సెల్ స్క్రీన్ పగులగొట్టిందని, నాయనమ్మ నెత్తి పగులగొట్టి చంపిన మనవడు ! !



                         ఆమె పేరు లక్ష్మమ్మ . వయస్సు 90 సంవత్సరాలు పై మాటే. వృద్దాప్యం లో ఉంది కాబట్టి కొడుకు పంచన బ్రతుకుతుంది కాబోలు. ఉండేది బెంగలూరులోని కదరణ హళ్లి ప్రాంతం లో . తన తొంబై యేండ్లు జీవితం లో ఎన్నో పురుళ్ళు పోసి ఉంటుంది. ఎన్నో చావులను చూసి ఉంటుంది. కాని తన చావు తన మనవడి చేతిలో ఉంటుందని  , కళ్ళు కనపడక చేసిన ఒక చిన్న తప్పుకు తన మనవడు తనకు మరణ శిక్ష వేస్తాడని పాపం ఊహించి ఉండదు. బోడి సెల్ స్క్రీన్ పగిలిందని 90 యేండ్ల నానమ్మను 22 యేండ్ల  మనవడు  నెత్తి పగులగొట్టి చంపిన ఉదంతం పోయిన  సోమవారం బెంగలూరులో జరిగింది. అదెలా అంటె

   లక్ష్మమ మనవడు శివరాజ్ తన సెల్ ని లివింగ్ రూం లో చార్జింగ్ కి పెట్టి వెల్లాడట . కళ్ళు సరిగా కనిపించని లక్ష్మమ్మ గారు అటుగా వెలుతుంటే ,పొరపాటున చార్జింగ్ వైర్ కి కాలు తగిలి ఆ అదాటులో సెల్ క్రిందపడి స్క్రీన్ మాత్రమే ముక్కలు అయింది అట. దానితో వెర్రి గంగిరిలు ఎత్తిన శివరాజ్ , కోపంతో ముసలమ్మను ఒక చెక్క పలక పెట్టి గొంతు మీద కొడితే , "అమ్మా " అని అక్కడే కుప్పకూలి పోయిందట. దానితో కుతుంబసబ్యులు వచ్చి మనవడి మీద కేకలు వేసారు అట! అయ్యో ఎంత పని జరిగిందే అని ఆమెను ఆమె రూమ్ కు తీసుకు వెళ్లి సపర్యలు చేసారట. పేపర్లో వచ్చిన సమాచారం ప్రకారం ఆమె గాయానికి  గృహ వైద్యం తో సరి పెట్టారు తప్పా , హాస్పిటల్ కి తీసుకు వెళ్లి సరి అయిన వైద్యం చేయించినట్లు లేదు. అందుకే ఆమె గారు ఉదయం కల్లా మరణించి తన రూములో విగత జీవిగా పడి ఉంది. అప్పుడు హడావుడిగా ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లారట బాద్యత లేని రక్తబందువులు. 

               చివరకు విషయం పోలీసులకు తెలిసి  వారు వచ్చి నాయనమ్మ శవాన్ని పోస్ట్మార్టం కు , మనవడు వేదవను పోలిస్ స్టేషన్ కు తరలించారు. నా ద్రుష్టిలో ఇందులో మనవడి తప్పు ఎంత ఉందో ,ఇతర కుటుంబ సబ్యుల తప్పు అంతే ఉంది. బలమైన దెబ్బ తగిలి సృహ కోల్పోయిన ఆ వ్రుద్దురాలికి సరి అయిన వైద్య సేవలు అందించాల్సిన బాద్యతను విస్మరించిన ఆ కుటుంబ పెద్దలను కూడా కేసు పెట్టి ప్రాసి క్యుట్ చేయాల్సి ఉండే . కాని ఇది ఇండియా కదా? ఇక్కడ  గృహ హింస చట్టం అనేది వయసులో ఉన్న కోడళ్ళ కు వర్తిస్తుందని  అని మాత్రమే తెలుసు తప్పా  , వయసు మళ్ళిన అమ్మామ్మ  నానమ్మ లకు కూడా వర్తిస్తుందని తెలియదే! 

    ఇది టైమ్స్ అప్ ఇండియా వారి ఆన్లైన్  పేపర్లో ప్రచురితమైన క్రింది  వార్తాకధనం ఆదారంగా ప్రస్తావించడమైనది . 
     
          Bengaluru: A 90-year-old woman was killed after her grandson hit her with a wooden plank when she unintentionally damaged his new mobile phone. The 22-year-old had kept the phone on charge in the drawing room of their house at Kadirenahalli in Banashankari on Monday night.
His grandmother Lakshmamma, who had poor eyesight, failed to notice the phone and accidentally touched it while walking in the room. The cellphone fell down and the screen cracked into pieces.
Shivaraj, who heard the noise, rushed to the drawing room and found the mobile phone damaged. In a fit of rage, he grabbed a wooden plank and hit Lakshmamma on her neck. She collapsed with pain. Other members of the family shouted at Shivraj for hitting Lakshmamma, and took her to her bedroom and nursed her to sleep.
On Tuesday morning, Lakshmamma did not respond when family members tried to wake her up. They shifted her to a nearby private hospital where she was declared brought dead.
Banashankari police sent her body for postmortem and arrested Shivaraj

                     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!