పేస్ బుక్ లో పులి ! అసలు పని చెయ్యాల్సి వస్తే ఒంట్లో చలి !?
ఈ రోజు ఈనాడు పత్రికలో ఒక ఆర్టికిల్ వచ్చింది . పేస్ బుక్ లో వీరాది వీరుల్లా చెలరేగి గంటలు గంటలు చాటింగ్ చేసే కుర్ర కారు , కూరగాయల మార్కెట్ కు వెళ్లి వెళ్లి బేరం ఆడడానికి తెగ కంగారు పడి పోతున్నారట . ఇటువంటి పరిస్తితిని అదిగమించాలంటే, తల్లి తండ్రులు అప్పుడప్పుడు పిల్లలను వెంట పెట్టుకుని మార్కెట్ కు తీసుకు వెళ్లి బేరమాడే విదానం నేర్పడమే బెస్ట్ అని మానసిక నిపుణులు సెలవిస్తున్నారట !. కూరగాయలు బెరమాడడానికే తెగ కంగారు పడిపోతున్న కుర్రకారు , తమ పెస్బుక్ మిత్రులతో గంటలు గంటలు ఎలా చాటింగ్ చేయగలుగుతున్నారు అంటే ఒకటే కారణం కావచ్చు. పేస్ బుక్ మిత్రులుకు సమాదానమివ్వడానికి కావలసినoత టైం ఉంటుంది . ఎందుకంటే పేస్ బుక్ లో ఒకే సమయంలో నలుగురైగురితో చాటింగ్ చెయ్యడానికి విలు ఉంటుంది కాబట్టి , ఇవతలి వారు సమాదానమివ్వడానికి లేట్ చేసినా అవతలి వారు అసహనం చూపరు . కాని కూరాగాయల బేర గాడు అoత సమయం ఇవ్వడు కదా ! "ఏంటయ్యా ! కొంటె కొను .లేకుoటే లేదు . నా బేరం చెడగొట్టకు " అంటాడు . దానితో కంగారు . చివరకు బేరం ఆడలేక, వాళ్ళు చెప్పిన