స్వదెశి ప్రజలలో ప్రమోట్ చేస్తున్న అన్యమతాల వారి ఆగడాలను ప్రస్నించడమ్ మానేసి, స్వదేశి సాయిబాబా మీద విరుచుకుపడడమ్ ఎంతవరకు సమంజసం?  నాకు తెలిసీ  అంతర్వేది లక్ష్మీ నరసింహా స్వామీ ఆలయం లో , కల్యాణం సందర్బంగా వచ్చే భక్తులకు  ఇచ్చే పాసులలో ఏసుక్రీస్తు ఫొటో వేసి ఇచ్చారు అంటే , మన దేవాలయాలను , దేవుళ్ళను అన్యమతం  వారు ఎలా పబ్లిసిటీకి వాడుకుంటున్నారో తెలుస్తుంది.పూర్తి వివరాలకు ఇక్కడ  క్లిక్ చేయండి .  ఎవరు అవునన్నా కాదన్నా సాయి బాబా లక్షలాది ప్రజల చేత  దేవుడిగా కొలవబడుతున్న మహనీయుడు. మరి ఆయన మీద విమర్శలు చేసి ఆ భక్తులను మనోబావాలు గాయపరచడం , వారిని దూరం చేసుకోవాలని చూడడమ్ అవివేకం. 

                ఇక పోతే సాయిబాబా భక్తాగ్రేసరుడిగా చెప్పుకునే మహరిషికి కనీస పద్దతులు తెలియకపోవడమ్ బాదాకరం. పబ్లిక్ గా డిస్కషన్ జరుగుత్న్నప్పుడు ఒక స్వామి  తనతో ఎంతో సహనంగా వాదన చేస్తున్నప్పుడు, ఆయనగారి పట్ల కనీస గౌరవం చూపకుందా ఒక సంస్కారం లేని వ్యక్తిగా మాట్లాడం గర్హనీయం. ఇలాంటి చర్యలు భక్తుల మద్య గొడవలకు దారి తీసి అంతిమంగా హిందూ సమాజాన్నే బ్రష్టు పట్టిస్తాయి. 

    ఏది ఏమైనా ఈ విషయం లో మనందరం గుర్తుంచుకోవలసిన ముక్యమైన విషయం  ఒకటి ఉంది. హిందూ అనేది ఒక మతం కాదు అది ఒక జీవన విదానం . ఇది ఏ ఒక్కరి చేతనో ఉద్బవించలేదు. మరే ఒక్కరి చేతనో అంతంకాదు. ఇందులో అన్ని దర్శానాలు అంతర్బాగంగా ఉంటాయి. వైష్ణవం , శైవం, గాణ పత్యం, శాక్తేయాం ఎలాగొ సాయిబాబీయమ్ కూడా అంతే. ఒకప్పుడు వైష్ణవులు శైవులు కలహించుకుని  సమాజం లో అనైక్యత ఏర్పడబట్టె వందలాది ఏండ్లు విదేశి మతాలకు సంబందించిన వారి ఏలుబడిలో ఉండాల్సిన దౌర్బాగ్య పరిస్తితి. మల్లీ అలాంటి  పరిస్తితులు తేవద్దు అని స్వాములకు బాబాలకు విజ్ఞప్తి . అలాగే ఇలాంటి  పనికి మాలిన వాదనలు పట్టించుకోవద్దని భక్తులకు విజ్ఞప్తి . హిందూ అంటె ఏమిటొ మన సుప్రీం కోర్టువారు స్పష్టంగా చెప్పారు. అదేమిటో చూడండి . 

          Unlike other religions in the world,the Hindu religion does not claim any one prophet it does not worship any one god; it does not believe in any one philosophic concept; it does not follow any one act of religious rites or performances; in fact, it does not satisfy the traditional features of a religion or creed.IT IS A WAY OF LIFE AND NOTHING MORE...
                                                                                                     APEX COURT OF INDIA

Comments



  1. స్వాముల లడాయి జూడుము
    పాముల వోలెన్ జిలేబి పాగెము లేకన్ !
    వేమన, వేదం, వేర్వే
    రా ? మది గొనుమా సతతము రాముని గొలుమా !

    ReplyDelete
    Replies
    1. Nice!thanks for your response Zilebi garu

      Delete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం